రక్షణ మంత్రిత్వ శాఖ
నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ లో గేలరీ అభివృద్ధి చేయడానికి ఇండియన్ పోర్ట్ రైల్, రోప్ వే కార్పొరేషన్ లిమిటెడ్ తో ఎంఓయూ కుదుర్చుకున్న భారతీయ తీర రక్షణ దళం, ఇండియన్ నేవీ
Posted On:
02 JUL 2023 5:28PM by PIB Hyderabad
భారతీయ తీర రక్షణ దళం, భారతీయ నావికాదళం తో ఇండియన్ పోర్ట్ రైల్, రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్ జూలై 2న గాంధీనగర్‌లో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసాయి. దీని ప్రకారం “ భారతీయ తీర రక్షణ దళం, భారతీయ నావికాదళం పరిణామం” అనే ఇతివృత్తంపై గ్యాలరీని అభివృద్ధి చేస్తారు. నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సి)లో ఇది చారిత్రక సింధు లోయ నాగరికత ప్రాంతం లోథాల్ (గుజరాత్) వద్ద నిర్మితమవుతుంది.
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయన ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్‌వేస్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్, సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్హెచ్ఎంసి)ని చారిత్రాత్మక సింధు లోయ నాగరికత ప్రాంతం లోథాల్ (గుజరాత్)లో నిర్మిస్తోంది. ఎన్హెచ్ఎంసి ప్రాజెక్ట్‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 2019లో శంకుస్థాపన చేశారు. సముద్ర మ్యూజియం, లైట్‌హౌస్ మ్యూజియం, సముద్ర థీమ్ పార్కులు, వినోద ఉద్యానవన కేంద్రాలు మొదలైన వాటితో కూడిన ఎన్హెచ్ఎంసి దేశంలోని పురాతన సముద్ర వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. భారతదేశ సముద్ర వారసత్వం గురించి అవగాహన కల్పించేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎడ్యుటైన్‌మెంట్ విధానాన్ని అనుసరించడం ద్వారా ఆధునిక కాలం వరకు పరిణామాలను ప్రదర్శిస్తారు.
ఇది హరప్పా వాస్తుశిల్పం, జీవనశైలిని పునఃసృష్టి చేయడానికి లోథాల్ మినీ రిక్రియేషన్ వంటి అనేక వినూత్నమైన, ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది; నాలుగు థీమ్ పార్కులు - మెమోరియల్ థీమ్ పార్క్, మారిటైమ్, నేవీ థీమ్ పార్క్, క్లైమేట్ థీమ్ పార్క్, అడ్వెంచర్ అండ్ అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్; హరప్పా కాలం నుండి ఇప్పటి వరకు భారతదేశ సముద్ర వారసత్వాన్ని హైలైట్ చేసే పద్నాలుగు గ్యాలరీలు; రాష్ట్రాలు, యూటీల విభిన్న సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే తీర రాష్ట్రాల పెవిలియన్;వీటిలో ఉంటాయి.
****
(Release ID: 1936970)
Visitor Counter : 181