గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

చిరువ్యాపారులకు ఆర్థిక చేయూత

Posted On: 03 AUG 2023 5:25PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం పడ్డ  చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను పునఃప్రారంభించేందుకు అనుషంగిక రహిత పెట్టుబడి వ్యయంగా సులభతరంగా రుణాన్ని ఇచ్చే లక్ష్యంతో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్యుఏ) 2020 జూన్ 1న ప్రధాన మంత్రి చిరు వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకాన్ని ప్రారంభించింది.  

పథకం లక్ష్యాలు:

  1. మునుపటి లోన్‌లను తిరిగి చెల్లించడం ద్వారా రెండవ, మూడవ విడతలలో వరుసగా రూ.20,000, రూ.50,000 మెరుగైన  రుణంతో, ఒక సంవత్సర కాల వ్యవధిలో రూ.10,000 వరకు కొలేటరల్ ఫ్రీ వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని సమకూరుస్తారు. 
  1. రుణాన్ని తిరిగి సక్రమంగా సమయానికి చెల్లిస్తే సబ్సిడీ కింద  ఏడాదికి  7 శాతం మాత్రమే వడ్డీ ఉంటుంది. 
  1. డిజిటల్ లావాదేవీలకు ఏటా రూ.1200 కాష్ బ్యాక్ రివార్డ్ ఉంటుంది. 

ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద, పట్టణ ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతున్న చిరు వ్యాపారులందరూ అర్హులు. ఈ వ్యాపారులు సంబంధిత టౌన్ వెండింగ్ కమిటీ (టివిసి) జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ (సిఓవి) లేదా లెటర్ ఆఫ్ రికమండేషన్ (ఎల్ఓఆర్) కలిగి ఉండాలి.

వీధి వ్యాపారులు ముందు రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లించడం ద్వారా పీఎం స్వనిధి కింద 3వ విడత రుణం గరిష్టంగా రూ.50,000 పొందవచ్చు. 31.07.2023 నాటికి, ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 3వ విడత రుణం కింద రూ.6607.94 కోట్ల మొత్తంలో 51.35 లక్షల రుణాలు పంపిణీ చేశారు.

పీఎం స్వనిధి పథకం కింద, 1వ, 2వ, 3వ విడతల కింద ఇచ్చిన రూ. 10,000, రూ. 20,000, రూ. 50,000 రుణం వరుసగా 12 నెలలు, 18 నెలలు, 36 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. లెండింగ్ సంస్థలు వసూలు చేసే వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఈఎంఐ లను సకాలంలో తిరిగి చెల్లించడంపై త్రైమాసిక ప్రాతిపదికన 7% వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద, వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చే సంస్థల ద్వారా నేరుగా రుణాలు పంపిణీ చేస్తారు. రుణ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే  బకాయిపడ్డ సంబంధిత లెండింగ్ సంస్థలు చర్యలు తీసుకుంటాయి.
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****(Release ID: 1945639) Visitor Counter : 163


Read this release in: English , Tamil