ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో ప్రభుత్వ వ్యయం
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ 2018–19, 2022–23 సంవత్సరాల మధ్య 33 ప్రాజెక్టులకు మొత్తం 231.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
Posted On:
07 AUG 2023 3:26PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం, మినహాయింపులేని కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు (ప్రస్తుతం 55), తమ స్థూల బడ్జెట్ లో కనీసం పదిశాతం మొత్తాన్ని
ఈశాన్య ప్రాంతంలోని కేంద్ర ,లేదా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై ఖర్చుచేయవలసి ఉంటుంది. మినహాయింపు లేని మంత్రిత్వశాఖలు, విభాగాలు 2014–15 నుంచి ఈశాన్య ప్రాంతంలో 10 శాతం జిబిఎస్ను కేటాయించాయి. ఇందుకు సంబంధించి సంవత్సరం వారీ కేటాయింపులు, వాస్తవ ఖర్చు కింది అనుబంధంలో ఇవ్వడం జరిగింది.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ 2018–19, 2022–23 ఆర్థిక సంవత్సరాల మధ్య 33 ప్రాజెక్టులకు మొత్తం 231.50 కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి కింద
విడుదల చేసింది. వీటిని బోడోలాండ్ ప్రాదేశిక మండలి (బిటిసి), కర్బి ఆంగ్లాంగ్ స్వతంత్ర ప్రాదేశిక మండలి (కె.ఎ.ఎ.టి.సి), దిమా –హసావో ప్రాదేశిక మండలికి కేటాయించింది.
అదనంగా, 69.95 కోట్ల రూపాయల విలువగల 15 ప్రాజెక్టుకు , ప్రత్యేకించి ఎంపిక చేసిన వెనుకబడిన కమ్యూనిటీలకు, 38 ప్రాజెక్టులకు ఎంపిక చేసినబ్లాకులలో 174.26 కోట్లు , 14 ప్రాజెక్టులకు 26.56 కోట్లు కేటాయించారు.
వీటిని ఎంపిక చేసిన గ్రామాలలో ప్రత్యేకంగా గుర్తించిన సేవలు అందించేందుకు కేటాయించారు. 2021–22,2022–23 మధ్య ఎన్ఇసి వీటిని కేటాయించింది.
31.03.2023 తేదీ నాటికి 1909 కిలోమీటర్ల పొడవుగల రూ 81,941 కోట్ల రూపాయల విలువకాగల మొత్తం 19 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తిగా లేదా పాక్షికంగా ఈశాన్య ప్రాంతంలో వివిధ దశలలో ఉన్నాయి. ఇవి కొన్ని ప్రణాళిక దశలో ఉండగా మరికొన్ని ఆమోదం, మరికొన్ని అమలు దశలో ఉన్నాయి. వీటిలో 482 కిలోమీటర్ల పొడవుగల రైల్వే మౌలికసదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.
వీటిపై 31.03.23 నాటికి 37, 713 కోట్ల రూపాయల వ్యయం అయింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన 261 రోడ్డు ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. వీటి మొత్తం అనుమతి వ్యయం రూ1,02,594 కోట్ల రూపాయలు.
వీటిని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్.హెచ్.ఎ.ఐ), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్),
ఈశాన్య రాష్ట్రాలలోని రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్ ల (పిడబ్ల్యుడిల) ద్వారా అమలుచేస్తున్నారు.పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈశాన్య ప్రాంతంలో రూ 3,422,43 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులు అమలు చేస్తోంది. అనుసంధానతతో ముడిపడిన కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వశాఖలు పెట్టిన ఖర్చు కాకుండా, 51 ప్రాజెక్టుల కు కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాల కింద, రూ 4,345.16 కోట్ల రూపాయలను , కేటాయించడం జరిగింది. వీటిని ఈశాన్యప్రాంతంలో అనుసంధాన ప్రాజెక్టులకు కేటాయించారు.
***
(Release ID: 1946604)
Visitor Counter : 105