బొగ్గు మంత్రిత్వ శాఖ
ఇంధన సామర్థ్యంలో బొగ్గు రంగం పురోగతి; కర్బన సమస్థితి వైపు అడుగులు
బొగ్గు కార్యదర్శి ఇంధన పరిరక్షణలో ఇటీవలి కార్యక్రమాలను సమీక్షించారు
బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూలు విద్యుత్శక్తి ఆదా సామర్థ్య చర్యలను మరింతగా పెంచుతాయి
Posted On:
19 JAN 2024 5:51PM by PIB Hyderabad
నవీకరించబడిన ఎన్ డీ సీ ప్రకారం 2030 నాటికి భారతదేశం తన జీ డీ పి యొక్క ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించడానికి కట్టుబడి ఉంది. వివేకవంతమైన విద్యుత్ వనరుల వినియోగం యొక్క అత్యంత ప్రాముఖ్యతను గుర్తిస్తూ విద్యుత్ ఆదా మరియు సామర్థ్య చర్యలలో ప్రముఖంగా బొగ్గు రంగం ముందంజలో ఉంది. ఈ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సాధారణంగా, వినియోగ స్థాయిలో ఒక యూనిట్ శక్తిని ఆదా చేయడం వల్ల కొత్త విద్యుత్ సామర్థ్యాల సృష్టి అవసరాన్ని 2 నుండి 2.5 రెట్లు తగ్గించవచ్చు.
గత 3 సంవత్సరాలుగా, బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూలు విద్యుత్ శక్తి తనిఖీలు, విద్యుత్ ఆదా-సమర్థవంతమైన ఎల్ ఈ డీ లైట్‌లకు మారడం, స్టార్-రేటెడ్ ఉపకరణాలను వినియోగించడం, కెపాసిటర్ బ్యాంక్‌లను ఇన్‌స్టాల్ చేయడం, వీధి లైట్లలో ఆటో-టైమర్‌లను ఉపయోగించడం, విద్యుత్ శక్తి ఆదా కు సమర్థవంతమైన పంపులు మరియు ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వివిధ విద్యుత్ శక్తి ఆదా మరియు సామర్థ్య చర్యలను శ్రద్ధగా అనుసరించాయి. ఇటువంటివిద్యుత్ శక్తి నిర్వహణ కార్యక్రమాలు నేరుగా కార్బన్ పాదముద్రలో గణనీయమైన తగ్గింపుకు దారితీస్తాయి. ప్రపంచ పర్యావరణ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి.
సీ ఐ ఎల్ కార్పొరేట్ హెచ్‌క్యూ, కోల్‌కతాలో ఇ-వాహనాల విస్తరణ
సీ ఐ ఎల్ మరియు దాని అనుబంధ సంస్థలలో సమగ్ర విద్యుత్ శక్తి ఆదా సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడానికి కోల్ ఇండియా లిమిటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌తో ఎం ఓ యూ కుదుర్చుకుంది. ఈ చొరవ లో భాగంగా బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్‌లు, కాలం చెల్లిన ఫ్యాన్‌లు, ఎయిర్ కండిషనర్లు మరియు సంప్రదాయ లైట్ ఫిట్టింగ్‌లు మార్పు, మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరియు పంపిణీ చేయబడిన మరియు రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల స్థాపన లు ఉన్నాయి.
బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ ల కమాండ్ ప్రాంతాలు, ప్రాంగణాలు, కంపెనీ ప్రధాన కార్యాలయాలు, అన్ని గనులు, కార్యాలయాలు, గిడ్డంగులు, కాలనీలు, నివాసాలు, క్యాంపస్, రెస్ట్‌రూమ్‌లు మొదలైనవాటిల్లో విజయవంతంగా అన్ని సంప్రదాయ లైట్లను శక్తి-సమర్థవంతమైన ఎల్ ఈ డీ లైట్లు ఏర్పాటు తో సుస్థిరత మరియు శక్తి ఆదా సామర్థ్యానికి నిబద్ధత వైపు మొదటి మైలురాయి దాటాయి. ఈ విస్తృతమైన అమలు లైటింగ్ అవసరాలను మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలతో అసమర్థ లైటింగ్ సిస్టమ్‌లను భర్తీ చేయడానికి అంకితమైన ప్రయత్నాన్ని ప్రదర్శిస్తుంది.
ఎఫ్ వై 2021-22 నుండి డిసెంబర్ 2023 వరకు, బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ లు 4.24 లక్షల సంప్రదాయ లైట్ల స్థానంలో ఎల్ ఈ డీ లైట్లు, 5357 సమర్థవంతమైన ఎయిర్ కండీషనర్లు, 83236 సూపర్ ఫ్యాన్లు, 201 ఎలక్ట్రిక్ వాహనాలు 1583 సమర్థవంతమైన వాటర్ హీటర్లు, పంపుల కోసం 444 శక్తి-సమర్థవంతమైన మోటార్లు, వీధి దీపాలలో 2712 ఆటో-టైమర్లు మరియు కెపాసిటర్ బ్యాంకుల సంస్థాపన విస్తరణతో సహా విద్యుత్ ఆదా సామర్థ్యం వైపు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశాయి. విద్యుత్ ఆదా సామర్థ్య చర్యలను అనుసరించడం వలన చెప్పుకోదగ్గ విజయాలు సాధించబడ్డాయి, మొత్తం 14.34 కోట్ల కే డబ్ల్యూ హెచ్ విద్యుత్ పొదుపు మరియు రూ. 107.6 కోట్ల ఆర్థిక పొదుపులను అందించింది. ఇంకా, ఈ ప్రయత్నాలు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించాయి, 1.17 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలకు సమానమైన సీ ఓ 2ని సమిష్టిగా తగ్గించడంలో ముగుస్తుంది.
కార్యదర్శి (బొగ్గు) 19.01.2024న బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ లు చేపట్టిన ఇంధన సామర్థ్య చర్యలను సమీక్షించారు మరియు ఈ చొరవపై బొగ్గు రంగంలో జరుగుతున్న విశేషమైన పనులను ప్రశంసించారు. సమావేశంలో, కార్యదర్శి (బొగ్గు) డీ జీ ఎం ఎస్ తో సంప్రదించి రవాణా మరియు మైనింగ్ కార్యకలాపాలలో ఈ విల వినియోగాన్ని , బొగ్గు/లిగ్నైట్ పిఎస్‌యుల యొక్క అన్ని భవనాలలో దశలవారీగా భవన ఇంధన సామర్థ్య చర్యలు చేపట్టాలని, మైనింగ్ కార్యకలాపాలలో ఎల్‌ఎన్‌జి వాహనాలను ఉపయోగించడం మొదలైనవాటిని సూచించారు. .
బొగ్గు/లిగ్నైట్ పిఎస్‌యుల ద్వారా విద్యుత్ ఆదాకు దాని కార్బన్ పాదముద్రను తగ్గించడానికి మరియు దేశం యొక్క ఇంధన డిమాండ్‌లను తీర్చేటప్పుడు దాని కార్యకలాపాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి వినూత్న పరిష్కారాలను స్వీకరించడానికి అవి చేపట్టిన వివిధ కార్యక్రమాలు వాటి అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తాయి.
జీ 20 న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్‌కు అనుగుణంగా బొగ్గు/లిగ్నైట్ పీ ఎస్ యూ ల నిబద్ధత ఉంటుంది, అదేవిధంగా జీ 20 మరియు కాప్-28 ప్రకారం 2030 నాటికి విద్యుత్ శక్తి సామర్థ్య మెరుగుదల రేటును రెట్టింపు చేసేందుకు స్వచ్ఛంద నిబద్ధతకు కట్టుబడివుంటుంది.
***
(Release ID: 1998159)
Visitor Counter : 104