జల శక్తి మంత్రిత్వ శాఖ

స్టాక్‌హోమ్ వాటర్ వీక్ 2023: '. సమగ్ర నదీ పరివాహక ప్రాంతం ప్రణాళిక మరియు నిర్వహణ కోసం పీర్ నెట్వర్కింగ్ 'పై డీ జీ, ఎన్ ఎం సీ జీ అధ్యక్షతన సదస్సు


నమామి గంగే 4.5 బిలియన్ డాలర్ల గణనీయమైన ఆర్థిక నిబద్ధతను కలిగి ఉంది మరియు ప్రణాళిక అమలు జోక్యాలు ఇప్పటికే నదీ జలాల నాణ్యతను సానుకూలంగా ప్రభావితం చేశాయి: డీ జీ, ఎన్ ఎం సీ జీ

Posted On: 21 AUG 2023 7:15PM by PIB Hyderabad

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ( ఎన్ ఎం సీ జీ) డైరెక్టర్ జనరల్ ఈరోజు స్టాక్‌హోమ్ వాటర్ వీక్‌లో 'సమగ్ర నదీ పరివాహక ప్రాంతం ప్రణాళిక మరియు నిర్వహణ కోసం పీర్ నెట్వర్కింగ్ ' అనే అంశంపై ఆన్‌లైన్ సెషన్‌కు అధ్యక్షత వహించి నదీ పరీవాహక నిర్వహణ విధానాన్ని అవలంబించడంపై ఇంటరాక్టివ్ చర్చను నిర్వహించారు.  ఎన్ ఎం సీ జీ, డీ జీ, శ్రీ జి. అశోక్ కుమార్ ప్రధానోపన్యాసం చేస్తూ, నిర్మల్ గంగ (కాలుష్యం లేని నది), అవిరల్ గంగ (అపరిమిత ప్రవాహం), జన్ గంగ (ప్రజల భాగస్వామ్యం), జ్ఞాన గంగ (జ్ఞానం మరియు పరిశోధన ఆధారిత జోక్యాలు) మరియు అర్థ్ గంగా (ప్రజలు-నది మధ్య ఆర్థిక వ్యవస్థ ద్వారా అనుసంధానం) అనే ఐదు ముఖ్యమైన స్తంభాలపై నమామి గంగను రూపొందించామని అన్నారు.  మాంట్రియల్‌లో  డిసెంబర్ 13, 2022న  జరిగిన యూ ఎన్ కాన్ఫరెన్స్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (కాప్ 15) లో ఆయన మాట్లడుతూ నమామి గంగే ప్రపంచంలోని ప్రశంసలు పొందిన నది పునరుజ్జీవన కార్యక్రమాలలో ఒకటిగా ఉందని మరియు టాప్ 10 "వరల్డ్ రిస్టోరేషన్ ఫ్లాగ్‌షిప్‌లలో" ఒకటిగా గుర్తించబడిందని ఆయన తెలియజేశారు.

 

నమామి గంగే మిషన్‌కు 4.5 బిలియన్ డాలర్ల గణనీయమైన ఆర్థిక నిబద్ధత ఉందని డీ జీ, ఎన్ ఎం సీ జీ అన్నారు. నదీ జలాల నాణ్యతలో గణనీయమైన మెరుగుదల మరియు కలుషిత ప్రాంతాల పునరుద్ధరణ వంటి  జోక్యాలు ఇప్పటికే సానుకూల ప్రభావాన్ని చూపాయి. గంగానది డాల్ఫిన్‌లు, ఘరియాల్స్ మరియు తాబేళ్లు వంటి జలచరాలలో గుర్తించదగిన పెరుగుదల ఉందని ఆయన పేర్కొన్నారు. గంగా బేసిన్‌లో 9.3 మిలియన్లకు పైగా భారతీయ ప్రధాన మత్స్య జాతులు (కట్లా, రోహు మరియు మృగాల్) మరియు 90,000 హిల్సా చేపలు పండించబడ్డాయి. అదనంగా, పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి అటవీ అధికారుల సామర్థ్యం అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభించబడ్డాయి.

 

శ్రీ కుమార్ ఎన్ ఎం సీ జీ యొక్క ఐదు అంచెల పాలనా నిర్మాణం - ప్రధాన మంత్రి నేతృత్వంలోని జాతీయ గంగా కౌన్సిల్ మరియు జిల్లా స్థాయిలో జిల్లా గంగా కమిటీలతోకూడిన పాలనా నిర్మాణం- గురించి  ఒక అవలోకనాన్ని అందించారు. నదీ పరీవాహక ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, జీవనోపాధి పురోగతి మరియు సమాజ భాగస్వమ్యం తెలిపే అర్థ గంగ గురించి కూడా ఆయన మాట్లాడారు. అర్థ గంగ ద్వారా, సంస్థాగత నిర్మాణం, జీరో-బడ్జెట్ సహజ వ్యవసాయం, ఎఫ్‌బిఓల ఏర్పాటు, ప్రజల భాగస్వామ్యం, మురుగునీరు మరియు బురదతో డబ్బు ఆర్జించడం, సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు జీవనోపాధి ద్వారా స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఉపయోగించుకునే  సంస్థలను స్థాపించాలని ఎన్ ఎం సీ జీ లక్ష్యంగా పెట్టుకుంది. అర్థ గంగా జోక్యాలను సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా గంగా కమిటీల (డిజిసి) పాత్రను ఆయన నొక్కి చెప్పారు. “మేము డిజిసిలను పునరుద్ధరించాము మరియు డిజిసి 4ఎం (నెలవారీ, తప్పనిసరి, పర్యవేక్షించబడిన మరియు నమోదు పద్దతి) ప్రారంభించాము. దీని ఫలితంగా డిజిసిల సాధారణ సమావేశాలు కీలకమైన అంశాలను చర్చిస్తున్నాయి, ”అని ఆయన అన్నారు, “ఏప్రిల్ 2022 నుండి జూలై 2023 మధ్య, మొత్తం 1689 సమావేశాలు నిర్వహించబడ్డాయి.”

 

 డీ జీ, ఎన్ ఎం సీ జీ  మాట్లాడుతూ , విశ్వవిద్యాలయాల నెట్‌వర్క్ ద్వారా అవగాహన మరియు యువత భాగస్వామ్యం పెంపొందించడానికి, ఎం ఓ యూ సంతకం కార్యక్రమం - నమామి గంగే: యూనివర్సిటీస్ కనెక్ట్ - ఏప్రిల్ 2023లో నిర్వహించబడిందని అన్నారు. దీనికి ముందు విశ్వవిద్యాలయాలతో ఒక సంవత్సరం పాటు వెబినార్ సిరీస్ నిర్వహించబడింది - ' ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్, రిజువనేటింగ్ రివర్స్'. "సమగ్ర పరిష్కారాల కోసం ఇంజినీరింగ్ నుండి ప్రజల భాగస్వామ్యానికి డైనమిక్ మార్పు జరుగుతోంది," అన్నారాయన.

 

 డీ జీ, ఎన్ ఎం సీ జీ రివర్-సిటీస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ, భారతీయ నదీ నగరాలకు స్థిరమైన పట్టణ నదుల నిర్వహణ కోసం ఆలోచనలు, ఉద్దేశపూర్వకంగా మరియు అంతర్దృష్టులను పంచుకోవడానికి ఒక ప్రత్యేక వేదికను అందించడం మరో వినూత్న కార్యక్రమం అన్నారు.  ఎన్ ఎం సీ జీ, జీ ఐ జెడ్ వంటి సంస్థల నుండి నైపుణ్యాన్ని పొందుతోంది. రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటుపై వ్యూహాత్మకంగా దృష్టి సారించి సంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. “అంతర్జాతీయ నిపుణులను నిమగ్నం చేయడం ద్వారా,  ఎన్ ఎం సీ జీ  వాస్తవ ప్రణాళికల రూపకల్పన మరియు సమర్థవంతమైన మార్గదర్శకత్వాన్ని నిర్ధారించడానికి సిద్ధంగా ఉంది.   ఇది ప్రపంచవ్యాప్త నది పునరుజ్జీవన సహకార ఫ్రేమ్‌వర్క్ నమూనా అభివృద్ధికి దోహదపడుతుంది, దీనిని ఇతర నదులు అనుకరిస్తాయి, ”అన్నారాయన.

 

గంగా పునరుజ్జీవనం/భారతదేశం ఈ యూ భాగస్వామ్యానికి జీ ఐ జెడ్ ఇండియా యొక్క ప్రోగ్రాం హెడ్, మార్టినా బుర్కార్డ్ నదీ పరీవాహక నిర్వహణలో మరింత సహకార ప్రయత్నాల అవసరాన్ని హైలైట్ చేశారు. సమగ్ర గంగా పరీవాహక నిర్వహణ ప్రణాళికల అభివృద్ధి నుండి అమలు-ఆధారిత సబ్ బేసిన్ ప్రణాళికల వరకు గంగా పరీవాహక పాలన యొక్క పథం విభిన్న దశల ద్వారా అభివృద్ధి చెందిందని ఆమె పేర్కొన్నారు. "ఈ సబ్-బేసిన్ ప్లాన్‌లు జిల్లా స్థాయి మరియు విస్తృతమైన నదీ పరీవాహక నిర్వహణ వ్యూహాలతో సమలేఖనం చేయబడ్డాయి," అని ఆమె చెప్పారు, "అంతర్జాతీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని  ఎన్ ఎం సీ జీ డైనమిక్ విధానాన్ని అవలంబిస్తుంది." ఇది వాటాదారుల భాగస్వామ్య విధానం యొక్క పునాదిని ఏర్పరుస్తుంది, ఇది చక్రీయ పురోగతిని సులభతరం చేస్తుంది, ఈ విధానానికి కేంద్రంగా జిల్లాలను ముందంజలో ఉంచుతున్నట్లు ఆమె చెప్పారు. జిల్లా గంగా ప్రణాళికల బ్లూప్రింట్‌ను వివరించడానికి జిల్లాలు మరియు  ఎన్ ఎం సీ జీ మధ్య సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఒక  ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసినట్లు ఆమె తెలిపారు. విభిన్న రంగాల నుండి వాటాదారులను ఏకం చేస్తూ పీర్ నెట్‌వర్కింగ్ శక్తివంతమైన సాధనంగా ఎలా నిలుస్తుందో హైలైట్ చేయడం ద్వారా ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.

 

ఫ్యాకల్టీ, వాటర్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, కోబ్లెంజ్, ప్రొఫెసర్ డోర్టే జీగ్లెర్ సరిహద్దుల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు నీటి-సంబంధిత సవాళ్లను పరిష్కరించడంలో కీలకమైన అంశంగా ఎలా ఉద్భవించింది అనే దాని గురించి మాట్లాడారు. నదీ పరీవాహక ప్రాంతాలు భౌగోళిక రాజకీయ సరిహద్దులను అధిగమిస్తున్నందున, సరిహద్దుల ద్వారా పరిమితం చేయబడని నీటి విశ్వవ్యాప్తతను ఆమె నొక్కిచెప్పారు. ఎగువ మరియు దిగువ దేశాల పరస్పర అనుసంధానం నీటి వనరులను కాపాడుకోవడంలో భాగస్వామ్య బాధ్యతను నొక్కి చెబుతుంది. అనేక నగరాలకు అవసరమైన తాగునీటిని అందించే ర్యాన్ నది యొక్క ఉదాహరణను ఉపయోగించి, చేపల వలసలపై తీవ్ర ప్రభావాన్ని ప్రొఫెసర్ జీగ్లర్ గుర్తించారు. నీటి శుద్ధి మరియు మౌలిక సదుపాయాల వంటి బహుముఖ సమస్యలతో నగరాలు ఇబ్బందిడుతున్నందున, సహకార సమస్య పరిష్కార విధానం తప్పనిసరి అని ఆమె అన్నారు. అందరినీ కలుపుతూ, సమీకృత వ్యూహాన్ని రూపొందించడంలో  ఎన్ ఎం సీ జీ నిరంతర ప్రయత్నాలు ప్రభావవంతమైన ఆదర్శ మార్గంగా గుర్తించడం అభినందనీయం.

 

జర్మనీలోని పర్యావరణ, వాతావరణం, ఇంధనం మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ,హాంబర్గ్ సిటీ వాటర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అడ్వైజర్, క్రిస్టియన్ ఎబెల్ దేశంలోని వివిధ ప్రాంతాలలోని నీటి చట్టాల సంక్లిష్టతను మరియు నీరు భౌగోళిక అధికార పరిధి సరిహద్దులు కట్టుబడి ఉండకపోవటం వలన ఎదురయ్యే ప్రత్యేక సవాలును ఎత్తిచూపారు. నదీ పరీవాహక నిర్వహణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం, సమన్వయం చేయడం మరియు అంచనా వేయడం కోసం రాష్ట్రాలు సమిష్టిగా పాల్గొనే రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ కమిటీల భావనను ఆయన వివరించారు. చురుకైన ప్రజా భాగస్వామ్యం మరియు విభిన్న రంగాల నుండి లబ్దిదారులను కలుపుకునిపోవడం ద్వారా సయోధ్య సహకారాన్ని పెంపొందించడం నదీ పరీవాహక నిర్వహణ యొక్క ప్రధాన అంశం అని ఆయన అన్నారు. నిర్ణయాత్మక ప్రక్రియను సుసంపన్నం చేయడానికి మరియు నది పర్యావరణ వ్యవస్థపై సంపూర్ణ అవగాహనను నిర్ధారించడానికి నిపుణులతో సహకారం అవసరం.

 

లీడ్ వాటర్ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్, శ్రీమతి కార్మెన్ రోసా యీ బాటిస్టా నది కార్యకలాపాలను పెంచడానికి సహకార ప్రయత్నాల అవసరాన్ని నొక్కి చెప్పారు. విజయవంతమైన నది పునరుజ్జీవన కార్యక్రమాల కోసం ఆమె మూడు  పద్ధతులను వివరించారు- విజ్ఞాన-ఆధారిత విధానాలను బలోపేతం చేయడం, సమర్థవంతమైన డేటా కమ్యూనికేషన్ మరియు పర్యవేక్షణ మరియు ప్రభుత్వ నిర్మాణాలను బలోపేతం చేయడం. స్థానిక లబ్దిదారులను కలుపుకునిపోవడం, భాగస్వామ్య నిర్ణయం తీసుకునే ప్రక్రియలను సులభతరం చేయడం మరియు విభిన్న సమూహాల అంచనాలను పరిష్కరించడం వంటి ప్రాముఖ్యతను కూడా ఆమె హైలైట్ చేసారు.

 

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ నుండి శ్రీమతి షర్మి పాలిట్ గంగా ప్రహరీల వంటి స్వీయ-ప్రేరేపిత కేడర్‌ల ప్రాముఖ్యతపై మాట్లాడారు, ఇది క్షేత్ర స్థాయి నుండి నిష్క్రమించిన తర్వాత కూడా నమామి గంగే వంటి మిషన్‌ల లక్ష్యాలను కొనసాగించడాన్ని స్థానిక సంఘాలకు ఉదాహరణగా చూపుతుంది.

 

శ్రీ డి.పి. మథూరియా (ఈ డీ, ఎన్ ఎం సీ జీ) సెషన్‌ను మోడరేట్ చేసారు మరియు శ్రీమతి మార్టినా బుర్కార్డ్ (ప్రోగ్రామ్ హెడ్, గంగా పునరుజ్జీవనం/ఇండియా ఈ యూ భాగస్వామ్య మద్దతు జీ ఐ జెడ్  ఇండియా) ధన్యవాదాలు తెలిపారు. సెషన్‌లో 160 మందికి పైగా పాల్గొన్నారు. ఆగస్ట్ 20న, స్టాక్‌హోమ్ వాటర్ వీక్ ప్రారంభం రోజున 'నీటి నాణ్యత నిర్వహణ: భారతదేశం నుండి నేర్చుకున్న పాఠాలు' అనే సెషన్‌లో  డీ జీ, ఎన్ ఎం సీ జీ కూడా పాల్గొన్నారు.

 

***



(Release ID: 1951121) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Hindi