హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో మాదక ద్రవ్యాల కేసులు

Posted On: 26 JUL 2023 5:04PM by PIB Hyderabad

విద్యా  సంస్థల్లో విద్యార్థులు, మైనర్లపై నమోదైన మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించి ఎలాంటి గణాంకాలు లేవు. కాని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్ సిఆర్  బి) 2021 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన తాజా గణాంకాల ప్రకారం రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 2021 సంవత్సరంలో మాదక ద్రవ్యాలు, మనసును మత్తులో ముంచెత్తే పదార్థాల చట్టం (ఎన్ డిపిఎస్) సంబంధించి నమోదు చేసిన కేసుల వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి.

కేంద్రప్రభుత్వం మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి తీసుకున్న చర్యలు...

      i.         మాదక ద్రవ్యాలకు సంబంధించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ చట్టాలను సమర్థవంతంగా అమలు చేసే విషయంలో అందరినీ సమన్వయపరచడం లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ సిఓఆర్ డి యంత్రాంగాన్ని 2016లో ఏర్పాటు చేసింది.

2019 సంవత్సరంలో నాలుగంచెల వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ఆ యంత్రాంగాన్ని పునర్నిర్మించారు.

·       ఉన్నత స్థాయి కమిటీ (కేంద్ర హోం శాఖ కార్యదర్శి నాయకత్వంలో)

·       ఎగ్జిక్యూటివ్ స్థాయి కమిటీ (ఎంహెచ్ఏ ప్రత్యేక కార్యదర్శి (ఐఎస్) నాయకత్వంలో)

·       రాష్ర్ట స్థాయి కమిటీ (సంబంధిత రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో)

·       జిల్లా స్థాయి కమిటీ (జిల్లా మెజిస్ర్టేట్ నాయకత్వంలో)

మరింత సమర్థత, సమగ్రత కోసం విభిన్న స్థాయిల్లో కొత్త సభ్యులను చేర్చడం ద్వారా ఎన్  సిఓఆర్ డి యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేశారు.

     ii.         2019 జూలై 19వ తేదీన జారీ చేసిన ఎంహెచ్ఏ ఆదేశం ప్రకారం భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న కేసుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఏజెన్సీల దర్యాప్తును పర్యవేక్షించడానికి ఒక సంయుక్త సమన్వయ కమిటీని (జెసిసి) నియమించారు.

   iii.         ప్రతీ రాష్ర్టం/కేంద్రపాలిత ప్రాంతం స్థాయిలో పోలీసు శాఖ ఎడిజి/ఐజి నాయకత్వంలో ప్రత్యేకంగా యాంటి నార్కోటిక్స్  టాస్క్  ఫోర్స్  (ఎఎన్ టిఎఫ్) ఏర్పాటు చేశారు.

    iv.         డార్క్  నెట్, క్రిప్టో కరెన్సీల విభాగంలో డార్క్  నెట్ ఆధారంగా జరిగే అనుమానాస్పద మాదక ద్రవ్యాల కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డార్క్  నెట్  టాస్క్  ఫోర్స్  ఏర్పాటు చేశారు.

     v.         సరిహద్దుల వెంబడి అక్రమ రవాణాను నిరోధించడానికి సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే బిఎస్ఎఫ్, ఎస్ఎస్ బి, అస్సాం రైఫిల్స్  దళాలకు నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్  (ఎన్ డిపిఎస్) చట్టం, 1985 కింద ప్రత్యేక అధికారాలు కల్పించారు.

    vi.         సాగర జలాల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సమస్య పరిష్కారానికి ఇండియన్  కోస్ట్  గార్డ్  కు (ఐసిజి) నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్  (ఎన్ డిపిఎస్) చట్టం, 1985 కింద ప్రత్యేక అధికారాలిచ్చారు.

  vii.         రైల్వే నెట్  వర్క్  ద్వారా అంతర్రాష్ర్ట రవాణాను అరికట్టడానికి నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్  (ఎన్ డిపిఎస్) చట్టం, 1985 కింద రైల్వే రక్షణ దళానికి సోదా, స్వాధీనం, అరెస్టు అధికారాలు కల్పించారు.

 viii.         మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం సీమాంతర సమస్య కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 16 దేశాలతో ఎంఓయులు, మరో 02 నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్, ప్రీకర్సర్  కెమికల్స్ అక్రమ రవాణా నిలువరించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.  

    ix.         అమృతసర్, గువాహతి, చెన్నై, అహ్మదాబాద్ లలో నాలుగు ఎన్  సిబి ప్రాంతీయ కార్యాలయాలు; గోరఖ్  పూర్,  న్యూ జల్పాయ్  గురి, అగర్తల, పసిఘాట్/లోయర్  సియాంగ్, రాయపూర్ లలో 5 జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు డెహ్రాడూన్, అమృతసర్, శ్రీనగర్, జైపూర్, రాంచి, భువనేశ్వర్, ఇంఫాల్, గోవా, భోపాల్, కొచ్చిన్, విశాఖపట్టణం, హైదరాబాద్  లలోని 12 సబ్  జోనల్  కార్యాలయాలను అప్ గ్రేడ్  చేశారు. వ్యవస్థాత్మక పటిష్ఠత కోసం ఎన్  సిబిలో 425 కొత్త పోస్టులు ఏర్పాటు చేశారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్  రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు అందించారు.  

===================================

Release ID: 1942890

DRUG SMUGGLING ISSUE 

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులు

26 జూలై 2023

జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్ సిఆర్  బి) 2021 సంవత్సరానికి సంబంధించి ప్రచురించిన తాజా గణాంకాల ప్రకారం రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 2021 సంవత్సరంలో మాదక ద్రవ్యాలు, మనసును మత్తులో ముంచెత్తే పదార్థాల చట్టం (ఎన్ డిపిఎస్) సంబంధించి నమోదు చేసిన కేసుల వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి.

2004లో మత్తు పదార్థాల వినియోగం పరిధి, పాటర్న్, ధోరణులపై నిర్వహించిన సర్వేతో దేశంలో మత్తు పదార్థాల వినియోగం పరిధి, పాటర్న్, ధోరణులపై 2018 సంవత్సరంలో నిర్వహించిన సమగ్ర జాతీయ సర్వే ఫలితాలను పోల్చినట్టయితే అలాంటి ద్రవ్యాల వినియోగ పాటర్న్  లో మార్పులు వచ్చాయి. అయితే 2004 సర్వేలో కేవలం పురుషుల్లో మాదక ద్రవ్యాల వినియోగ ధోరణులపై మాత్రమే సర్వే చేయగా తదుపరి జరిగినది సమగ్ర సర్వే కావడం వల్ల రెండింటికీ పోలిక సాధ్యం కాదు. 2004లో జరిగిన సర్వే జాతీయ స్థాయిలో మత్తు పదార్థాల వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోగా 2018లో రాష్ర్ట స్థాయి వినియోగాన్ని కూడా చేర్చి దానికి మరింత  సమగ్రత కల్పించారు.

క్రమ సంఖ్య

మాదక ద్రవ్యం

2004  సర్వే ప్రకారం వినియోగం తీరుతెన్నులు

-----------------------------

12-60 సంవత్సరాల మధ్య వయస్కుల్లో

2018  సర్వే ప్రకారం వినియోగం తీరుతెన్నులు

---------------------------

10-75 సంవత్సరాల మధ్య వయస్కుల్లో

1

గంజాయి

3%

2.835

2

ఓపియం  సంబంధిత మత్తు పదార్థాలు

0.7%

2.1%

ఆధారం : సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 

కేంద్రప్రభుత్వం మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి తీసుకున్న చర్యలు...

                        i.         మాదక ద్రవ్యాలకు సంబంధించి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ చట్టాలను సమర్థవంతంగా అమలు చేసే విషయంలో అందరినీ సమన్వయపరచడం లక్ష్యంగా ప్రభుత్వం ఎన్ సిఓఆర్ డి యంత్రాంగాన్ని 2016లో ఏర్పాటు చేసింది.

2019 సంవత్సరంలో నాలుగంచెల వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ఆ యంత్రాంగాన్ని పునర్నిర్మించారు.

·       ఉన్నత స్థాయి కమిటీ (కేంద్ర హోం శాఖ కార్యదర్శి నాయకత్వంలో)

·       ఎగ్జిక్యూటివ్ స్థాయి కమిటీ (ఎంహెచ్ఏ ప్రత్యేక కార్యదర్శి (ఐఎస్) నాయకత్వంలో)

·       రాష్ర్ట స్థాయి కమిటీ (సంబంధిత రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో)

·       జిల్లా స్థాయి కమిటీ (జిల్లా మెజిస్ర్టేట్ నాయకత్వంలో)

మరింత సమర్థత, సమగ్రత కోసం విభిన్న స్థాయిల్లో కొత్త సభ్యులను చేర్చడం ద్వారా ఎన్  సిఓఆర్ డి యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేశారు.

                       ii.         2019 జూలై 19వ తేదీన జారీ చేసిన ఎంహెచ్ఏ ఆదేశం ప్రకారం భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న కేసుల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఏజెన్సీల దర్యాప్తును పర్యవేక్షించడానికి ఒక సంయుక్త సమన్వయ కమిటీని (జెసిసి) నియమించారు.

                     iii.         ప్రతీ రాష్ర్టం/కేంద్రపాలిత ప్రాంతం స్థాయిలో పోలీసు శాఖ ఎడిజి/ఐజి నాయకత్వంలో ప్రత్యేకంగా యాంటి నార్కోటిక్స్  టాస్క్  ఫోర్స్  (ఎఎన్ టిఎఫ్) ఏర్పాటు చేశారు.

                      iv.         డార్క్  నెట్, క్రిప్టో కరెన్సీల విభాగంలో డార్క్  నెట్ ఆధారంగా జరిగే అనుమానాస్పద మాదక ద్రవ్యాల కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డార్క్  నెట్  టాస్క్  ఫోర్స్  ఏర్పాటు చేశారు.

                       v.         సరిహద్దుల వెంబడి అక్రమ రవాణాను నిరోధించడానికి సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే బిఎస్ఎఫ్, ఎస్ఎస్ బి, అస్సాం రైఫిల్స్  దళాలకు నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్  (ఎన్ డిపిఎస్) చట్టం, 1985 కింద ప్రత్యేక అధికారాలు కల్పించారు.

                      vi.         సాగర జలాల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సమస్య పరిష్కారానికి ఇండియన్  కోస్ట్  గార్డ్  కు (ఐసిజి) నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్  (ఎన్ డిపిఎస్) చట్టం, 1985 కింద ప్రత్యేక అధికారాలిచ్చారు.

                    vii.         రైల్వే నెట్  వర్క్  ద్వారా అంతర్రాష్ర్ట రవాణాను అరికట్టడానికి నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్  (ఎన్ డిపిఎస్) చట్టం, 1985 కింద రైల్వే రక్షణ దళానికి సోదా, స్వాధీనం, అరెస్టు అధికారాలు కల్పించారు.

                   viii.         మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం సీమాంతర సమస్య కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 16 దేశాలతో ఎంఓయులు, మరో 02 నార్కోటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్  సబ్ స్టెన్సెస్, ప్రీకర్సర్  కెమికల్స్ అక్రమ రవాణా నిలువరించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.

                      ix.         అమృతసర్, గువాహతి, చెన్నై, అహ్మదాబాద్ లలో నాలుగు ఎన్  సిబి ప్రాంతీయ కార్యాలయాలు; గోరఖ్  పూర్,  న్యూ జల్పాయ్  గురి, అగర్తల, పసిఘాట్/లోయర్  సియాంగ్, రాయపూర్ లలో 5 జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు డెహ్రాడూన్, అమృతసర్, శ్రీనగర్, జైపూర్, రాంచి, భువనేశ్వర్, ఇంఫాల్, గోవా, భోపాల్, కొచ్చిన్, విశాఖపట్టణం, హైదరాబాద్  లలోని 12 సబ్  జోనల్  కార్యాలయాలను అప్ గ్రేడ్  చేశారు. వ్యవస్థాత్మక పటిష్ఠత కోసం ఎన్  సిబిలో 425 కొత్త పోస్టులు ఏర్పాటు చేశారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్  రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు అందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్  రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు అందించారు.  

***

(Release ID: 1944227) Visitor Counter : 205

Read this release in: English