యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య క్రీడల రంగంలో సహకారాని కి ఉద్దేశించిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపినమంత్రిమండలి

Posted On: 16 AUG 2023 4:29PM by PIB Hyderabad

భారతదేశం గణతంత్రాని కి చెందిన యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో ఆరోగ్యం మరియు వృద్ధుల సంరక్షణ విభాగానికి మధ్య క్రీడల రంగం లో సహకారాని కి ఉద్దేశించిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదాన్ని తెలిపింది.

 

భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య క్రీడల రంగం లో ద్వైపాక్షిక ఆదాన ప్రదాన కార్యక్రమాలు; స్పోర్ట్స్ సైన్సెస్, క్రీడా రంగ సంబంధి సాంకేతికత లు మరియు ఆ రంగం లో మౌలిక సదుపాయాల పరం గా జ్ఞానాన్ని మరియు ప్రావీణ్యాన్ని విస్తృతం చేసుకోవడం లో సాయపడుతాయి; ఈ ద్వైపాక్షిక ఆదాన ప్రదాన కార్యక్రమం లో భాగం గా క్రీడాకారుల తో పాటు కోచ్ లకు సైతం శిక్షణ మరియు ప్రగతి; స్పోర్ట్స్ గవర్నెన్స్ ఇంకా నిష్ఠ; క్రీడల లో అట్టడుగు స్థాయి లో ప్రాతినిధ్యం; ప్రధానమైనటువంటి క్రీడా కార్యక్రమాల నిర్వహణ; క్రీడల లో వైవిధ్యం మరియు వివిధ వర్గాల వారి ని కలుపుకొని ముందుకు పోవడం వంటి వాటి కి కూడాను ఈ కార్యక్రమాలు తోడ్పడుతాయి. ఫలితం గా మన క్రీడాకారులు అంతర్జాతీయ ఆటల పోటీల లో వారి ప్రదర్శన మెరుగు పడుతుంది; భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతాయి.

 

ఆస్ట్రేలియా తో పాటు క్రీడారంగం లో ద్వైపాక్షిక సహకారం ఫలితం గా ఒనగూరే లాభాలు క్రీడాకారులు అందరికి సమానం గా వర్తిస్తాయి., జాతి, వర్గం, ధర్మం, ప్రాంతం, ఆడ లేక మగ వంటి ఏ విభేదాలు లెక్క కు రావు కూడాను.

 

***

 



(Release ID: 1949574) Visitor Counter : 92