నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పునరుత్పాదక శక్తి పరివర్తనలో ఎం.ఎస్.ఎం.ఈ.ల సహకారాన్ని పెంచేందించేలా..
ద్వంద్వ ఫైనాన్సింగ్ విధానం: ఐఆర్ఈడీఏ సీఎండీ
Posted On:
10 DEC 2023 7:48PM by PIB Hyderabad
భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఐ.ఆర్.ఈ.డి.ఎ) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ పునరుత్పాదక ఇంధన రంగంలో సూక్ష్మ, చిన్న & మధ్య తరగతి ఎంటర్‌ప్రైజెస్ (ఎం.ఎస్.ఎం.ఈ)కి రుణాలు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ప్రధానం ప్రస్తావించారు. ఈ విషయమై ఆర్థిక, పర్యావరణ సహకారాన్ని నొక్కిచెప్పారు. ఈరోజు (డిసెంబర్ 10, 2023న) దుబాయ్‌లో సీఓపీ-28లో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సీఐఐ నిర్వహించిన "ఎం.ఎస్.ఎం.ఈ.ల పయనీర్ సస్టైనబిలిటీ: ఎన్విజనింగ్ గ్లోబల్ గ్రోత్ అండ్ లోకల్ ఇంపాక్ట్" అనే సెషన్‌లో, అతను పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో ఐ.ఆర్.ఈ.డి.ఎ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. నిబద్ధతలో అందుబాటులో ఉన్న రుణ సౌకర్యాల ద్వారా పునరుత్పాదక రంగంలో ఎం.ఎస్.ఎం.ఈల భాగస్వామ్యాన్ని పెంచడం, స్థిరమైన భవిష్యత్తు కోసం సంస్థ యొక్క అంకితభావాన్ని బలోపేతం చేయడం దిశగా పర్యావరణ సుస్థిరతలో ఎం.ఎస్.ఎం.ఈలు పోషించే కీలక పాత్రను సీఎండీ నొక్కిచెప్పారు. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రుణ ఆస్తులలో ఎం.ఎస్.ఎం.ఈ.లు ప్రస్తుతం సుమారు 2%ని కలిగి ఉన్నాయని తెలియజేశారు. ఎం.ఎస్.ఎం.ఈ.లు ఎదుర్కొంటున్న సవాళ్లను నిరంతరం పరిష్కరించడానికి ఐ.ఆర్.ఈ.డి.ఎ సేవలను అంకితం చేయబడింది. పునరుత్పాదక ఇంధన రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా చురుకుగా పని చేస్తోందన్నారు. జీడీపీ వృద్ధిలో వ్యవసాయ రంగం మరియు ఎం.ఎస్.ఎం.ఈ సంస్థలు అత్యధికంగా దోహదపడుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు. వ్యవస్థాపకులకు సహేతుకమైన వడ్డీరేట్ల వద్ద రుణాలను పొందడం ఒక ముఖ్యమైన అడ్డంకిగా మారిందని ఐ.ఆర్.ఈ.డి.ఎ. సంస్థ సీఎండీ అంగీకరించారు. "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"ని మెరుగుపరచడంలో ఐ.ఆర్.ఈ.డి.ఎ.
చాలా గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఎదురవుతున్న సవాళ్లలో ఫేస్లెస్ రుణ ఆంక్షలు మరియు పంపిణీల అమలు, రుణ మంజూరు మరియు పంపిణీ చక్రంలో ప్రమేయం ఉన్న డాక్యుమెంటేషన్‌లోల తగ్గింపు, దేశ వ్యాప్తంగా భౌగోళిక పరిధిని విస్తరించడం వంటివి సంస్థ వ్యాపారాన్ని సులభతరం చేయడంతో దోహదం చేస్తున్నాయన్నారు. ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్ ద్వారా ఈ-రిక్షాలకు రుణాలు ఇవ్వడంతో కూడిన విజయవంతమైన కేస్ స్టడీని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఐ.ఆర్.ఈ.డి.ఎ సంస్థ జోక్యం చేసుకొని ప్రస్తుత వడ్డీ రేట్లను 30% -36% నుండి 18% వరకు తగ్గించిందని వివరించారు. గతంలో బ్యాంకింగ్ చేయని రంగాలను బ్యాంకింగ్ చేయగలిగేలా చేయడంలో.. దాని ట్రాక్ రికార్డ్‌ను ఉపయోగించుకుంటూ, గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎం.ఎస్.ఎం.ఈ భాగస్వామ్యాన్ని పెంచడానికి గాను కంపెనీ చొరవలు దారితీస్తున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పీఎం-కుసుమ్ పథకం కింద ఫైనాన్సింగ్ ద్వారా వారి కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గించడానికి దేశవ్యాప్తంగా రైతులను ప్రోత్సహించడానికి ఐ.ఆర్.ఈ.డి.ఎ యొక్క తిరుగులేని నిబద్ధతను కూడా సీఎండీ నొక్కిచెప్పారు. ఎం.ఎస్.ఎం.ఈ.లను ప్రోత్సహించడానికి మరియు పీఎం-కుసుమ్ పథకం యొక్క విజయానికి దోహదపడే ఒక చురుకైన చర్యలో, ఐ.ఆర్.ఈ.డి.ఎ ఇటీవల తన రిటైల్ విభాగాన్ని ప్రారంభించింది. స్థాపించబడిన వెంటనే, రిటైల్ విభాగంలో కుసుమ్-బి కింద మొత్తం రూ.58 కోట్ల మేరే తన మొదటి రుణాన్ని మంజూరు చేసింది,.
****
(Release ID: 1986128)
Visitor Counter : 106