మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఐదవరోజు సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-10కు నాయకత్వం వహించిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల

Posted On: 06 JAN 2024 8:30PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామంలో ఐదవ రోజు సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-10కి కేంద్ర మంత్రి (ఎఫ్‌ఎహెచ్‌డి) శ్రీ పర్షోత్తం రూపాలతోపాటు ఎంఓఎస్ డాక్టర్ ఎల్ మురుగన్ నాయకత్వం వహించారు. శ్రీ పర్షోత్తం రూపాలా చింతపల్లి గ్రామంలో లబ్ధిదారులతో మాట్లాడి బోట్ జెట్టీ మరియు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ప్రాజెక్ట్ పురోగతి గురించి చర్చించారు.

 

unnamed.png

 

 

పిఎంఎంఎస్‌వై పథకం కింద లబ్ధిదారులను కేంద్ర మంత్రి సత్కరించారు.వారికి ఎఫ్‌ఎఫ్‌పిఓ సర్టిఫికెట్‌లను పంపిణీ చేశారు. లబ్దిదారులను కూడా కెసిసితో సత్కరించారు. అలాగే లబ్ధిదారులు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు. వారి సమస్యలను వివరించారు. కెసిసి మరియు పిఎంఎంఎస్‌వై పథకాలు మత్స్యకారుల జీవితాలపై మరియు మత్స్యకార సమాజంపై చేసిన అపారమైన ప్రభావానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో డాక్టర్ ఎల్ మురుగన్ విస్కిత్ భారత్ సంకల్ప్ యాత్రకు హాజరయ్యారు.

 

unnamed.png

 

 

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం మరియు మత్స్య రంగంలో జీవనోపాధి అవకాశాల కల్పనపై వారి ఆర్థిక శ్రేయస్సు గురించి కేంద్ర సహయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సాగర్ పరిక్రమ దశ-10 యాత్ర ముందుకు సాగుతూ  ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం చేరుకుంది. అక్కడ మొబైల్ ఆక్వా ల్యాబ్  లబ్ధిదారులతో కేంద్ర మంత్రి సంభాషించారు.

 

unnamed.png

 

 

బుడగట్లపాలెంలో జరిగిన తదుపరి ముఖాముఖిలో మినీ జెట్టీకి సంబంధించిన అంశాన్ని మత్స్యకారులు శ్రీ రూపాల దృష్టికి తీసుకువచ్చారు. బోటు మరియు వల కోసం విడివిడిగా సబ్సిడీలు అందించాలని అభ్యర్థించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవసరమైన చర్యలు తీసుకుంటామని శ్రీ పర్షోత్తం రూపాల తెలిపారు. పిఎంఎంఎస్‌వై పథకం కింద ఎఫ్‌ఎఫ్‌పిఓ సర్టిఫికెట్, ఆస్తులు (ఎంఎఫ్‌ఆర్‌ఓ యూనిట్లు) మరియు మత్స్యకారులకు కెసిసితో లబ్ధిదారులను ఆయన సత్కరించారు. కేంద్ర మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. మత్స్యకార పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు లబ్ధిదారుల నుంచి వివిధ దరఖాస్తులు వచ్చాయి. సాంకేతికత మరియు ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్ యొక్క శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి చేపల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో చేపట్టిన పిఎంఎంఎస్‌వై కార్యక్రమం భారతీయ మత్స్య రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 

unnamed.png

 

 

శ్రీ జి.వి.ఎల్.నరసింహారావు, రాజ్యసభ సభ్యులు; శ్రీ బి. అప్పల నాయుడు, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు; శ్రీమతి ఎస్‌.నాగలక్ష్మి కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, విజయనగరం; శ్రీ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్  కూడా సాగర్ 5వరోజు సాగర్‌ పరిక్రమ యాత్రలో పాల్గొన్నారు. డిఓఎఫ్‌ జాయింట్ సెక్రటరీ  శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ సాగర్ పరిక్రమ గురించి వివరించారు. మత్స్యకారులతో సంభాషించడం, వారి కష్టాలు మరియు సమస్యలను వినడం, గ్రామ స్థాయిలో వాస్తవాలను పరిశీలించడం మరియు ప్రభుత్వ ఉత్తమ పద్ధతులు మరియు కార్యక్రమాలు లబ్ధిదారులకు చేరేలా చూడడం ఈ కార్యక్రమ లక్ష్యమని వివరించారు.

 

unnamed.png

 

 

సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-10.. 1 జనవరి 2024 నుండి 6 జనవరి 2024 వరకు కొనసాగింది. ఇది మత్స్యకారులు, తీర ప్రాంత వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్య సంబంధిత పథకాలు మరియు కార్యక్రమాల సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వాటాదారులతో పరస్పర చర్యను సులభతరం చేసే లక్ష్యంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది.  ఉత్తమ అభ్యాసాలను హైలైట్ చేయడం, బాధ్యతాయుతమైన మత్స్య సంపదను ప్రోత్సహించడం మరియు మత్స్యకారులు మరియు సంబంధిత వాటాదారులతో సంభాషించడం వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, యానాం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన యాత్ర ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కోస్తా జిల్లాలను కవర్ చేసి నేటితో ముగిసింది.

 

unnamed.png

 

 

సాగర్ పరిక్రమ ఫేజ్-10 యాత్ర ప్రారంభ నాలుగు రోజులపాటు శ్రీ పర్షోత్తం రూపాల నేతృత్వంలో డాక్టర్ ఎల్ మురుగన్‌తో పాటు ఇతర గౌరవనీయమైన ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగింది. సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-10 సందర్భంగా కేంద్ర మంత్రి, ఇతర ప్రముఖులు మత్స్యకార మహిళా గ్రూపు ప్రతినిధులు, మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ యజమానుల సంఘం ప్రతినిధులు, ఆక్వా రైతులు, ఎండు చేపల విక్రయదారుల సంఘం ప్రతినిధులు, ఇతర పిఎంఎంఎస్‌వై మరియు కెసిసి లబ్ధిదారులతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు చురుకుగా పాల్గొని తమ విజయాలను పంచుకున్నారు.

 

unnamed.png

 

 

మత్స్యకారుల కోసం పిఎంఎంఎస్‌వై మరియు కెసిసి  వంటి పథకాల కింద లబ్ధిదారులకు మంజూరీ సర్టిఫికేట్, ఆస్తులు (సముద్ర భద్రత కిట్‌లు, 4-వీలర్ లైవ్ ఫిష్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్)తో సత్కరించారు. కేంద్ర మంత్రి హేచరీ ఆపరేటర్లు, ఫీడ్ పరిశ్రమలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మరియు యాత్రలో ఆక్వా-ఫార్మర్స్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఆపరేటర్లు మరియు ఇతర వాటాదారులు వంటి లబ్ధిదారులతో సంభాషించారు.

 

unnamed.png

 


ఈ అపురూపమైన ప్రయాణంలో ప్రత్యేక స్థానం పొందిన బుడగట్లపాలెంలో ఐదవ రోజు యాత్ర పూర్తవడంతో పాటు సాగర్ పరిక్రమ యాత్ర 100 స్థానాల మైలురాయిని చేరుకోవడం చాలా ముఖ్యమైనది. మొత్తంమీద సుమారు. 31,400 మంది లబ్ధిదారులు అంటే మత్స్యకారులు, చేపల పెంపకందారులు, మత్స్యకారులు మహిళలు మరియు ఇతర వాటాదారులు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం తీర ప్రాంతం నుండి సాగర్ పరిక్రమ ఫేజ్-10లో సహకరించారు మరియు పాల్గొన్నారు. రాబోయే సాగర్ పరిక్రమ దశలు మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభావవంతమైన ప్రయత్నాన్ని ప్రేరేపిస్తాయి మరియు వారి అభివృద్ధి కోసం పిఎంఎంఎస్‌వై మరియు కెసిసి వంటి వివిధ పథకాలను ఉపయోగించుకునేలా వారిని ప్రోత్సహిస్తాయి.
 

***



(Release ID: 1993959) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Hindi