నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ జలమార్గాల ప్రాజెక్ట్

Posted On: 28 JUL 2023 3:16PM by PIB Hyderabad

దేశంలో అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) అభివృద్ధి కోసం, 24 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 111 జలమార్గాలు (ఇప్పటికే ఉన్న 5 మరియు 106 కొత్తవి) జాతీయ జలమార్గాల చట్టం, 2016 ప్రకారం జాతీయ జలమార్గాలు (నేషనల్ వాటర్ వేస్)గా ప్రకటించబడ్డాయి. సాంకేతిక ఫలితాల ఆధారంగా -ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం మరియు ఈ జలమార్గాల కార్యాచరణ ప్రణాళిక యొక్క వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) 26 జలమార్గాల కోసం రూపొందించబడింది.  ఇవి కార్గో మరియు ప్రయాణీకుల కదలికకు ఆచరణీయమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం, 20 జలమార్గాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.
ఒండ్రు నదుల వంకరలు, అవసరాలకు నీటిని ఉపసంహరించడం, వినియోగం కారణంగా జలరవాణాకు జలవనరుల్లో నీరు అందుబాటులో లేని సమయంలో  పరిమిత లోతులను కలిగి ఉంటాయి, అధిక సిల్ట్‌కేషన్‌కు కారణమయ్యే వాటి ఒడ్డు కోత,  అంతర్గత జల రవాణా కోసం కేటాయించిన కార్గో లేకపోవడం, నాన్-మెకనైజ్డ్ నావిగేషన్ లాక్ సిస్టమ్‌లు, టెర్మినల్స్‌లో తగినంత అన్‌లోడ్ సదుపాయం లేకపోవడం, క్రాస్ స్ట్రక్చర్‌ల కారణంగా క్షితిజ సమాంతర మరియు నిలువు క్లియరెన్స్ సమస్యలు, ఫస్ట్ & లాస్ట్ మైల్ కనెక్టివిటీ, వెసెల్ ఫైనాన్సింగ్ ఆప్షన్‌లు లేకపోవడం మరియు లాజిస్టిక్స్ మరియు షిప్పింగ్ మార్కెట్‌లో పాలసీ సపోర్ట్ లేనప్పుడు మారుతుందనే భయం రవాణాదారులు అంతర్గత జలరవాణకు  ఉపయోగించడం.

ఈ సవాళ్లను అధిగమించడానికి మరియు  అంతర్గత జల రవాణా(ఐడబ్ల్యూటీ) ద్వారా కార్గో కదలికను పెంచడానికి చేసిన ప్రయత్నాలు అనుబంధం.-2లో వివరించబడ్డాయి.

జాతీయ జలమార్గాల చట్టం, 2016 కింద ప్రకటించబడిన కర్ణాటకలో ప్రత్యేకంగా 9జలమార్గాలు & 3 అంతర్-రాష్ట్ర జలమార్గాలు ఉన్నాయి. ఈ అన్ని జలమార్గాల యొక్క సాధ్యత/వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక అధ్యయనాల తర్వాత, కాళీ నది (జలమార్గం-52), షరావతి నది (జలమార్గం-90) కర్ణాటక & తుంగభద్ర నది (జలమార్గం-104) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలలో పర్యాటకం మరియు ఫెర్రీ సేవలకు అవకాశం ఉన్నట్లు గుర్తించబడింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాళీ నది (జలమార్గం-52)లో జెట్టీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 2.7 కోట్ల మొత్తాన్ని అందించింది.

 

***


(Release ID: 1944653) Visitor Counter : 102


Read this release in: English , Urdu