రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్రపు దొంగలు హైజాక్ చేస్తున్న నౌకలు
Posted On:
02 FEB 2024 3:36PM by PIB Hyderabad
గత మూడేళ్ళలో సముద్రపు దొంగలు ఏడు నౌకలను సముద్రంలోనే హైజాక్ చేసిన ఘటనలు నమోదయ్యాయి. వాణిజ్య నౌక - లైలా నార్‌ఫోక్ హైజాక్ ఘటన ఇందులో ఒకటి. జనవరి 04-05, 2024న చోటు చేసుకున్న ఈ నౌకలో 15మంది భారతీయులు సహా మొత్తం 21మంది సిబ్బంది ఉన్నారు. తర్వాత, చేపలు పట్టే నౌక - ఇమాన్ (IMAN)ను జనవరి 28, 2024న & మరొక చేపలు పట్టే మరొక నౌక ఆల్ నీమీ (AI Naeemi)ని జనవరి 29, 2024న హైజాక్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా, వీటిలో భారతీయ సిబ్బంది లేరు.
భారత నావికాదళం సముద్ర భ్రదతను ప్రోత్సహించడానికి ప్రాంతీయ, అదనపు ప్రాంతీయ నావికాదళాలు/ సముద్ర బలగాలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
2008 నుంచి భారతీయ నావికాదళం గల్ఫ్ ఆఫ్ ఈడెన్, ఆఫ్రికాలోని తూర్పు తీరంలో సముద్ర దొంగతనాలను నిలువరించేందుకు గస్తీ కోసం యూనిట్లను మొహరించింది. ఇప్పటివరకూ 3,440 నౌకలు, 25వేల మందికి పైగా నావికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఈ ప్రాంతంలో సముద్ర తీర భధ్రతను పునరుద్ధరించేందుకు, నౌకల ఉనికిని పెంచడం, సముద్ర గస్తీ విమానం ద్వారా నిఘా/ మధ్య అరేబియా సముద్రంలోనూ, సొమాలియా తూర్పు తీరంలో రిమోట్‌గా పైలెట్ చేసిన విమానాలను భారత నావికాదళం చేపట్టింది. అరేబియా సముద్రంలో & గల్ఫ్ ఆఫ్ ఈడెన్ / పొరుగు ప్రాంతాలలో తిరుగుతున్న వాణిజ్య నౌకలలో భారతీయ సిబ్బంది గురించిన వివరాల కోసం డిజి (షిప్పింగ్)తో, జాతీయ, అంతర్జాతీయ సముద్ర భద్రతా ఏజెన్సీలతో సమన్వయపూరిత రీతిలో తక్షణ స్పందన, సమర్ధవంతమైన అనుసంధానం, సహకారం కోసం సమాచార మార్పిడి. దీనికి అదనంగా, ఈ ప్రాంతంలో సముద్ర భద్రత కోసం ఈ ప్రదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చేపలు పట్టే నౌకలు / పడవలను భారతీయ నావికాదళం ప్రశ్నిస్తోంది.
ఈ ప్రాంతంలో సముద్ర భద్రతను పునరుద్ధరించే దిశగా మధ్య అరేబియా సముద్రంలో, సొమాలియా తీరానికి తూర్పున నౌకల ఉనికిని, సముద్ర గస్తీ విమానం / రిమోట్ పైలట్ చేసిన విమానాల ద్వారా వైమానిక నిఘాను భారతీయ నావికాదళం పెంచి, మెరుగుపరిచింది. పాక్ స్ట్రెయిట్‌లో ఎటువంటి సముద్రపు దొంగతనాలకు సంబంధించిన ఘటనలూ నమోదు కాలేదు.
లోక్‌సభలో శ్రీ ఎ. గణేశమూర్తి అడిగిన ప్రశ్నకి లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్‌భట్ ఈ సమాచారాన్ని వెల్లడించారు.
***
(Release ID: 2001983)
Visitor Counter : 141