పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
గత ఆరేళ్ళతో అంటే 2016 నుంచి 2023తో పోలిస్తే జనవరి- సెప్టెంబర్ 2023 కాలంలో ఎన్‌సిఆర్‌లో వాయు నాణ్యత మొత్తపు మెరుగుదల సరళిని కొనసాగిస్తూ ఢిల్లీలో రోజువారీ సగటు వాయు నాణ్యత ఉత్తమ సూచీని నమోదు
Posted On:
30 SEP 2023 4:43PM by PIB Hyderabad
గత ఆరేళ్ళతో అంటే 2016 నుంచి 2023 (కోవిడ్ ప్రభావిత 2020ను మినహాయించి)తో పోలిస్తే జనవరి- సెప్టెంబర్ 2023 కాలంలో ఎన్‌సిఆర్‌లో వాయు నాణ్యత మొత్తపు మెరుగుదల సరళిని కొనసాగిస్తూ ఢిల్లీలో రోజువారీ సగటు వాయు నాణ్యత ఉత్తమ సూచీని నమోదు చేసింది. ప్రస్తుత సంవత్సరం పైన పేర్కొన్న కాలంలో ఢిల్లీకి రోజువారీ సగటు ఎక్యూఐ 167గా నమోదు అయింది. ఇది, 2022లో నమోదైన 184కన్నా, 2021లో 180 కన్నా, 2019లోని 188, 2018లో 193 ఇదే కాలంలో నమోదైన సూచీలకన్నా చాలా తక్కువ.
ఈ ఏడాది సెప్టెంబర్ మాసం 10 సెప్టెంబర్ 2023న మంచి వాయు నాణ్యత కలిగిన రోజుగా నమోదు కావడానికి సాక్షి అయింది, యాధృచ్ఛికంగా అది న్యూఢిల్లీలోని జి20 సదస్సు ముగింపు రోజు కావడం జరిగింది.
ఎక్యూఐ అన్నది వర్షపాతం/ అవక్షేపణం, వాయు వేగంతో ఎక్కువగా ప్రభావితం అవుతుంది. సెప్టెంబర్ 2023 మొత్తం 82.7 మిమీలతో తక్కువ వర్షపాతాన్ని నమోద చేసింది. ఇది సెప్టెంబర్ 2022లో నమోదైన 165 మిమీల వర్షపాతానికన్నా తక్కువ. తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ, సెప్టెంబర్ 2023లో రోజువారీ సగటు ఎక్యూఐ 108గా ఉంది. సెప్టెంబర్ 2022లో రోజువారీ సగటు ఎక్యూఐ 104గా నమోదైంది.
జనవరి - సెప్టెంబర్ 2023 కాలంలో ఢిల్లీలో మంచి నుంచి ఒక మాదిరి వాయు నాణ్యత (రోజువారీ సగటు ఎక్యూఐ ;200) కలిగిన అత్యధిక రోజులను (193)ఢిల్లీ వీక్షించింది. గత ఐదేళ్ళలో ఇదే కాలం (కోవిడ్ ప్రభావిత 2020)తో పోలిస్తే ఇది చాలా సానుకూల పరిణామం.
గత సంవత్సరాలలో ఇదే కాలంలో నమోదైన మంచి నుంచి ఒకమాదిరి వాయు నాణ్యత కలిగిన రోజులు ఈ విధంగా ఉన్నాయి - 2022లో 146, 2021లో 174, 2019లో 165, 2018లో 152. గత 6 ఏళ్ళలో రోజువారీ సగటు పిఎం 2.5, పిఎం 10సాంద్రీకరణలతో పోలిస్తే 2023కాలం చెప్పుకోదగిన తగ్గింపుకు సాక్షిగా ఉంది.
జనవరి - ఆగస్టు 2023 కాలం 73 µgm/m3 రోజువారీ సగటు పిఎం 2.5 సాంద్రీకరణలను నమోదు చేయగా, 2017 నుంచి 2022 (2020 కోవిడ్ ప్రభావిత కాలాన్ని మినహాయించి) ఇదే కాలంలో 82-95 µgm/m3 లు నమోదు అయ్యాయి.
అలాగే, రోజువారీ సగటు పిఎం 10 సాంద్రీకరణ ఢిల్లీలో 169 µgm/m3గా ఉంది. ఇది 2017 నుంచి 2022 (2020 కోవిడ్ ప్రభావిత కాలాన్ని మినహాయించి) ఇదే కాలంలో నమోదు అయిన 183-215 µgm/m3 కన్నా తక్కువ.
అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో కృషి, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వివిధ వాటాదారు ఏజెన్సీల చర్యలు, కొనసాగుతున్న పర్యవేక్షణ, అమలు చర్యలు 2023లో మెరుగైన వాయు నాణ్యతకు తోడ్పడ్డాయి.
రానున్న శీతాకాలంలో మెరుగైన వాయు నాణ్యత కోసం సామూహిక కృషిలో దీనికి సంబంధించిన సిటిజన్ చార్టర్‌ను పౌరులు అనుసరించాలని, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సంబంధించిన ఆదేశాలు/ మార్గదర్శకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని కమిషన్ అన్ని ఏజెన్సీలను, వాటాదారులను కోరింది.
(Release ID: 1962618)
Visitor Counter : 140