ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి
Posted On:
25 JUL 2023 5:50PM by PIB Hyderabad
రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సిఫార్సుల ఆధారంగా చేసుకుని కేంద్ర ఆహార తయారీ ప్రక్రియ మంత్రిత్వ శాఖ (MoFPI) కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలోని 713 జిల్లాలకు చెందిన 137 ప్రత్యేక ఉత్పత్తులను ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి (ODOP)గా ప్రకటించింది.
జార్ఖండ్ రాష్టంలోని మొత్తం 24 జిల్లాలకు చెందిన 15 ప్రత్యేకమైన ఉత్పత్తులను MoFPI ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి కేటగిరీగా ప్రకటించింది. వాటిలో పెడా, తేనె, బెల్లం, టొమాటో ఆధారిత ఉత్పత్తులు, మిరప ఆధారిత ఉత్పత్తులు, నిమ్మ ఆధారిత ఉత్పత్తులు, మామిడి ఆధారిత ఉత్పత్తులు, జామ ఆధారిత ఉత్పత్తులు, సీతాఫలం ఆధారిత ఉత్పత్తులు, పనస పండు ఆధారిత ఉత్పత్తులు, బంగాళాదుంప ఆధారిత ఉత్పత్తులు, బొప్పాయి ఆధారిత ఉత్పత్తులు మరియు చిన్న అటవీ ఉత్పత్తులు (చింతపండు, మహువా, చిరోంజీ) ఉన్నాయి.
వ్యవసాయోత్పత్తి, మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఉనికి, ODOP తయారీ ప్రక్రియలో ఎస్‌హెచ్‌జిలు/ఎఫ్‌పిఓలు/కోఆపరేటివ్/సూక్ష్మ-ఎంటర్‌ప్రైజెస్ నిమగ్నమై ఉండటం ఆధారంగా ODOPని ఎంపిక చేయడం మరియు ఆ మేరకు సంబంధిత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ సిఫార్సు ఆధారంగా నోటిఫైడ్ జాబితాకు సవరణలు చేస్తారు.
లఘు ఆహార తయారీ సంస్థలు ప్రధానమంత్రి క్రమబద్ధీకరణ (PMFME ) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా, ఆసక్తిఉన్న వ్యక్తులు / సంస్థల ప్రస్తుత స్థాయిని పెంచడానికి లేదా కొత్త లఘు ఆహార తయారీ ప్రక్రియ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి రుణంతో ముడిపడిన సబ్సిడీని MoFPI విస్తరిస్తోంది. రైతు ఉత్పత్తి సంస్థలు /స్వయం సహాయక బృందాలు /సహకార/ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు; స్వయం సహాయక బృందాల సభ్యులకు మూలధనం సమకూర్చడం; ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి కింద గుర్తించిన ఉత్పత్తుల మార్కెటింగ్ & బ్రాండింగ్ కోసం ప్రాజెక్ట్‌లు; మరియు PMFME పథకం మార్గదర్శకాల ప్రకారం శిక్షణా సంస్థల ద్వారా సామర్ధ్యం పెంపుదలకు కూడా తోడ్పాటు ఉంటుంది.
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
***
(Release ID: 1943034)
Visitor Counter : 155