విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

త‌న తొలి ప్రాజెక్టు అయిన గుజ‌రాత్‌లోని క‌చ్‌లో 50 మెగావాట్ల ద‌యాప‌ర్ ప‌వ‌న ప్రాజెక్టు వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను ప్ర‌క‌టించిన ఎన్‌టిపిసి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ లిమిటెడ్‌

Posted On: 04 NOV 2023 7:22PM by PIB Hyderabad

ఎన్‌టిపిసి పూర్తి యాజ‌మాన్య అనుబంధ సంస్థ ఎన్‌టిపిసి రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ లిమిటెడ్‌, గుజ‌రాత్‌లోని క‌చ్‌లో గ‌ల ద‌యాప‌ర్‌లో త‌న తొలి ప్రాజెక్టైన  50 మెగావాట్ల ప‌వ‌న ఇంధ‌న ప్రాజెక్టు వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను 4 న‌వంబ‌ర్ 2023న ప్ర‌క‌టించింది. దీనితో ఎన్‌టిపిసి మొత్తం వ్య‌వ‌స్థాపిత సామ‌ర్ధ్యం 73,874 మెగావాట్లు కాగా, మొత్తం పున‌రావృత ఇంధ‌న కార్యాచ‌ర‌ణ సామ‌ర్ధ్యం ప్ర‌స్తుతం 3,364గా నిలిచింది. 
ద‌యాప‌ర్ విండ్ అన్న‌ది ఎన్‌టిపిసి ఆర్ఇఎల్ తొలి ప్రాజెక్టు కాగా, నూత‌న భార‌త విద్యుత్ గ్రిడ్ కోడ్‌, సాధార‌ణ నెట్‌వ‌ర్క్ అందుబాటు ప‌ద్ధ‌తి కింద వాణిజ్య‌ప‌రంగా భార‌త దేశంలో ప్ర‌క‌టిత‌మైన తొలి సామ‌ర్ధ్యం. 
దయాప‌ర్ విండ్ కాకుండా, 15 ఇత‌ర ఆర్ఇ ప్రాజెక్టులు వివిధ ద‌శ‌ల్లో అమ‌లులో ఉన్నాయి. దీని మొత్తం సామ‌ర్ధ్యం 6,210 మెగావాట్లు. అలాగే, మొత్తంగా ప్రారంభ‌మైన త‌ర్వాత ద‌యాప‌ర్ విండ్ కాంప్లెక్స్ ఎన్ టిపిసి ప్ర‌స్తుత 100 మెగావాట్ల ప‌వ‌న స‌ముచ్ఛ‌యానికి 450 మెగావాట్ల‌ను జోడిస్తుంది. 
సౌర‌, ప‌వ‌న సామ‌ర్ధ్యానికి అద‌నంగా, హ‌రిత హైడ్రోజెన్ సాంకేతిక‌త‌ల‌లో కూడా ఎన్‌టిపిసి ఆర్ఇఎల్ పెట్టుబ‌డులు పెడుతోంది. హ‌రిత ఉద‌జ‌ని నిల్వ‌, సూక్ష్మ గ్రిడ్ సూత్రం ఆధారంగా అది ల‌డాఖ్‌లో భారీ సామ‌ర్ధ్యంతో ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. 
ఎన్‌టిపిసి మ‌రొక పూర్తి యాజ‌మాన్య అనుబంధ సంస్థ అయిన ఎన్‌టిపిసి గ్రీన్ ఎన‌ర్జీ లిమిటెడ్ (ఎన్‌జిఇఎల్‌) 2,711 మెగావాట్ల పున‌రావృత ఇంధ‌న సామ‌ర్ధ్య ప్రాజెక్టును ప్రారంభించ‌డ‌మే కాక‌, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో 40 మెగావాట్ల సౌర ప్రాజెక్టు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పుడిమ‌డ‌క వ‌ద్ద ఒక హైడ్రొజెన్  స‌హా రెండు సౌర ప్రాజెక్టుల‌ను ఏర్పాటు చేస్తోంది.
ఎన్‌టిపిసికి అద‌న‌పు పున‌రావృత ఇంధ‌న సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు 7 అక్టోబ‌ర్ 2020న‌ ఎన్‌టిపిసి ఆర్ఇఎల్ ను పూర్తి యాజ‌మాన్య అనుబంధ సంస్థ‌గా విలీనం చేశారు. 
దీర్ఘ‌కాలిక వృద్ధి ప్ర‌ణాళిక‌, సుస్థిర‌త కోసం 2032 నాటికి 60 గిగావాట్ల పున‌రావృత ఇంధ‌న సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉండాల‌ని ఎన్‌టిపిసి ల‌క్ష్యంగా పెట్టుకుంది. ప్ర‌స్తుతం 20 గిగావాట్లు+ పున‌రావృత ఇంధ‌న సామ‌ర్ధ్యంతో కూడిన పైప్‌లైన్‌ను క‌లిగి ఉంది. 

 

***
 


(Release ID: 1974927) Visitor Counter : 109


Read this release in: English , Urdu , Hindi