గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పట్టణాలలో నీటి సంక్షోభ నిర్వహణ
Posted On:
04 DEC 2023 4:30PM by PIB Hyderabad
నీరు, పారిశుద్ధ్యం అన్నవి రాష్ట్ర/ యుఎల్‌బికి సంబంధించిన అంశాలు. అయితే, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు (ఎంఒహెచ్‌యుఎ) మంత్రిత్వ శాఖ ప్రణాళికాపూర్వక చొరవలు, సలహాల ద్వారా సహాయక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు, రాష్ట్రం/ పట్టణ స్థానిక సంస్థలకు సాంకేతిక& ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.
రాష్ట్రాలు/ స్థానిక సంస్థల ప్రభుత్వాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తమ తమ భవన బైలాస్‌లో ఎంబిబిఎల్ 2016 చట్టం సూచించినట్టుగా వర్షపు నీటి సేకరణను అనుసరించాయి. అలాగే వర్షపు నీటి సేకరణ పార్కుల సృష్టికి మార్గదర్శక పత్రాన్ని సిపిహెచ్ఇఇఒ, ఎంఒహెచ్‌యుఎలు ప్రచురించాయి (https://mohua.gov.in/pdf/6566e1048ab41guidance-document-on-rainwater-harvesting-parks-final.pdf ). ఎంఒహెచ్‌యుఎ పునరుద్ధరణ, పట్టణ పరివర్తన కోసం అతల్ మిషన్ (అమృత్) & అమృత్ 2.0 వంటి జాతీయ మిషన్ల ద్వారా నీటి సంక్షోభ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయాన్నిఅందిస్తున్నాయి.
అమృత్ కింద స్థానిక సంస్థలు/ రాష్ట్రాలు తమ తమ అంచనాలు/ అవసరాన్ని బట్టి నీటి సరఫరా వర్షపు నీటి సేకరణ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. రాష్ట్రాలు సమర్పించిన రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలను ఎంఒహెచ్‌యుఎ ఆమోదిస్తుంది. అమృత్‌లో వరద నీటి కాలువల కింద, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రారంభించిన రూ.2,999 కోట్ల విలువైన 813 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. తత్ఫలితంగా 3,416 నీరు నిలిచిపోయే కేంద్రాలను నిర్మూలించగా, 372 నీరు నిలిచిపోయే పాయింట్లను నిర్మూలించే కార్యక్రమం జరుగుతోంది. ఇందుకు అదనంగా, 1,222 కిమీల పొడవైన కాలువలను వేయగా, 401 కిమీల పొడవైన కాలువలు నిర్మాణంలో ఉన్నాయి.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలురూ.9.19 కోట్ల విలువైన 7 వర్షపు నీటి సేకరనణ ప్రాజక్టులను చేపట్టగా, అందులో రూ. 3.42 కోట్ల విలువైన 4 ప్రాజెక్టులు (ఒకటి ఢిల్లీ& 3 లక్షద్వీప్)లు పూర్తి కాగా, రూ. 5.77 కోట్ల విలువైన 3 ప్రాజెక్టులు (కేరళలో) నిర్మాణంలో ఉన్నాయి.
అమృత్ 2.0 ను 1 అక్టోబర్ 2021న ప్రారంభించారు. దీని పరిధిలోకి దేశంలోని చట్టబద్ధమైన పట్టణాలను కవర్ చేస్తూ, సార్వత్రిక నీటి సరఫరాను నిర్ధారిస్తూ, నగరాలలో నీటి భద్రతను కల్పించడం ఉంటాయి. ఇప్పటివరకూ, అమృత్ 2.0 లో రూ. 3,802 కోట్ల విలువైన 2,135 జలాశయాల పునరుద్ధరణ ప్రాజెక్టులకు ఎంఒహెచ్‌యుఎ ఆమోదించింది. పట్టణ జలాశయ వ్యవస్థల్లో సానుకూల భూగర్భ సమతుల్యాన్ని నిర్వహించడంపై దృష్టిపెట్టేందుకు జలాశయాల నిర్వహణ ప్రణాళికను తయారు చేస్తారు.
ఈ సమాచారాన్ని గృహనిర్మాణం& పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్ సోమవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1982625)
Visitor Counter : 75