సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్ఐఎస్‌డి) సార్వత్రిక మండలి సమావేశం
ఎన్ఐఎస్‌డి వ్యవస్థ, విధులు, కార్యక్రమాల స్థితిగతులను సమీక్షించేందుకు సమావేశ నిర్వహణ
Posted On:
14 AUG 2023 2:17PM by PIB Hyderabad
సినియర్ అధికారుల సమక్షంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్ఐఎస్‌డి) సార్వత్రిక మండలి సమావేశానికి సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని సామాజిక న్యాయం సాధికారత విభాగం కార్యదర్శి, జిసి అధ్యక్షుడు శ్రీ సౌరభ్ గార్గ్ అధ్యక్షత వహించారు.
ఎన్ఐఎస్‌డి వ్యవస్థ, విధులు, కార్యక్రమాల స్థితిగతులను సమీక్షించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యం. చర్చకు ముందుగా, ఎన్ఐఎస్‌డి డైరెక్టర్ ఎన్ఐఎస్‌డిపి క్లుప్తమైన ప్రెజెంటేషన్‌ను ఇవ్వడమే కాకుండా, సంక్షిప్త వీడియోచిత్రం ద్వారా ఎన్ఐఎస్‌డిలోని డివిజన్లను, వాటి కార్యకలాపాలను ప్రదర్శించారు.
ఈ సమావేశంలో 2020-2021, 2021-2022 సంవత్సరాలలోని అంశాలు, 2022-23 బ్యాలెన్స్ షీట్, ఆర్ధిక సంవత్సరం 2022-23లో శిక్షణా కార్యక్రమాల స్థితిగతులు, 2023-24కు ఎన్ఐఎస్‌డి కోర్సు కేలండర్, ఢిల్లీ పోలీసు అకాడమీతో అవగాహనా ఒప్పందం, మానవ వనరులతో పరిశోధనా విభాగం పునరుద్ధరణ, 2023-24లో ఎన్ఐఎస్‌డి ప్రణాళిక రూపొందించిన పరిశోధనా కార్యకలాపాలు, ఎన్ఐఎస్‌డిలో ప్రసార స్టూడియో ప్రారంభం, ఎన్ఐఎస్‌డి ప్రతిపాదిత వ్యవస్థ, నేషనల్ జర్నల్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ప్రచురణను పునరుద్ధరించడం తదితర అజెండా అంశాలను కూడా చర్చించారు.
వివరణాత్మక చర్చ అనంతరం, పరిశోధన, శిక్షణా కార్యకలాపాలను పెంచడంలో తోడ్పాటునిచ్చే సిబ్బంది స్థానాలను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా విస్త్రత స్థాయిలో కార్యకలాపాలను విస్తరింపచేయడం కోసం రాష్ట్ర, కేంద్ర సంస్థలతో మరింత సమన్వయం ఉండాలని ఎన్ఐఎస్‌డికి సూచించడం జరిగింది. అంతేకాకుండా, ఆర్థిక సంవత్సరం 2022-23లో ఎన్ఐఎస్‌డి పనితీరును సమీక్షించి, సంతృప్తికరంగా ఉన్నట్టు తేల్చారు. చివరగా, సామాజిక రక్షణ రంగంలో శ్రేష్ఠమైన సంస్థగా ఎన్ ఐ ఎస్‌డి ఎదగాల్సిన అవసరం ఉందని సామాజిక న్యాయం & సాధికారత విభాగం కార్యదర్శి పేర్కొన్నారు.
***
(Release ID: 1948851)
Visitor Counter : 137