పార్లమెంటరీ వ్యవహారాలు
13 అక్టోబర్‌న 9వ జి20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (పి20)ని ప్రారంభించనున్న ప్రధాని
Posted On:
12 OCT 2023 3:15PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9వ జి20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సును న్యూఢిల్లీలోని యశోభూమిలో 13 అక్టోబర్ 2023 ఉదయం సుమారు 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సదస్సును జి20 భారత అధ్యక్షత విస్త్రత చట్రం కింద భారత పార్లమెంటు నిర్వహిస్తోంది.
భారత జి20 అధ్యక్షత ఇతివృత్తానికి అనుగుణంగా, 9వ పి20 సదస్సును ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కోసం పార్లమెంట్లు అన్న ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జి20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలకు చెందిన పార్లమెంటు స్పీకర్లు హాజరుకానున్నారు. ఇటీవలే, అంటే 9-10 సెప్టెంబర్ 2023న న్యూఢిల్లీలో జరిగిన జి20 నాయకుల సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వం పొందిన తర్వాత అఖిల ఆఫ్రికన్ పార్లమెంటు పి20 సదస్సులో తొలిసారి పాలుపంచుకోనుంది.
ఈ పి20 సదస్సులో ఇతివృత్తంతో కూడిన సెషన్లు దిగువన పేర్కొన్న నాలుగు విషయాంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నాయి
- పబ్లిక్ డిజిటల్ వేదికల ద్వారా ప్రజల జీవితాల పరివర్తన
- మహిళల నేతృత్వంలో అభివృద్ధి
-ఎస్‌డిజిలను వేగవంతం చేయడం
- నిలకడైన ఇంధన పరివర్తన.
సదస్సు ముందస్తు లైఫ్ (LiFE -Lifestyle for Environment- పర్యావరణం కోసం జీవనశైలి) పై పార్లమెంటరీ ఫోరంను 12 అక్టోబర్2023న నిర్వహిస్తున్నారు. ప్రకృతికి అనుగుణంగా పచ్చటి, నిలకడైన భవిష్యత్తు దిశగా చొరవలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
***
(Release ID: 1967239)
Visitor Counter : 64