అంతరిక్ష విభాగం
భవిష్య చంద్ర అన్వేషణ మిషన్ రోడ్‌మ్యాప్, ఆర్బిటర్లు, ల్యాండర్లు, రోవర్ల ద్వారా చంద్రుని పై మరింత రోబోటిక్ అన్వేషణకై భావగ్రహణం, సాధ్యాసాధ్య అధ్యయనాలు దశలో ఉందన్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్
Posted On:
07 FEB 2024 3:10PM by PIB Hyderabad
ఇస్రో అభివృద్ధి చేయనున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ (బిఎఎస్ - స్థావరం) ప్రతిపాదిత కన్ఫిగరేషన్ (ఆకృతీకరణ/ సముగ్రాకృతి) భావగ్రహణ దశలో ఉందని, ఇందులో మొత్తం నిర్మాణ శైలి, సంఖ్య, మాడ్యూళ్ళ రకం, డాకింగ్ పోర్టులు తదితరాలను అధ్యయనం చేస్తున్నారని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు.
అంతరిక్ష స్టేషన్‌ను 2035 నాటికి ఏర్పాటు చేసే దిశగా, ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ (బిఎఎస్) సమగ్రాకృతిపై పని చేస్తోందని, ఈ స్టేషన్‌ను దశల వారీగా కూర్చాలని ప్రణాళిక సిద్దం చేశారని డా. జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇందు కోసం, విభిన్న మాడ్యూళ్ళు, వాటి సంబంధిత ప్రయోగాలను సాకారం చేయడం కోసం భావి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు.
చంద్రునిపై శాంపుళ్ళ సేకరణ, తిరిగి రావడంతో పాటు ఆర్బిటర్లు (కక్ష్యలో తిరిగేవి), ల్యాండర్‌లు, రోవర్ల ద్వారా చంద్రుని మరింత రోబోటిక్ అన్వేషణ కోసం సాధ్యాసాధ్య అధ్యయనాలు చేపట్టడంతో పాటు, భారత భవిష్య చంద్ర అన్వేషణ మిషన్‌ల కోసం రోడ్‌మ్యాప్ సంభావ్యత అధ్యయనాల దశలో ఉందని మంత్రి చెప్పారు.
సాధ్యాసాధ్యాల అధ్యయనాలు పూర్తయిన తర్వాత, తగిన దశలో అధికారిక ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనను ఉంచి తర్వాత అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు కోసం నిధుల కేటాయింపును కోరనున్నట్టు ఆయన వివరించారు.
***
(Release ID: 2003747)
Visitor Counter : 231