ఆర్థిక మంత్రిత్వ శాఖ
చమురు మార్కెటింగ్ కంపెనీల ఎస్‌బి 2024కి సంబంధించిన 8.20% తిరిగి చెల్లింపు
Posted On:
19 JAN 2024 6:01PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీల ఎస్‌బి (ప్రత్యేక బాండ్లు) 2024కు సంబంధించిన 8.20% చెల్లించవలసిన బకాయిలు 12 ఫిబ్రవరి, 2024 నాటితో సమానంగా తిరిగి చెల్లించవచ్చు. పేర్కొన్న తేదీ నుంచి దానిపై ఎటువంటి వడ్డీ జమకాదు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (బదలాయింపు పత్రము) చట్టం, 1881 కింద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే రోజును శలవుగా ప్రకటిస్తే, ఆ రాష్ట్రంలో చెల్లింపు కార్యాలయాలు ముందు పనిదినం నాడు తిరిగి చెల్లిస్తాయి.
ప్రభుత్వ సెక్యూరిటీల నిబంధనలు, 2007లోని ఉప నిబంధనలు 24(2) & 24 (3) ప్రకారం గడువు పూర్తి అయిన చెల్లింపును అనుబంధ సాధారణ లెడ్జర్ లేదా రాజ్యాంగ అనుబంధ సాధారణ లెడ్జర్ ఖాతా లేదా స్టాక్ సర్టిఫికెట్ రూపంలో ఉన్న ప్రభుత్వ హామీ పత్రాలను రిజిస్టర్డ్ హోల్డర్ (నమోదైన సంస్థ/ వ్యక్తి) కు చెల్లించాలి. వారి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను పొందుపరిచే పే ఆర్డర్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నిధులను స్వీకరించే సదుపాయం ఉన్న బ్యాంకులో హక్కుదారు ఖాతాలోక్రెడిట్ చేయడం జరుగుతుంది.
హామీ పత్రాలకు సంబంధించి చెల్లింపులు చేయడం కోసం, అసలు చందాదారు లేదా అటువంటి ప్రభుత్వ హామీ పత్రాలు కలిగిన తర్వాతి హక్కుదారులు చాలా ముందస్తుగానే తమ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన తగిన వివరాలను సంబంధించాలి.
అయితే, బ్యాంకు ఖాతా/ ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నిధులను అందుకోవడానికి అవకాశం లేనప్పుడు గడువు తేదీలోగా రుణాన్ని చెల్లించడానికి వీలుగా హోల్డర్లు (హక్కుదార్లు) ప్రజా రుణ కార్యాలయాలు, ట్రెజరీలు/ సబ్- ట్రెజరీల వద్ద, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల (వడ్డీ చెల్లింపు కోసం వారు రాతపూర్వకంగా/ నమోదు అయి ఉన్నప్పుడు) సక్రమంగా విడుదల చేసిన హామీ పత్రాలను తిరిగి చెల్లించడానికి గడువు తేదీకి 20 రోజుల ముందుగా సమర్పించవచ్చు.
పైన పేర్కొన్న చెల్లింపుల కార్యాలయాల నుంచి డిశ్చార్జ్ విలువను పొందే ప్రక్రియకు సంబంధించిన వివరాలను పొందవచ్చు.
***
(Release ID: 1998042)
Visitor Counter : 114