రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సైనిక పాఠశాలల విద్యార్థులు

Posted On: 28 JUL 2023 2:26PM by PIB Hyderabad

'నేషనల్ డిఫెన్స్ అకాడమీ'లో ప్రవేశానికి విద్యార్థులను విద్యాపరంగా, శారీరకంగా, మానసికంగా సిద్ధం చేయడం సైనిక పాఠశాలల ప్రాథమిక లక్ష్యం. 33 సైనిక పాఠశాలల విద్యార్థుల్లో అత్యుత్తమ విద్యా నైపుణ్యాలను వివిధ దశల్లో పెంచుతారు. దగ్గరుండి శిక్షణ ఇవ్వడం & విద్యార్థుల పురోగతిని నిశితంగా పర్యవేక్షించడం, నెమ్మదిగా నేర్చుకునేవారికి పునరుశ్ఛరణ తరగతులు, సరికొత్త బోధన అభ్యాసాల పరిచయం, ఇన్-సర్వీస్ కోర్సు, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థుల కోసం అతిథుల ఉపన్యాసాలు & ప్రేరణనిచ్చే పర్యటనలు మొదలైనవి ఆ దశల్లో ఉన్నాయి.

రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక పాఠశాలల సొసైటీ, అన్ని సైనిక పాఠశాలలకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. తద్వారా, ప్రతి పాఠశాల, ప్రత్యేకించి ప్రతి విద్యార్థి విద్యా నైపుణ్యం సాధించేలా చేస్తుంది.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న సైనిక పాఠశాలల ఉపాధ్యాయుల శ్రమను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చే ఈ కింది పురస్కారాలకు నామినేషన్లు పంపడానికి సైనిక పాఠశాలల ఉపాధ్యాయులు అర్హులు:

 

  • ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు
  • సమాచార పంపిణీ సాంకేతికత పురస్కారాలు


ఉపాధ్యాయుల్లో ప్రేరణ పెంచడానికి, సైనిక పాఠశాలల ఉపాధ్యాయులకు సంబంధిత సైనిక పాఠశాల ఛైర్మన్, స్థానిక పరిపాలన బోర్డు, ప్రిన్సిపాల్ నుంచి తగిన ప్రశంసలు, గుర్తింపు అందుతుంది.

 రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

******


(Release ID: 1943861)
Read this release in: English , Urdu