సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) కి చెందిన వేరు వేరు ప్రాంతీయ కార్యాలయాల లో యువ వృత్తి నిపుణుల నియామకం కోసం పిలుపునిస్తున్న సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ

Posted On: 31 AUG 2023 3:02PM by PIB Hyderabad

పత్రికా సమాచార కార్యాలయాని కి (పిఐబి)  దేశవ్యాప్తం గా ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాల లో ఒప్పందం ప్రాతిపదిక న ఒక సంవత్సరం కాలం పాటు పని చేయడం కోసం (ఈ కాలాన్ని మూడు సంవత్సరాల వరకు విస్తరించేందుకు కూడా అవకాశం ఉంది) 33 మంది యువ వృత్తి నిపుణుల (వైపీస్) ను నియమించుకోవాలని సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ దరఖాస్తుల ను ఆహ్వానించింది.  ఈ ఉద్యోగాల లో, తెలంగాణ లో రెండు కొలువులు మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ఒక నౌకరీ కలిసి ఉన్నాయి.  ఇలా పనికి పెట్టుకొన్న వైపీస్ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, పథకాలు, ప్రకటనలు, ఇంకా కార్యక్రమాల కు సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేయడం కోసం అధికారులకు మరియు విభాగాలకు సహకరించవలసి ఉంటుంది.  ముఖ్య విద్యార్హతల లో పత్రికా రచన / మాస్ కమ్యూనికేశన్/ విజువల్ కమ్యూనికేశన్/ ఇన్ ఫర్ మేశన్ ఆర్ట్ స్ / ఏనిమేశన్  & డిజైనింగ్ /సాహిత్యం మరియు సృజ‌నాత్మక రచనలు.. వీటిలో దేనిలో అయినా డిగ్రీ గాని, డిప్లొమా గాని భాగం అయి ఉండాలి.  ఇంకా  మాస్టర్స్ డిగ్రీ లేదా డిప్లొమా సాధించిన  తరువాత మరీ ముఖ్యం గా కమ్యూనికేశన్, డిజైనింగ్, మార్కెటింగ్, ఏనిమేశన్, ఎడిటింగ్ మరియు పుస్తక ప్రచురణ రంగాలలో దేనిలో అయినా కనీసం రెండు సంవత్సరాలు పాటు పని చేసినటువంటి అనుభవం కూడా అవసరం.  అభ్యర్థి కి తెలుగు లో, ఇంగ్లిషు లో గట్టి పట్టు ఉండాలి.  

 

ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం  www.mib.gov.in ని చూడవచ్చు.  సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కు దరఖాస్తులు  2023 సెప్టెంబరు 30 చివరి తేదీ లోపు అందాలి.  ఇంకా ఏదైనా వివరణ కావాలనుకుంటే అండర్ సెక్రటరి (టెలిఫోన్ : 23385586, ఇమెయిల్ ఐడి: mihir.jha[at]nic[dot]in) ని సంప్రదించగలరు.

 

*******


(Release ID: 1953719) Visitor Counter : 197
Read this release in: English