ఆర్థిక మంత్రిత్వ శాఖ
రెట్టింపై రూ. 1.66 లక్షల కోట్లకు చేరిన సగటు నెలవారీ స్థూల జిఎస్టీ వసూలు
జీఎస్టీ అనంతరం కాలంలో 1.22 పుంజుకొన్న రాష్ట్రాల ఎస్జీఎస్టీ ఆదాయం
జీఎస్టీ అతిపెద్ద లబ్ధిదారులు వినియోగదారులే అన్న ఆర్థిక మంత్రి
Posted On:
01 FEB 2024 12:39PM by PIB Hyderabad
భారతదేశంలో ఛిన్నాభిన్నమైన పరోక్ష పన్ను విధానాన్ని ఏకీకృతం చేయడం ద్వారా జిఎస్‌టి వాణిజ్యం, పరిశ్రమలపై అనువర్తన భారాన్ని తగ్గించిందని గురువారం నాడు 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఒక ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వే ప్రకారం, 94శాతం అగ్రశ్రేణి పరిశ్రమల యజమానులు జిఎస్టీని సానుకూలమైదానిగా చూస్తున్నారని, ఇక 80శాతం రెస్పాండెంట్ల ప్రకారం అది సరఫరా లంకెను అనుకూలపరిచిందని అని ఆమె అన్నారు. అదే సమయంలో జిఎస్టీ పన్ను పునాది రెండింతలై, ఈ ఏడాది నెలవారి స్థూల జిఎస్టీ వసూలు అన్నది రూ.1.66 లక్షల కోట్లయిందన్నారు.
రాష్ట్రాలలో పెరిగిన ఆదాయం గురించి మాట్లాడుతూ, జిఎస్టీ అనంతర కాలంలో అంటే 2017-18 నుంచి 2022-23 వరకు రాష్ట్రాలకు విడుదల చేసిన పరిహారంతో సమా రాష్ట్రాల ఎస్‌జిఎస్‌టి ఆదాయం 1.22 మేరకు పుంజుకుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. ఇందుకు విరుద్ధంగా జిఎస్టీ ముందస్తు నాలుగేళ్ళ కాలం, అంటే, 2012-13 నుంచి 2015-16 వరకు పన్నుల ఉపసంహరణ రూపంలో రాష్ట్ర ఆదాయాల పన్ను పెరుగుదల కేవలం 0.72గా మాత్రమే ఉందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చును, పన్నులను తగ్గించడం వల్ల అనేక వస్తువులు సేవల ధరలు తగ్గి, వినియోగదారులు అతిపెద్ద లబ్ధిదారులయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు.
నేషనల్ టైమ్ రిలీజ్ అధ్యయనం నుంచి ప్రస్తావిస్తూ, గత నాలుగేళ్ళగా, అంటే 2019 నుంచి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు కస్టమ్స్ తీసుకున్న చర్యల ఫలితంగా ఇన్‌లాండ్ కంటైనర్ డిపోలలో సరుకు దిగుమతి చేసే సమయం 47 శాతం తగ్గి, 71 గంటలకు రాగా, ఎయిర్ కార్గో సముదాయాలలో 28 శాతం తగ్గి 44 గంటలకు, ఓడరేవుల వద్ద 27 శాతం తగ్గి 85 గంటలకు వచ్చిందని తెలిపారు.
***
(Release ID: 2001457)
Visitor Counter : 136