సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పథకాల గూర్చి అవగాహన పొందాలి
Posted On:
18 NOV 2023 7:46PM by PIB Hyderabad
పథకాల గూర్చి అవగాహన పొందాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా గుమ్మలక్ష్మిపురం మండలం కుక్కిడి, దుమ్మంగి పంచాయతీలలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047వ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన భారత దేశం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోడి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అన్ని రంగాల్లో అమలు చేస్తున్నాయని అన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై అభివృద్ధి చెందిన భారత దేశం రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలను, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగు నీరును పొందుటకు, ఆయుష్మాన్ భారత్; ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన; దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ; ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ); పిఎం ఉజ్వల యోజన ; పిఎం విశ్వకర్మ; పిఎం కిసాన్ సమాన్ ; కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC); పిఎం పోషన్ అభియాన్; హర్ ఘర్ జల్ - జల్ జీవన్ మిషన్; గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్ (స్వమిత్వ); జన్ ధన్ యోజన; జీవన్ జ్యోతి బీమా యోజన; సురక్ష బీమా యోజన; అటల్ పెన్షన్ యోజన; పిఎం ప్రణామ్; నానో ఎరువులు, సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ వంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించిన నిర్దిష్ట పథకాలు; ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థుల భర్తీ; స్కాలర్షిప్ పథకాలు; అటవీ హక్కు చట్టం క్రింద వ్యక్తిగత, కమ్యూనిటీ భూమి నిర్వహణ ; వన్ ధన్ వికాస్ కేంద్రం: స్వయం సహాయక బృందాలను గూర్చి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగి ఉండి ఇంకా నమోదు కాకపోతే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో వెంటనే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రచార రథం రోజుకు రెండు గ్రామ పంచాయతీలలో పర్యటించి అవగాహన కల్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రచార వాహనంలో కళా బృందాలు పథకాలపై వివిధ కళా రూపాల ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
***
(Release ID: 1977938)
Visitor Counter : 189