శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిఎస్ఐఆర్ - ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమం ఇతివృత్తం "ప్లాస్టిక్ కాలుష్య నివారణ"

Posted On: 05 JUN 2023 8:15PM by PIB Hyderabad

 

సిఎస్ఐఆర్ -ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్, జూన్ 5న  ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.  "ప్లాస్టిక్ కాలుష్య నివారణ" ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని జరిపారు.

ఉత్తరాఖండ్ సోషల్ డెవలప్‌మెంట్ ఫర్ కమ్యూనిటీస్ (ఎస్డిసి) ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ అనూప్ నౌటియల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   సిఎస్ఐఆర్-ఐఐపి డైరెక్టర్ స్వాగతంతో కార్యక్రమం ప్రారంభమైంది. సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి డి ఠాక్రే ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. 

సిఎస్ఐఆర్-ఐఐపి డైరెక్టర్ ప్రొఫెసర్. ఆర్. ప్రదీప్ కుమార్ తన స్వాగత ప్రసంగంలో వాతావరణ మార్పు, దేశంలో ఇంధన డిమాండ్, ప్రాముఖ్యతను తెలిపారు. ఒక్కసారి నింపిన తర్వాత మళ్లీ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి, మన వనరులను మనం తెలివిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సభకు తెలియజేశారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనూప్ నౌటియాల్ "ప్లాస్టిక్ వ్యర్థాల ప్రమాదాలు" అనే అంశంపై ప్రసంగించారు.ఎవరూ 100 శాతం ఖచ్చితంగా ఉంటారని చెప్పలేమని, అయితే మనం మన అలవాట్లను మార్చుకోవడానికి, తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చని శ్రీ నౌటియల్ అన్నారు. మన ఇళ్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం.. మన దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పరిమితం చేయడానికి, తగ్గించడానికి యువత, కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రోత్సహించడం, అవగాహన కల్పించడం మన సమిష్టి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

 

డాక్టర్ సునీల్ పాఠక్, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, వాతావరణ గడియారం, దాని ప్రాముఖ్యతపై మాట్లాడారు. వాతావరణంలో మార్పు అనేది ప్రపంచం ముందు పెను సవాలు. ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ (ఈఎస్ఎఫ్), ప్రభుత్వ అటల్ ఇన్నోవేషన్ మిషన్‌తో కలిసి, సామాన్య ప్రజలలో వాతావరణ మార్పుల గురించి అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ మార్క్‌ను తాకడానికి మిగిలి ఉన్న సమయం గురించి వాతావరణ గడియారం ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలో వాతావరణ గడియారాన్నిఇప్పటికే ఆవిష్కరించారు. భూమి ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే సమయానికి మనం కేవలం 6 సంవత్సరాల, 47 రోజుల 10 గంటల దూరంలోనే ఉన్నామని ఈ గడియారం వెల్లడించింది. 

                                                          <><><><>


(Release ID: 1930141) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi