పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బయో ఇంధనాల ఉత్పత్తి

నాడు పోస్టు చేయడమైనది: 24 JUL 2023 6:09PM by PIB Hyderabad

జీ ఇంధనాలపై జాతీయ విధానం- 2018 ప్రకారం..  ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్)/ ఎగుమతి ఆధారిత యూనిట్లలో ఉన్న యూనిట్ల ద్వారా దేశంలో జీవ ఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, వాటి ద్వారా ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన జీవ ఇంధనాల ఉత్పత్తికి సంబంధించిన ఫీడ్‌స్టాక్‌ను దిగుమతి చేసుకోవడం ఎటువంటి పరిమితి లేకుండా అనుమతించబడుతుంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ అందించిన సమాచారం మేరకు 2022–-23 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా భారతీయ వాణిజ్య వర్గీకరణ కింద 3520064 కిలోల బయోడీజిల్ మరియు మిశ్రమం - హార్మోనైజ్డ్ సిస్టమ్ (ఐటీసీహెచ్ఎస్) కోడ్‌ల ఆధారంగా 38260000 ఎగుమతి చేయబడింది.

ఆహార, ప్రజాపంపిణీ శాఖ వడ్డీ రాయితీ పథకం కింద కర్ణాటక రాష్ట్రం నుండి సంవత్సరానికి 144 కోట్ల లీటర్ల ఇథనాల్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి 36 ప్రాజెక్టులకు రూ.119.90 కోట్లు విడుదల చేయబడ్డాయి.

'భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ కోసం 2020-–25'పై వివరణాత్మక నివేదిక 2025–-26 నాటికి భారతదేశంలో 20% ఇథనాల్ కలపడం లక్ష్యాన్ని సాధించడానికి మార్గదర్శకత్వం అందిస్తుంది. 2021-–22 ఇథనాల సప్లయ్ సంవత్సరం కోసం పైన పేర్కొన్న రోడ్‌మ్యాప్‌లో సెట్ చేసిన 10% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యం సాధించబడింది.  

పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ 30.04.2019 నాటి నోటిఫికేషన్ ద్వారా ‘రవాణా ప్రయోజనాల కోసం హై స్పీడ్ డీజిల్‌తో కలపడం కోసం బయోడీజిల్ అమ్మకానికి మార్గదర్శకాలు–-2019’ని విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలలోని నిబంధన ‘x’  ప్రకారం..  బయోడీజిల్ సరైన నాణ్యత మరియు పరిమాణంలో వినియోగదారులకు అందుబాటులో ఉందని నిర్ధారించడానికి బయోడీజిల్ విక్రయించే రిటైల్ అవుట్‌లెట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసే అధికారం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు అధికారులకు ఉంటుంది.

పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మరియు నిర్వాహకులకు కూడా లేఖలు రాసి బయోడీజిల్ పేరుతో అనధికారిక ఉత్పత్తిని విక్రయించే విషయాన్ని పరిశీలించి, ఈ విపత్తును అరికట్టడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసింది. బీఐఎస్ స్పెసిఫికేషన్‌ల ప్రకారం మిశ్రమ జీవ ఇంధనాలను విక్రయించాలనిప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను  ప్రభుత్వం ఆదేశించింది.

పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ మేరకు సమాచారాన్ని అందించారు.

 

***

 


(రిలీజ్ ఐడి: 1942403) సందర్శకుల సూచీ సంఖ్య : : 152
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu