బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య బొగ్గు గనుల మైనింగ్ కింద వేలం వేసిన బొగ్గు బ్లాకుల వివరాలు
Posted On:
31 JUL 2023 4:36PM by PIB Hyderabad
ఈరోజు వరకు వాణిజ్య వేలంలో అందించే బొగ్గు గనుల వివరాలు, విడతల వారీగా, రాష్ట్రాల వారీగా అనెక్చర్ -1లో చూడవచ్చు.
బొగ్గు గనిని కేటాయించిన తర్వాత, కేటాయింపు పొందిన వ్యక్తి/ సంస్థ బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించే ముందుగా పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పు (ఎంఒఇఎఫ్ & సిసి) మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ, అటవీ అనుమతులను పొందవలసి ఉంటుంది. పర్యావరణ ప్రభావం, వృక్ష & జంతుజాలం, అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ & కాలుష్య నియంత్రణ, నివారణ, అడవుల పెంపకం, క్షీణించిన ప్రాంతాల పునరుద్ధరణ, జంతువుల సంక్షేమం, పర్యావరణ, అటవీ అనుమతులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే ప్రధాన అంశాలు.
వాణిజ్య మైనింగ్ కోసం విజయవంతంగా వేలం వేసిన 86 బొగ్గు గనులలో ఇప్పటివరకూ 5 బొగ్గు గనులు మాత్రమే పని చేస్తుండగా, ఈ గనులలోని అటవీ భూమి వివరాలు అనెక్చర్ 2లో జోడించడం జరిగింది.
***
(Release ID: 1944495)
Visitor Counter : 96