ఆర్థిక మంత్రిత్వ శాఖ
2022-23 సంవత్సరంలో పిఎస్ బిలు ప్రారంభించిన మొత్తం 927 ఖాతాల్ల గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినవి 316 బ్రాంచిలు
Posted On:
31 JUL 2023 7:03PM by PIB Hyderabad
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) 2017 మే 18వ తేదీన జారీ చేసిన సర్కులర్ కింద సవరించిన మార్గదర్శకాల్లో ‘‘బ్రాంచి’’ అనే మాటను ‘‘బ్యాంకింగ్ ఔట్ లెట్’’గా మార్చారు. నాలుగు గోడల మధ్య ఉండే బ్రాంచిలతో పాటు బిజినెస్ కరెస్పాండెంట్ (బిసి) ఔట్ లెట్లు కూడా తక్కువ ధరలో బ్యాంకులు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్ వర్క్ విస్తరించడంలో కీలకంగా ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్ రావు కరద్ లోక్ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు.
ప్రస్తుత ప్రణాళికా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరాల వారీగా పిఎస్ బిలు ప్రారంభించిన శాఖల వివరాలు ఈ దిగువ పట్టికలో చూడవచ్చు.
ఆర్థిక సంవత్సరం
|
ప్రాంరంభించిన మొత్తం బ్రాంచిలు
|
వాటిలో గ్రామీణ బ్రాంచిలు
|
2018-19
|
430
|
128
|
2019-20
|
545
|
130
|
2020-21
|
651
|
75
|
2021-22
|
476
|
100
|
2022-23
|
927
|
316
|
ఆధారం : ఆర్ బిఐ
80 గ్రామాల్లో కొత్త బ్రాంచిలు ప్రారంభించేందుకు సర్వే చేపట్టినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) తెలియచేసింది.
బ్యాంకింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో బ్యాంకింగ్ ఔట్ లెట్లు ప్రారంభించడం ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి చెప్పారు. ఆ వ్యవహారాన్ని రాష్ర్టాలు/యుటిల స్థాయి బ్యాంకర్ల కమిటీలు (ఎస్ఎల్ బిసి/ యుటిఎల్ బిసి) రాష్ర్టప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలను, సభ్య బ్యాంకర్లను, ఇతర భాగస్వాములను సంప్రదించి పర్యవేక్షిస్తాయి. ఆర్ బిఐ ఆదేశాల పరిధిలో బ్యాంకులు బ్యాంకింగ్ ఔట్ లెట్లు ప్రారంభించాలన్న ప్రతిపాదనలను, వాటి వ్యాపార ప్రణాళికలను, వాణిజ్యపరమైన లాభదాయకతను పరిశీలిస్తాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించే బ్యాంకింగ్ ఔట్ లెట్లలో కనీసం 25 శాతం బ్యాకింగ్ సదుపాయాలు లేని ప్రాంతాల్లోనే అంటే 10,000 కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లోనే (ఐదవ, ఆరవ శ్రేణి కేంద్రాలు) తెరవాలన్న నిబంధనకు లోబడి ఏ ప్రాంతంలో అయినా బ్యాంకింగ్ ఔట్ లెట్లను తన అనుమతి లేకుండానే ప్రారంభించేందుకు దేశీయ షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులకు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా) ఆర్ బై సార్వత్రిక అనుమతి మంజూరు చేసింది.
***
(Release ID: 1944944)
Visitor Counter : 71