మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఆరోగ్య మరియు వయో వృద్ధుల సంరక్షణ శాఖ మంత్రి శ్రీ మార్క్ బట్లర్‌తో సమావేశం


నైపుణ్య క్షేత్రాలలో కలిసి పనిచేయాలని, నిపుణులైన శ్రామిక శక్తి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని ఇద్దరు మంత్రులు అంగీకరించారు

प्रविष्टि तिथि: 21 AUG 2023 8:00PM by PIB Hyderabad


           కేంద్ర విద్య, నైపుణ్య వృద్ధి & వ్యవస్థాపకత శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ఆస్ట్రేలియా ఆరోగ్య మరియు వయో వృద్ధుల సంరక్షణ శాఖ  మంత్రి శ్రీ మార్క్ బట్లర్‌తో సమావేశమయ్యారు.  

        నర్సింగ్ మరియు వయో-సంరక్షణ సంబంధిత కోర్సులకు సంబంధించిన శిక్షణ విషయాలు (కంటెంట్)  పంచుకోవడం మరియు నైపుణ్యాలు సమన్వయం ద్వారా వాటిలో  ఉత్తీర్ణులైన వారి  అర్హతలను పరస్పరం గుర్తించే దిశగా మంత్రులు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.  నిపుణులైన వృత్తిపనివారికి  ప్రవేశ  సౌలభ్యం కల్పించడం కోసం అందుకయ్యే  ఖర్చులను  మరియు భాషా నైపుణ్యాన్ని తగ్గించడం గురించి కూడా వారు చర్చించారు.

         నిపుణత కు సంబంధించిన ప్రాధాన్యతా రంగాల్లో పరస్పర లక్ష్యాలను సాధించడానికి అలాగే నిపుణులైన శ్రామిక శక్తి  ప్రపంచ డిమాండ్లను పరిష్కరించేందుకు కలిసి పనిచేయడానికి మంత్రులిద్దరూ అంగీకరించారు.

         అంతకుముందు పగటి పూట న్యూఢిల్లీలో ఆరోగ్య శ్రామిక దళం శిక్షణ &  నైపుణ్య పథములపై   జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రెండు దేశాల మధ్య విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఆరోగ్య సంరక్షణ భాగస్వామ్యంలో వినూత్న సహకారాన్ని గురించి చర్చించారు.

        ఆస్ట్రేలియా మంత్రి  శ్రీ మార్క్ బట్లర్‌,  కేంద్ర నైపుణ్య వృద్ధి, వ్యవస్థాపకత శాఖ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారి చర్చల్లో పాల్గొన్నారు. రెండు దేశాలు  ప్రతిభను అభివృద్ధి చేయడానికి మరియు ఉపయోగించుకోవడానికి, సామర్థ్యాలను పెంపొందించడానికి, నియామకాలను క్రమబద్ధీకరించడానికి ఒక మార్గాన్ని రూపొందించడానికి  దోహదం చేసే అంశాల గురించి  చర్చలు జరిపారు.  అదే విధంగా  ఆస్ట్రేలియాలో ఆరోగ్య సంరక్షణకు భారత్  అందించే తోడ్పాటు/సహకారాన్ని  స్పష్టం చేశారు.

         పరస్పరం అందించుకునే సహకారాన్ని రెండు దేశాలు గుర్తించాయి. ఇరువురి మధ్య భాగస్వామ్యం వృద్ధిచెందే క్రమంలో కీలకమైన ఈ రంగాల భవిష్యత్తును రూపొందించడానికి అవసరమైన సామర్థ్యాలు, నైపుణ్యం మెరుగుపరచడం కొనసాగిస్తారు.


 

****


(रिलीज़ आईडी: 1951252) आगंतुक पटल : 153
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी