సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర విజయవంతంగా నిర్వహించాలి
Posted On:
18 NOV 2023 7:48PM by PIB Hyderabad
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర విజయవంతంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి విష్ణు చరణ్ మండల అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహణ తీరు, ప్రజల భాగస్వామ్యంను పరిశీలించారు. వచ్చే వారం పి.ఆమిటి, కొండవాడ, లక్కగూడ, చేముడుగూడ తదితర గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహణ ఏర్పాట్లను శనివారం ప్రాజెక్టు అధికారి పరిశీలించారు. ప్రజలకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సభలపై ముందస్తు సమాచారం అందించాలని ఆయన ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అన్ని బ్యాంకుల శాఖలు విధిగా పాల్గొనాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలలో నమోదు కాకుండా ఉన్నవారి జాబితా సాధ్యమైనంత మేరకు ముందుగా సేకరించి వారిని పథకాల కోసం నమోదు చేయాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ది పొందాలని ఆయన ఆదేశించారు.
పాఠశాలలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కట్టడాలు ఉండాలి

పాఠశాలలలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కట్టడాలు ఉండాలని ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. పి.ఆమిటి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కట్టడాలను పరిశీలించారు. రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కట్టడాల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతుందని, నీటి ఎద్దడి అవకాశాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులలో సైతం వీటిపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి వనరులు పుష్కలంగా లభించే విధంగా చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాములమ్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.


***
(Release ID: 1977939)
Visitor Counter : 126