మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

పాలు, పాల ఉత్పత్తులు, పశుదాణా కోసం సహకార సంఘాలు

Posted On: 25 JUL 2023 5:30PM by PIB Hyderabad

నాణ్యమైన పాల ఉత్పత్తి, సేకరణ, పాలు, పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్ , మార్కెటింగ్ కోసం మౌలిక సదుపాయాలను సృష్టించడం / బలోపేతం చేయడం లక్ష్యంగా భారత ప్రభుత్వ పశుసంవర్థక పాడి పరిశ్రమ శాఖ ఫిబ్రవరి-2014 నుండి దేశవ్యాప్తంగా "నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్ మెంట్ (ఎన్ పి డి డి)" పథకాన్ని అమలు చేస్తోంది.

 

ఈ పథకాన్ని జూలై 2021 లో పునర్వ్యవస్థీ కరణ/ మార్పులు చేశారు. మార్పులు చేసిన ఎన్ పి డి డి పథకాన్ని 2021-22 నుండి 2025-26 వరకు మొత్తం రూ .1790 కోట్లతో అమలు చేస్తారు. పునర్వ్యవస్థీకరించిన పథకంలో రెండు భాగాలు ఉన్నాయి: 

 

నాణ్యమైన పాల పరీక్షా పరికరాలు,  ప్రాధమిక శీతలీకరణ సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాలను సృష్టించడం/బలోపేతం చేయడంపై కాంపోనెంట్ ' ఎ‘ దృష్టి పెడుతుంది.

 

కాంపోనెంట్ 'బి' (డెయిరీ త్రూ కోఆపరేటివ్స్-డిటిసి) అవసరమైన డెయిరీ మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామాల లో ఉత్పత్తులకు మార్కెట్ లింకేజీలను అందించడానికి , గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వాటా కలిగిన సంస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

 

ఆర్థిక పురోగతి:

 

కాంపోనెంట్ ' ఎ'

 

2014-15 నుంచి 2022-23 (30.06.2023) వరకు రూ.3053.03 కోట్ల (కేంద్ర వాటా రూ.2321.22 కోట్లు) వ్యయంతో 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 191 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.  ఈ ప్రాజెక్టుల అమలు కోసం 18.07.2023 వరకు మొత్తం రూ.1795.60 కోట్లు విడుదల చేశారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల కింద రూ.1321.53 కోట్లు వినియోగించారు.

 

కాంపోనెంట్ ' బి ‘

 

మొత్తం రూ.1130.64 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో రూ.705.54 కోట్ల రుణ కాంపోనెంట్, రూ.329.70 కోట్ల గ్రాంట్ కాంపోనెంట్, రూ.95.37 కోట్ల ప్రొడ్యూసర్ ఇన్ స్టిట్యూషన్స్ ( పిఐ) వాటాతో మొత్తం 22 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ప్రాజెక్టుల అమలు కోసం పి ఐ లకు మరింత పంపిణీ చేసేందుకు జాతీయ పాడిపరిశ్రమ అభివృద్ధి బోర్డుకు మొత్తం రూ.9.30 కోట్ల గ్రాంటును విడుదల చేసింది.

 

నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్మెంట్ (ఎన్ పి డిడి) పథకంలో భాగంగా "సహకార సంఘాల ద్వారా పాడి పరిశ్రమ-సుస్థిర జీవనోపాధికి కీలకం‘‘ ప్రాజెక్టును భారత ప్రభుత్వం ఆమోదించింది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి అధికారిక అభివృద్ధి సహాయం (ఒడిఎ) రుణంగా రూ.924.56 కోట్లు, భారత ప్రభుత్వ వాటా కింద రూ.475.54 కోట్లు,  రాష్ట్రాల/భాగస్వామ్య సంస్థల వాటా రూ.1.8 కోట్లు కలిపి మొత్తం రూ. 1568.28 కోట్లతో ఈ ప్రాజెక్టు 2021-22 నుండి 2025-26 వరకు అమలు జరుగుతుంది. 2027-28 వరకు కొనసాగుతుంది,

 

వ్యవస్థీకృత మార్కెట్ లోకి రైతుల ప్రవేశాన్ని  పెంచడం, డెయిరీ ప్రాసెసింగ్ సౌకర్యాలు,  మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయడం , ఉత్పత్తిదారుల యాజమాన్యంలోని సంస్థల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పాలు , పాల ఉత్పత్తుల అమ్మకాలను పెంచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం, తద్వారా పాల ఉత్పత్తిదారులకు రాబడిని పెంచడానికి దోహద పడుతుంది". బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాలు మిల్క్ ప్రాసెసింగ్,  మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలు (పాలు , పాల ఉత్పత్తులు , పశువుల దాణా) ఏర్పాటును ప్రోత్సహిస్తాయి.

 

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

 

*****



(Release ID: 1942639) Visitor Counter : 325


Read this release in: English , Urdu