సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పింఛనుదారుల వ్యక్తిగత రికార్డు

Posted On: 26 JUL 2023 7:20PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ప్రాసెసింగ్ మరియు పెన్షనరీ ప్రయోజనాలను మంజూరు చేసే ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పెన్షనర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం సిస్టమ్‌లో సంగ్రహించబడుతుంది.

సర్వీస్ సమయంలో సర్వీస్ బుక్ రికార్డులలో ఈ వివరాలను మార్చడానికి ప్రభుత్వ సేవకుడికి వర్తించే సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పేరు/ఇంటిపేరును సర్వీస్ బుక్‌లో మార్చుకోవడానికి అనుమతించబడతారు.

సీసీఎస్(పెన్షన్) నిబంధనల  ప్రకారం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి కుటుంబ పెన్షన్ ఇవ్వబడుతుంది. అయితే ఒక పెన్షనర్ పదవీ విరమణ తర్వాత తన కుటుంబ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.

ప్రభుత్వం కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీపీఈఎన్జీఆర్ఏఎం) అనే ఆన్‌లైన్ పెన్షన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా  పెన్షనర్ల ఫిర్యాదుల నిర్వహణ కోసం ప్రతి మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్‌లో నోడల్ అధికారులను నియమించారు.

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమం కోసం  ఈ క్రింది చర్యలు చేపట్టింది:-

–పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్ల కోసం నియమాలు మరియు విధానాలను సరళీకృతం చేయడం
–"భవిష్య" అనే ఆన్‌లైన్ పెన్షన్ ప్రాసెసింగ్ మరియు మంజూరు వ్యవస్థను అమలు చేయడం
ప్రభుత్వం కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీపీఈఎన్జీఆర్ఏఎం) అనే ఆన్‌లైన్ పెన్షన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని అమలు చేయడం

–లైఫ్ సర్టిఫికేట్ “జీవన్ ప్రమాణ్” సమర్పించడానికి డిజిటల్ సిస్టమ్ అమలు

–పింఛనుదారుల అవగాహన కార్యక్రమాలు మరియు పదవీ విరమణకు ముందు కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లను నిర్వహించడం
– సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మరియు ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

***


(Release ID: 1943584) Visitor Counter : 90


Read this release in: English