శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వివిధ సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాలు రూపొందించిన సమకాలీన భారతదేశంలోని 9 ముఖ్యమైన సైన్స్ కథనాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి త్వరలో ఒక భారీ పబ్లిక్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ ప్రారంభించబడుతుంది : కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్



గ్లోబల్ మిషన్‌ లతో సమానంగా ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల సలహా మండలి (పి.ఎం-ఎస్.టి.ఐ.ఏ.సి) కి చెందిన తొమ్మిది మిషన్లు ఉన్నాయని - డి.ఎస్.టి. ప్రధాన కార్యాలయంలో సైన్స్ కార్యదర్శుల నెలవారీ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు


న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ లోని భారత్ మండపంలో 2023 డిసెంబర్, 4వ తేదీ నుంచి జరగనున్న గ్లోబల్ బయో-ఇండియా సన్నాహాలను సమీక్షించిన - డాక్టర్ జితేంద్ర సింగ్


హర్యానాలోని ఫరీదాబాద్‌ లో 2024 జనవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐ.ఐ.ఎస్.ఎఫ్) 2023 ఏర్పాట్లను కూడా సమీక్షించిన - కేంద్ర మంత్రి

Posted On: 15 NOV 2023 4:49PM by PIB Hyderabad

వివిధ సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాలు రూపొందించిన సమకాలీన భారతదేశంలోని 9 ముఖ్యమైన సైన్స్ కథనాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి త్వరలో ఒక భారీ పబ్లిక్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు చెప్పారు.

 

శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రధాన కార్యాలయంలో సైన్స్ కార్యదర్శుల నెలవారీ సమావేశానికి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్లోబల్ మిషన్లకు చెందిన చంద్రయాన్, డీప్ ఓషన్ మిషన్, క్వాంటం సాంకేతికత; టీకాలు, జీవసంబంధ తయారీ; అరోమా మిషన్ & పర్పుల్ రివల్యూషన్; ప్రపంచ జీవ ఇంధన కూటమి; కృత్రిమ మేధస్సు (ఏ.ఐ); వ్యర్థాల నుంచి సంపద మిషన్; జాతీయ జీవవైవిధ్య మిషన్ మొదలైన వాటి తో సమానంగా ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల సలహా మండలి (పి.ఎం-ఎస్.టి.ఐ.ఏ.సి) కి చెందిన  9 మిషన్లు  ఉన్నాయని పేర్కొన్నారు.  

 

సామాజిక మాధ్యమం తో పాటు, ఆడియో-వీడియో కంటెంట్‌ తో వివరణాత్మక మీడియా వ్యూహాన్ని రూపొందించడానికి సైన్స్ సెక్రటరీలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్‌ ను కోరారు. 

 

క్వాంటం మిషన్‌ ఉదాహరణగా పేర్కొంటూ - క్వాంటం మెకానికల్ సిస్టమ్స్, క్వాంటమ్ కమ్యూనికేషన్, న్యూ మెటీరియల్స్, క్వాంటం సెన్సార్లు, క్వాంటం క్రిప్టోగ్రఫీ నియంత్రణలో పురోగతితో జాతీయ భద్రత, ఆర్థిక శ్రేయస్సు కోసం క్వాంటం ఫ్రాంటియర్‌ లో సామర్థ్యాలను నిర్మించడం చాలా అవసరమని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.  అదే విధంగా ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల సలహా మండలి  (పి.ఎం-ఎస్.టి.ఐ.ఏ.సి) కి చెందిన ఇతర మిషన్లు కూడా ప్రపంచ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.   ఈ అత్యాధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, ఉమ్మడి ప్రయోజనాల కోసం వాటి ఉపయోగం విస్తృత మీడియా ఔట్రీచ్ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి మూల ప్రదేశానికి చేరుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. 

 

ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుల తదుపరి ఐదేళ్లకు సంబంధించిన ప్రణాళికను నెలాఖరులోపు ఖరారు చేయాలని, ఈ అంశం ప్రాముఖ్యత ఆధారంగా ప్రాధాన్యతను రూపొందించాలని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ సూచనలు చేశారు. 

 

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ లోని భారత్ మండపంలో 2023 డిసెంబర్ 4వ తేదీన ప్రారంభం కానున్న గ్లోబల్ బయో-ఇండియా సన్నాహాలను డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు.

 

హర్యానాలోని ఫరీదాబాద్‌ లో 2024 జనవరి, 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే 9వ భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్) 2023 ఏర్పాట్లను కూడా కేంద్ర మంత్రి సమీక్షించారు.

 

భారతదేశపు మెగా సైన్స్ ఫెయిర్ ఫరీదాబాద్‌ లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టి.హెచ్.ఎస్.టి.ఐ) మరియు బయోటెక్నాలజీ శాఖకు చెందిన ప్రాంతీయ బయోటెక్నాలజీ కేంద్రం (ఆర్.సి.బి) ఆవరణలో జరుగుతుంది.  ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2023 లో పాల్గొనే వారితో పాటు సాధారణ ప్రజలకు విభిన్న ప్రయోజనాలను అందించే శాస్త్రీయ విజయాలను ప్రదర్శించడానికి వీలుగా ఈ సైన్స్ ఫెయిర్ లో మొత్తం 17 ఇతివృత్తాలు ఉంటాయి.

 

 

<><><>



(Release ID: 1977542) Visitor Counter : 39


Read this release in: English , Urdu , Hindi