సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం కంప్యూటరీకరణ

Posted On: 07 FEB 2024 5:48PM by PIB Hyderabad

సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్‌సీఎస్‌) కార్యాలయం పనితీరును బలోపేతం చేయడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. అవి:

  1. ఇప్పటికే ఉన్న చట్టానికి అనుబంధంగా & 97వ రాజ్యాంగ సవరణ నిబంధనలను చేర్చడం ద్వారా మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్‌లో (ఎంఎస్‌సీఎస్‌) నిర్వహణ మెరుగుపరచడానికి, పారదర్శకత & జవాబుదారీతనం పెంచడానికి, ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) చట్టం & రూల్స్ 2023ను 03.08.2023న, 04.08.2023న నోటిఫై చేశారు.
  2. పని సామర్థ్యాన్ని పెంచడానికి, పని చేయడానికి తగినంత స్థలాన్ని అందించడానికి న్యూదిల్లీలోని నౌరోజీ నగర్‌లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో సీఆర్‌సీఎస్‌ ఆధునిక కార్యాలయం ప్రారంభమైంది.
  3. సీఆర్‌సీఎస్‌ కార్యాలయం పనితీరు మెరుగుపరచడానికి 32 సాంకేతిక & 31 సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 63 ఉద్యోగాలను సృష్టించడం జరిగింది. సాంకేతిక ఉద్యోగాల భర్తీ కోసం నియామక నిబంధనలను 01.09.2023న ప్రకటించారు. ఇప్పటికే 5 పోస్టులను డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేశారు.
  4. నమోదు, బై-లాస్ సవరణ, వార్షిక రిటర్న్ సమర్పణ, శాఖల ప్రారంభం, సేల్స్ ఆఫీసర్ నియామకం మొదలైనవి సహా ఎంఎస్‌సీఎస్‌ల కోసం పూర్తి డిజిటల్ వ్యవస్థను అందించేలా సీఆర్‌సీఎస్‌ కార్యాలయం కోసం సమగ్ర వెబ్ పోర్టల్ www.సీఆర్‌సీఎస్‌.gov.in ను 06.08.2023న ప్రారంభించించడం జరిగింది.

సీఆర్‌సీఎస్‌ కార్యాలయం పనితీరును మెరుగుపరచడానికి చేపట్టిన అన్ని చర్యలు బహుళ-రాష్ట్ర సహకార సంఘాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తాయి. నిర్వహణ మెరుగుపరచడం, పారదర్శకత పెంచడం, మదింపు ప్రక్రియను బలోపేతం చేయడం, స్వేచ్ఛ & న్యాయమైన ఎన్నికలను నిర్వహించడం, సభ్యుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడం, నిబంధనలు అమలు చేయడం, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మెరుగుపరచడం, సీఆర్‌సీఎస్‌ కార్యాలయం ద్వారా పటిష్టమైన పర్యవేక్షణ వంటి వాటి ద్వారా  సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

కేంద్ర సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ విషయాన్ని తెలిపారు.

***


(Release ID: 2003741) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi