ఆయుష్
ఆయుష్ మంత్రిత్వ శాఖలో లక్ష్యాల మేరకు నెల రోజుల పాటు అమలు జరిగిన స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0
పనికిరాని వ్యర్థాల అమ్మకం ద్వారా రూ. 6,97,270 ఆదాయం ఆర్జించిన మంత్రిత్వ శాఖ
2300 చదరపు అడుగుల స్థలాన్ని వినియోగంలోకి తెచ్చిన మంత్రిత్వ శాఖ
కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుబంధ పరిశోధన మండళ్లు, జాతీయ సంస్థలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర చట్టబద్ధమైన సంస్థలు
Posted On:
01 NOV 2023 1:24PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖలో లక్ష్యాల మేరకు నెల రోజుల పాటు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 ని అమలు చేసింది. 2023 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం అక్టోబర్ 2023న ముగిసింది. కార్యాలయాల్లో పరిశుభ్రత మెరుగు పరచడం, పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ సభ్యులు సిఫార్సులు, పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన సిఫార్సులు, ప్రజా ఫిర్యాదులు, ప్రజా ఫిర్యాదుల అప్పీళ్లు పరిష్కరించడానికి స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇచ్చింది. లక్ష్యాల మేరకు పెండింగ్ సమస్యలు పరిష్కరించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ పనికిరాని వ్యర్థాలు తొలగించి అదనపు పని స్థలాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆయుష్ మంత్రిత్వ శాఖతో సహా శాఖ అనుబంధ పరిశోధన మండళ్లు, జాతీయ సంస్థలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర చట్టబద్ధమైన సంస్థలు కార్యక్రమాన్ని అమలు చేశాయి.
2023 అక్టోబర్ 31న స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 పూర్తి అయ్యే నాటికి 876 ఫైళ్లను పరిశీలించి తొలగించాలని మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ణయించారు. మొత్తం 876 ఫైళ్లను అధికారులు సమీక్షించి తొలగించారు. పెండింగ్ లో ఉన్న
మొత్తం 3 రాష్ట్ర సూచనలు, 75 ప్రజా ఫిర్యాదులు, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అందిన 3 సూచనలు, 24 పబ్లిక్ ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ విజయవంతంగా పరిష్కరించింది. 20 పరిశుభ్రత ప్రచారాలను నిర్వహించి మంత్రిత్వ శాఖ 100% లక్ష్యాన్ని సాధించింది. పనికిరాని వ్యర్థాల అమ్మకం ద్వారా రూ. 6,97,270 న మంత్రిత్వ శాఖ ఆదాయాన్ని ఆర్జించింది మరియు 2300 చదరపు అడుగుల స్థలాన్ని వినియోగంలోకి తెచ్చింది.
కార్యాలయాల పనితీరు మెరుగుపరచడానికి, పనికిరాని వస్తువులు తొలగించడానికి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాన్ని అమలు చేసింది. సిబ్బంది ఉత్పాదకత పెంచడం, పని వాతావరణాన్ని మెరుగు పరచడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరిగాయి.
కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు ఆయుష్ మంత్రిత్వ శాఖ సిబ్బంది, అధికారులు స్వచ్ఛత ప్రమాణం స్వీకరించారు. వ్యర్ధ రహిత భారతదేశం నిర్మాణం లక్ష్యంగా స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 అమలు జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా కార్యక్రమం అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి లక్ష్యాల మేరకు కార్యక్రమం అమలు చేయాలని సిబ్బంది, అధికారులకు సూచనలు జారీ చేశారు.కార్యక్రమంలో భాగంగా కార్యాలయాల ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది పార్కులు, బస్‌స్టాప్‌లు, మూలికావనాలు, సరస్సులు, చెరువులతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచేందుకు శ్రమదానం చేశారు. సీనియర్ అధికారులు, సిబ్బంది ఆయుష్ భవన్, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. పరిశోధనా మండళ్లు , జాతీయ సంస్థలు, వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పనిచేస్తున్న ఆయుష్మ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించి లక్ష్యాలు సాధించాయి.స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 అమలులో ఆయుష్ మంత్రిత్వ శాఖ గతంతో పోల్చి చూస్తే మెరుగైన పనితీరు కనబరిచింది. సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గోవడంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అక్టోబర్ 31న లక్ష్యాల మేరకు కార్యకమాన్ని అమలు చేయడంలో విజయం సాధించింది.
***
(Release ID: 1973975)
Visitor Counter : 73