గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంపీలాడ్స్‌ నిధులు పెంపు

Posted On: 31 JUL 2023 4:36PM by PIB Hyderabad

ఎంపీలాడ్స్‌ కింద వార్షిక కేటాయింపులను చివరిగా 2011-12 ఆర్థిక సంవత్సరంలో పెంచడం జరిగింది.

'పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం' (ఎంపీలాడ్స్‌) కింద నిధుల మొత్తాన్ని పెంచడంపై సూచనలు సహా, సంబంధిత వర్గాల నుంచి సూచనలు, సలహాలను మంత్రిత్వ శాఖ ఎప్పటికపడ్డు స్వీకరిస్తుంది & పరిశీలిస్తుంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,950 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,370 కోట్లు కలిపి మొత్తం రూ.6320 కోట్ల ఎంపీలాడ్స్‌ నిధులు ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉన్నాయి. ఆరోగ్యం & సమాజంపై కొవిడ్-19 ప్రతికూల ప్రభావాలను నిర్వహించేలా పేదలు & అవసరమైన వాళ్లకు ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వివిధ సామాజిక భద్రత చర్యలు చేపట్టడం సహా మూలధన వ్యయాన్ని పెంచడం కోసం ఆ నిధులను ఆర్థిక శాఖ వద్ద ఉంచడం జరిగింది.

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ ఇవాళ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

*****


(Release ID: 1944497)
Read this release in: English