వ్యవసాయ మంత్రిత్వ శాఖ

యురోపియన్ వ్యవసాయ కమిషనర్ జానస్జ్ వోజ్సీచోవ్స్కతో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే


కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ మిషన్ (NMSA), వాతావరణ పరిస్థితులకు అనువైన వినూత్న జాతీయ వ్యవసాయ విధానం (NICRA) పథకాల వివరాలను యురోపియన్ వ్యవసాయ కమిషనర్ కు వివరించిన కేంద్ర మంత్రి

Posted On: 08 DEC 2023 7:35PM by PIB Hyderabad

యురోపియన్ వ్యవసాయ కమిషనర్ జానస్జ్ వోజ్సీచోవ్స్కను   ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ సహాయ  మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే కలిసి  చర్చలు జరిపారు. 

భారతదేశం అమలు చేస్తున్న . వ్యవసాయ విధానాలు, స్థిరమైన ఆహార వ్యవస్థ , మార్కెట్  సమస్యలు, భారతదేశం-ఈయు ఎఫ్‌టిఎ చర్చలు, సేంద్రీయ ఉత్పత్తుల ద్వైపాక్షిక ఒప్పందం సమావేశంలో చర్చకు వచ్చాయి. 

 వాతావరణాన్నితట్టుకుని వ్యవసాయ కార్యక్రమాలు సాగేలా చూసేందుకు రూపొందిన వాతావరణ పరిస్థితులకు అనువైన వినూత్న జాతీయ  వ్యవసాయ విధానం  (NICRA) సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ మిషన్ (NMSA)  పథకాలతో సహా భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను మంత్రి వివరించారు. 

ఈయూ కి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం లో ఎదురవుతున్న  వాణిజ్య అడ్డంకులను మంత్రి ప్రస్తావించారు.  యూరోపియన్ కమిషన్ వద్ద పెండింగ్‌లో బాస్మతి బియ్యానికి  రక్షిత భౌగోళిక సూచిక (GI) హోదా కోసం భారతదేశ  అభ్యర్థనపై సానుకూలంగా స్పందించాలని ను ఆమె యురోపియన్ వ్యవసాయ కమిషనర్ను మంత్రి కోరారు. 

జీ-20  అధ్యక్ష పదవిని విజయవంతం నిర్వర్తించిన భారతదేశాన్ని  యూరోపియన్ కమిషనర్  అభినందించారు. భారత్‌ లేవనెత్తిన అంశాలు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశం పరిశీలనలో ఉన్న ఈయూ  దేశాల అభ్యర్థనలను కూడా ఆయన గుర్తు చేశారు. మార్కెట్ అంశాలకు సంబంధించి  ఈయూ  దేశాల నుచ్న్హి అందిన అభ్యర్థనలను ఇటీవల  పరిష్కరించామని తెలిపిన మంత్రి   మిగిలిన సమస్యలు సరైన సమయంలో పరిష్కరిస్తామని మంత్రి   తెలియజేశారు.

ద్వైపాక్షిక సమస్యల పరిష్కరించడానికి సంయుక్త  వర్కింగ్ గ్రూప్ వ్యవస్థ ఏర్పాటు కావాలని యురోపియన్ వ్యవసాయ కమిషనర్ పేర్కొన్నారు. సంయుక్త  వర్కింగ్ గ్రూప్ సమావేశాన్నిత్వరలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశాన్ని 2024 ప్రారంభంలో నిర్వహించాలని సూచించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాలపై తరచూ  చర్చలు జరపడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. 

***



(Release ID: 1984279) Visitor Counter : 80


Read this release in: English , Hindi