అంతరిక్ష విభాగం
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీఈలు)కు మెరుగైన భాగస్వామ్యానికి భారత అంతరిక్ష విధానం - 2023 అవకాశం కల్పిస్తుందని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ - ఇండియా (ఎల్‌ఐజీఓ-ఇండియా) ప్రాజెక్ట్‌ను రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో భారత ప్రభుత్వం ఆమోదించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లీడ్ ఏజెన్సీగా ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
10 AUG 2023 3:49PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఒఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు మాట్లాడుతూ " ఇండియన్ స్పేస్ పాలసీ - 2023 ఆమోదించబడింది. పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేయబడింది. ఈ పాలసీ అంతరిక్ష రంగాన్ని అందరికీ తెరుస్తుంది" అని తెలిపారు.
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం విలువ గొలుసు అంతటా ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీఈలు) మెరుగైన భాగస్వామ్యం కోసం వివిధ వాటాదారులు ఇన్-స్పెస్, ఇస్రో,ఎన్‌ఎస్‌ఐఎల్ మరియు డిఓఎస్ వంటి పాత్రలను స్పష్టంగా వివరిస్తుంది.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడం మరియు అధికారం కోసం ప్రభుత్వం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పెస్)ని సింగిల్ విండో ఏజెన్సీగా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇన్-స్పేస్ కోసం బడ్జెట్ కేటాయింపులు:
2021-22 రూ. 10 కోట్లు
2022-23 రూ. 33 కోట్లు
2023-24 రూ. 95 కోట్లు
భారత ప్రభుత్వం రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ - ఇండియా (లిగో-ఇండియా) ప్రాజెక్ట్‌ను ఆమోదించిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లీడ్ ఏజెన్సీగా ఉందని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత లిగో-ఇండియా గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం మరియు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సంబంధిత రంగాలలో పరిశోధన కోసం జాతీయ సదుపాయంగా నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు.
చంద్రయాన్-3 అంశంపై డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 14 జూలై 2023న 14:35 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఎల్‌విఎం-3 నుండి అంతరిక్ష నౌక విజయవంతంగా ప్రయోగించబడిందని ప్రస్తుతం అంతరిక్ష నౌక చంద్ర-కక్ష్య ఇన్సర్షన్ (ఎల్‌ఓఐ)తో ట్రాన్స్‌లూనార్ కక్ష్యలో ఉందని తెలిపారు.
<><><><><>
(Release ID: 1947680)
Visitor Counter : 198