ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పొరుగు దేశాల నుండి సరిహద్దు చొరబాట్ల నివారణకు తనిఖీలు

Posted On: 24 JUL 2023 3:36PM by PIB Hyderabad

సరిహద్దు చొరబాట్లను అరికట్టేందుకు ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంభిస్తోంది. ఇందులో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి బోర్డర్ గార్డింగ్ బలగాలను వ్యూహాత్మకంగా మోహరించడం, సరిహద్దు ఫెన్సింగ్ ఏర్పాటు & ఫ్లడ్‌ లైటింగ్, పెట్రోలింగ్ ద్వారా సరిహద్దులపై ప్రభావవంతమైన ఆధిపత్యం, నకాస్ వేయడం, సరిహద్దుల వెంబడి పర్యవేక్షణ, పోస్ట్‌లను నిర్వహించడం, బోర్డర్ అవుట్ పోస్ట్‌ల (బీఓపీలు) దుర్బలత్వ మ్యాపింగ్, వంటివి ఉన్నాయి. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్ (హెచ్.హెచ్.టి.ఐ), నైట్ విజన్ డివైస్ (ఎన్.వి.డి), ట్విన్ టెలిస్కోప్, యు.ఎ.వి.లు, లాంగ్ రేంజ్ రికనైసెన్స్ అండ్ అబ్జర్వేషన్ సిస్టమ్ (లోరోస్), బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ రాడార్ (బీఎఫ్ఎస్ఆర్), ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ/ క్విప్డ్ సర్వైలెన్స్ వంటి ప్రత్యేక నిఘా పరికరాలు మరియు వాహనాల విస్తరణ వంటివి కూడా ఉన్నాయి. దీనికి తోడు కమాండ్ మరియు కంట్రోల్ సిస్టమ్‌తో ఐఆర్ సెన్సార్లు మరియు ఇన్‌ఫ్రారెడ్ అలారం, కనికరంలేని చొరబాటు నిరోధక కార్యకలాపాలు, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, హాని కలిగించే ప్రాంతాలలో యాంటీ టన్నెలింగ్ విన్యాసం మరియు వాటర్ క్రాఫ్ట్‌లు/బోట్‌లు, తేలియాడే బీఓపీ లు మరియు నదీతీర అంతరాలు వంటి ఆచరణ సాధ్యం కాని సరిహద్దు ప్రాంతాలలో సాంకేతిక పరిష్కారాలు మొదలైనవి వినియోగించడం జరుగుతోంది. చట్టవిరుద్ధమైన సరిహద్దు కార్యకలాపాలను తనిఖీ చేయడానికి, భద్రతా సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత సరిహద్దులలో ఉన్న అవసరాలు,  పరిస్థితులకు అనుగుణంగా భారతదేశ సరిహద్దుల వెంబడి కంచె నిర్మాణం చేపట్టబడింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

****


(Release ID: 1942288)
Read this release in: English , Urdu , Manipuri , Tamil