వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం గతి శక్తి 61వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశం
వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుపై ప్రత్యేక సమీక్ష
Posted On:
05 DEC 2023 1:01PM by PIB Hyderabad
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ 61వ నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ ) సమావేశం పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) శ్రీమతి సుమితా దావ్రా అధ్యక్షతన జరిగింది. 2023 డిసెంబర్ 1 న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో(i)పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన, ప్రతిపాదిత ఆర్థిక మండలాల మ్యాపింగ్ (ii) గుర్తించిన 100 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు జరుగుతున్న తీరును సమీక్షించింది.
రోడ్డు రవాణా ,రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ శాఖ, ఫార్మాస్యూటికల్స్ శాఖ, మత్స్య మంత్రిత్వ శాఖ , సంబంధిత మంత్రిత్వ శాఖలు/లు, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ కు చెందిన దాదాపు 60 మంది అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) కార్యదర్శి వివరించారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 39 ప్రాజెక్టులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 36 ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయని, కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1463 డేటా లేయర్‌లను అప్‌లోడ్ చేస్తున్నామని, సాధనాల అభివృద్ధి, సాధించిన విజయాల వివరాలను డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి వివరించారు. వంటి పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన కార్యక్రమాల్లో 8 ఉత్తమ విధానాలను గుర్తించి 2023 అక్టోబర్ 13న ‘కాంపెండియం ఆఫ్ పీఎం గతిశక్తి’ ను ఆవిష్కరించామని తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యతా క్రమం కింద మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులను పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద వివిధ మంత్రిత్వ శాఖలు గుర్తించాయి రవాణా , ఓడరేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువులు మరియు ఆహార ధాన్యాల రంగాలకు పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు కల్పించేందుకు 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో వంద ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలు కేటాయించింది.
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద సమగ్రమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం, సమగ్ర అభివృద్ధి సాధించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు 1300 పైగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించాయని ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) తెలిపారు.జౌళి మంత్రిత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన పీఎం మిత్రా పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మెగా ఫుడ్ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ,ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత ఆర్థిక మండలాల మ్యాపింగ్ చేపట్టాల్సి ఉంటుందని శ్రీమతి సుమితా దావ్రా పేర్కొన్నారు.
వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల అధికారులు ప్రాజెక్టుల తాజా పరిస్థితిని వివరించారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పోర్టల్‌లో మంజూరు చేసిన 8 పీఎం మిత్ర పార్కుల మాపింగ్ ను జౌళి మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది. 129 ఫార్మా క్లస్టర్లు మరియు 23 మెడికల్ డివైజ్ క్లస్టర్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఫార్మాస్యూటికల్స్ విభాగం నివేదించింది. భారతదేశంలోని అన్ని శిక్షణా సంస్థలను పశు సంవర్ధక,పాడి పరిశ్రమ శాఖ మ్యాప్ చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల వివరాలను, పూర్తి చేసిన ప్రాజెక్టుల వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అందించాయి. 13 గుర్తించబడిన ప్రాజెక్ట్‌లపై నవీకరణ వివరాలను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందించింది. బహుళ రవాణా ప్రాజెక్టుల నిర్మాణం, అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడానికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పోర్టల్ వినియోగంపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. . ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాలు తమ సంబంధిత ప్రాజెక్ట్‌లపై తాజా వివరాలు అందించాయి.
ప్రాజెక్ట్‌ల మ్యాపింగ్‌లో సాధించిన గణనీయమైన పురోగతిపై శ్రీమతి సుమితా దావ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించడానికి పీఎం గతిశక్తి పోర్టల్‌ను విస్తృతంగా ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయించారు.పీఎం గతిశక్తి కింద గుర్తించబడిన ప్రాజెక్ట్‌లు ఆర్థిక కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించి,, వస్తువులు, సేవల రవాణాను సులభతరం చేయడం, మెరుగైన ఉత్పాదకత సాధించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి డిమాండ్-ఆధారిత విధానం కోసం పెట్టుబడులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి.
***
(Release ID: 1982704)
Visitor Counter : 93