విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఈటీ హెచ్‌ఆర్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ అవార్డులు 2023 గెలుచుకున్న ఎన్‌టీపీసీ
Posted On:
17 JUL 2023 7:30PM by PIB Hyderabad
ప్రతిష్టాత్మకంగా భావించే 'ఎకనమిక్ టైమ్స్ (ఈటీ) హెచ్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ అవార్డులు 2023'ను ఎన్‌టీసీపీ గెలుచుకుంది. “అభ్యాసం, నైపుణ్యాభివృద్ధిలో ఏఐ/ఏఆర్/వీఆర్ అత్యుత్తమ వినియోగం”, “అధునాతన సంస్థాగత అభ్యాస కార్యక్రమం రూపొందించడంలో అత్యుత్తమ పురోగతి” అంశాల్లో ఈ పురస్కారాలు అందుకుంది. ఎన్‌టీపీసీ డైరెక్టర్ (హెచ్‌ఆర్) శ్రీ దిలీప్ కుమార్ పటేల్, ఈ నెల 13న గురుగావ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్‌టీపీసీ తరపున అవార్డులు స్వీకరించారు.
అభ్యాసం & అభివృద్ధిలో (ఎల్&డీ) వర్చువల్ రియాలిటీ (వీఆర్) వంటి అత్యాధునిక సాంకేతికతల వినియోగం కోసం ఎన్‌టీపీసీ చేస్తున్న కృషికి ఈ అవార్డులు ప్రతిబింబాలు. వర్చువల్ రియాలిటీ ఆధారిత శిక్షణనిచ్చే 'ఐగురు' వంటి ఎల్&డీ కార్యక్రమాల ద్వారా ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్‌టీపీసీ నిబద్ధతను అవి నిదర్శనంలా నిలుస్తాయి. జీపీఐలెర్న్, ఫ్యూచర్‌స్కిల్స్ కోర్సులు, సమర్థ్ మాడ్యూళ్ల వంటి ఇతర వినూత్న శిక్షణ కార్యక్రమాలను కూడా ఎన్‌టీపీసీ అమలు చేస్తోంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో వివిధ ప్రతిష్టాత్మక వేదికలు గుర్తించిన ప్రగతిశీల, ఉత్తమ హెచ్‌ఆర్ పద్ధతులను ఎన్‌టీపీసీ అవలంబిస్తోంది.
ఈసీవో (యూపీఎల్) & ఈడీ (హెచ్‌ఆర్) శ్రీ సీతల్ కుమార్, జీఎం (పీఎంఐ) శ్రీమతి రచన సింగ్ భాల్, జీఎం (ఆర్‌ఎల్‌ఐ) శ్రీ ఎ.కె.త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1940372)
Visitor Counter : 154