ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆహార శుద్ధి పరిశ్రమ కోసం పీఎల్‌ఐ పథకాలు

Posted On: 08 AUG 2023 2:59PM by PIB Hyderabad

'ఆహార శుద్ధి పరిశ్రమ కోసం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం' (పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐ) కోసం ₹10,900 కోట్ల బడ్జెట్‌ను 2021 మార్చి 31 కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2021-22 నుంచి 2026-27 వరకు ఇది అమలవుతుంది. ఈ పథకంలో మూడు భాగాలు ఉంటాయి: నాలుగు ప్రధాన ఆహార ఉత్పత్తుల విభాగాల్లో తయారీని ప్రోత్సహించడం, ఎస్‌ఎంఈల వినూత్న/సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, భారతీయ బ్రాండ్‌లకు విదేశాల్లో ప్రచారం, మార్కెటింగ్‌కు మద్దతు ఇవ్వడం. దీనికి అదనంగా, 'తృణధాన్యాల ఆధారిత ఉత్పత్తుల కోసం పీఎల్‌ఐ పథకం'ను (పీఎల్‌ఐఎస్‌ఎంబీపీ) ₹800 కోట్ల వ్యయంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది, పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐ పొదుపులను ఇది ఉపయోగించుకుంటుంది. ఈ పథకం ఆహార శుద్ధి పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచుతుంది. శుద్ధి సామర్థ్యాన్ని విస్తరించే ప్రణాళికతో ఉన్న ఆహార తయారీ సంస్థలకు మద్దతుగా నిలుస్తుంది. ప్రఖ్యాత భారతీయ బ్రాండ్ల వృద్ధికి ఆసరా ఇస్తుంది, ప్రపంచ మార్కెట్‌లో భారతీయ ఆహార బ్రాండ్ల వినియోగాన్ని పెంచుతుంది, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది, రైతులకు అధిక ఆదాయానికి భరోసా ఇస్తుంది.

ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ మూడు ప్రధాన పథకాలను అమలు చేస్తోంది: ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై), ప్రధానమంత్రి ప్రార్ములైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం, ప్రొడక్షన్‌ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం. ఈ మూడు పథకాలు మొత్తం ఆహార శుద్ధి విలువ గొలుసుకు సంపూర్ణ మద్దతు అందిస్తాయి, అంతర్జాతీయ నాణ్యత & భద్రత ప్రమాణాలను అందుకోవడంలో సాయపడతాయి. ఆహార నాణ్యత & భద్రత ప్రమాణాల కోసం ఆహార శుద్ధి రంగంలో పరిశోధన & అభివృద్ధిని ప్రోత్సహించడం పీఎంకేఎస్‌వై లక్ష్యాల్లో ఒకటి. ఈ పథకంలో, గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం అందితుంది. సాధారణ ప్రాంతాల్లో 50% పరికరాల ఖర్చులు, సంక్లిష్ట ప్రాంతాల్లో 70% పరికరాల ఖర్చును ఈ పథకం భరిస్తుంది. పీఎంకేఎస్‌వై పథకాన్ని "ఆహార భద్రత & నాణ్యత హామీ మౌలిక సదుపాయాల" పథకం అని కూడా పిలుస్తారు. దీని కింద, దేశవ్యాప్తంగా ఆహార పరీక్ష ప్రయోగశాలల స్థాపన & అభివృద్ధి కోసం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సాయం అందితుంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుంది.
ఇథనాల్ ఉత్పత్తిని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం 'ఇథనాల్ బ్లెండెడ్ విత్ పెట్రోల్' (ఈబీపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2018 నుంచి 2022 వరకు, వివిధ ఇథనాల్ వడ్డీ రాయితీ పథకాలను తీసుకురావడం జరిగింది. కొత్త డిస్టిలరీలను స్థాపించడానికి, లేదా ఇప్పటికే ఉన్న వాటి సామర్థ్యం పెంచేలా పారిశ్రామికవేత్తలను ఇది ప్రోత్సహిస్తుంది. ఈ పథకం ఇథనాల్ ఉత్పత్తి వృద్ధిని ప్రోత్సహించడానికి, బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఐదేళ్లపాటు వసూలు చేసే వడ్డీలో 6% లేదా 50% వడ్డీ రాయితీలో ఏది తక్కువైతే రాయితీగా అందుతుంది. దీంతోపాటు, ఒక సంవత్సరం మారటోరియం అమలవుతుంది. ఇథనాల్ ఉత్పత్తిని మరింతగా ప్రోత్సహించడానికి, 2021లో, ధాన్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడాన్ని కూడా ఈ పథకాల కిందకు తీసుకురావడం జరిగింది.

భారత ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజనను (పీఎంకేఎస్‌వై) అమలు చేస్తోంది. ఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల ఇబ్బందులను ఇది పరిష్కరిస్తుంది, ఆహార శుద్ధి రంగంలో నూతన సాంకేతికతను తీసుకువచ్చేలా ప్రోత్సహిస్తుంది. ఆహార శుద్ధి రంగంలో సరఫరా గొలుసు, నిల్వ సామర్థ్యాలను మెరుగుపరచే సౌకర్యాల ఏర్పాటుకు పీఎంకేఎస్‌వై సాయం చేస్తుంది. ఈ పథకం కింద 1,281 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

ఆర్థిక సాయం & ఇతర ప్రయోజనాల ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతికత, సామర్థ్య విస్తరణ కోసం ఎస్‌ఎంఈలకు పీఎంకేఎస్‌వై సాయం చేస్తుంది. దీనివల్ల ఎస్‌ఎంఈల శుద్ధి స్థాయి, ఉత్పత్తి నాణ్యత, మార్కెట్‌ వినియోగం మెరుగుపడ్డాయి. ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 13.09 లక్షల మందికి ఉద్యోగాలు లభింజచాయి.

మంత్రిత్వ శాఖ, తాను అమలు చేస్తున్న మూడు ప్రధాన పథకాలు పీఎంకేఎస్‌వై, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎల్‌ఐ ద్వారా ఆహార శుద్ధిని, స్ధిరత్వాన్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా ఆహార నష్టాలను తగ్గిస్తోంది. సాంకేతికత ఆధారిత ఆహార శుద్ధి ప్రాసెసింగ్ ఆవిష్కరణ, నాణ్యత, భద్రత, వ్యాపారంతో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉత్పత్తిని పెంచడం పీఎంకేఎస్‌వై పరిధిలోని ఆర్‌&డీ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. వినూత్న ఉత్పత్తులపై దృష్టి పెట్టే ఎంఎస్‌ఎంఈలను  పీఎల్‌ఐ పథకం ప్రోత్సహిస్తుంది.  తృణధాన్యాల ఆధారిత ఉత్పత్తుల పీఎల్‌ఐ పథకం కూడా తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తుంది. వీటి సాగుకు తక్కువ వనరులు సరిపోతాయి, అద్భుతమైన పోషకాలను అందిస్తాయి, వాతావరణం మార్పులను తట్టుకోగలవు. స్థిరత్వం లక్ష్యాన్ని సాధించడంలో ఈ పథకం సాయపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా "బ్రాండ్ ఇండియా"ను ప్రోత్సహించడానికి, విదేశాల్లో ప్రచారం, మార్కెటింగ్‌ చేసే సంస్థలకు 'ఆహార శుద్ధి పరిశ్రమ కోసం పీఎల్‌ఐ పథకం' మద్దతుగా నిలుస్తుంది. అంతర్జాతీయ బ్రాండింగ్‌పై ఖర్చు చేసిన సంస్థలు, ఆ వ్యయాల్లో 50%ను ఆర్థిక ప్రోత్సాహకాలుగా అందుకుంటాయి. ఆహార ఉత్పత్తుల అమ్మకాలలో 3% లేదా సంవత్సరానికి 50 కోట్లలో ఏది తక్కువైతే అది కంపెనీలకు సాయంగా లభిస్తుంది. ప్రస్తుతం, పీఐఎల్‌ పథకం కింద 77 దరఖాస్తులు లబ్ధి పొందుతున్నాయి.

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

******


(Release ID: 1946680) Visitor Counter : 256


Read this release in: English , Urdu , Hindi