సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
‘हरकामदेशकेनाम’
స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యూదిల్లీలో ప్రధాని ప్రసంగాన్ని వినే 1800 మంది ప్రత్యేక ఆహ్వానిత ‘ఖాదీ కళాకారుల్లో’ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆహ్వానితుడు
'జన్ భాగీదారి' దార్శనికతకు అనుగుణంగా దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలో వేడుకల్లో పాల్గొనే అవకాశం
Posted On:
11 AUG 2023 6:48PM by PIB Hyderabad
న్యూదిల్లీ/విజయవాడ, 11 ఆగస్టు 2023
ఆగస్టు 15న, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన తర్వాత గౌరవనీయ ప్రధాన మంత్రి చేసే ప్రసంగాన్ని వినడానికి ఆహ్వానం అందుకున్న ప్రత్యేక వ్యక్తుల సమక్షంలో ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వైబ్రంట్ విలేజ్‌ల సర్పంచులు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు; సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, అమృత్ సరోవర్, హర్‌ఘర్ జల్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పని చేస్తున్న వ్యక్తులు ప్రత్యేక ఆహ్వానితుల్లో ఉన్నారు.
కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా 50 మంది ఖాదీ నేతకారులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానం పంపింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణానికి చెందిన నేతన్న శ్రీ బల్ల భద్రయ్య కూడా ఈ గౌరవం అందుకున్నారు. ఆగస్టు 15న, తన జీవిత భాగస్వామి శ్రీమతి బల్లా లక్ష్మితో కలిసి ప్రత్యేక అతిథి హోదాలో చారిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆయన వీక్షిస్తారు. చారిత్రాత్మక కట్టడం పైనుంచి గౌరవనీయ ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని వినడానికి ఆహ్వానం అందుకున్న 1800 మంది వ్యక్తులు వారి కుటుంబాలతో సహా హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ 'జన్ భాగీదారి' దార్శనికతకు అనుగుణంగా, దేశంలోని ప్రతి వర్గం ప్రజలకు ఎర్రకోటలో వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది.
కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించడం పట్ల, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం పట్ల శ్రీ బల్ల భద్రయ్య సంతోషం వ్యక్తం చేశారు. తన లాంటి సామాన్యుడిని దేశ రాజధానిలో జరిగే స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనమని ఆహ్వానించినందుకు గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
****
;
(Release ID: 1947942)