భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఇఇడబ్ల్యులు
Posted On:
26 JUL 2023 5:26PM by PIB Hyderabad
భూకంప ముందస్తు హెచ్చరికలను చేసే వ్యవస్థను పైలెట్ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ (ఎంఒఇఎస్) అనుబంధిత నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సిఎస్- భూకంపశాస్త్ర జాతీయ కేంద్రం) భావిస్తోంది. ఇఇడబ్ల్యుల పైలెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం లక్ష్యిత భౌగోళిక ప్రదేశం, భూకంప చర్యలు సహా వివిధ కారకాల పై ఆధారపడి ఉంటుంది.
భూకంపం సంభవించిన తర్వాత చర్య తీసుకునేందుకు ప్రతిస్పందన సమయం చాలా తక్కువ (కొద్ది క్షణాలు)గా ఉంటుంది. ఘటన మూలం, ప్రతిస్పందనదారుల మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇఇడబ్ల్యుల ఆధారిత సమాచారం విద్యుత్ & గ్యాస్ సరఫరా, విద్యుత్ ప్లాంట్లు, రైళ్ళు మొదలైన కీలక సదుపాయాల కార్యకలాపాలను నిలిపివేయడం ద్వారా వాటిని పరిరక్షించి, ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇఇడబ్ల్యుల సాధ్యాసాధ్యాలను, భారతీయ నేపథ్యానికి తగిన ఆల్గోరిథమ్‌లను (పరిష్కారాలను) అన్వేషించేందుకు యుఎస్ఎ, జపాన్ సహా పలు దేశాలతో సహకరించాలని ఎన్‌సిఎస్ యోచిస్తోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి శ్రీ కిరణ్ రిజిజూ బుధవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1943118)
Visitor Counter : 113