గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 నుంచి 2027 కు సిటీస్ 2.0 కు కాబినెట్ ఆమోదం

Posted On: 31 MAY 2023 3:43PM by PIB Hyderabad

సిటీ ఇన్వెస్ట్ మెంట్స్ టూ ఇన్నొవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టెయిన్ 2.0 ( సిటీస్ 2.0) కు  ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కాబినెట్ సమావేశం ఆమోదం  తెలియజేసింది. ఫ్రెంచ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ క్రెడిటాన్ సాల్ట్, యూరోపియన్ యూనియన్, పట్టణ వ్యవహారాల జాతీయ సంస్థ  భాగస్వామ్యంతో భారత గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమం 2023 నుంచి 2027 వరకు నాలుగేళ్ళ పాటు నడుస్తుంది.

నగరం స్థాయిలో సమీకృత వ్యర్థాల నిర్వహణ మీద, రాష్ట్ర స్థాయిలో వాతావరణ సంబంధమైన సంస్కరణ చర్యలు,  సంస్థాపరంగా పటిష్ఠ పరచటం, జాతీయ స్థాయిలో జ్ఞాన సముపార్జన కోసం ఎంపిక చేసిన ప్రాజెక్టులకు మద్దతునివ్వటం ఈ కార్యక్రమ లక్ష్యం.

సిటీస్ 2.0 కు సమకూరే  నిధులలో  యూరోపియన్ యూనియన్ నుంచి 1760 కోట్ల రుణం (200 మిలియన్ యూరోలు) కాగా అందులో  ఎ ఎఫ్ డి నుంచి  కె ఎఫ్ డబ్ల్యూ నుంచి  100 మిలియన్ యూరోల చొప్పున, సాంకేతిక సహాయం కింద రూ. 106 కోట్లు ( 12 మిలియన్ యూరోలు)  ఉన్నాయి.  సిటీస్ 1.0 లో మూడు అంశాలున్నాయి:

 1వ అంశం : 12 నగర స్థాయి ప్రాజెక్టులు పోటీ ద్వారా ఎంపికయ్యాయి

 2వ అంశం :   ఒడిసా రాష్ట్రంలో సామర్థ్య అభివృద్ధి కార్యకలాపాలు

3వ అంశం:   ఎన్ఐయు ఎ చేపట్టున కార్యకలాపాల ద్వారా జాతీయ స్థాయిలో సమీకృత పట్టణ యాజమాన్యాన్ని ప్రోత్సహించటం. అది సిటీస్ 1.0 కి ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయు) .

ఈ కార్యక్రమం కింద మూడు  స్థాయిలలో స్వదేశీ నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు,  బహుళాంశ నిపుణుల ద్వారా సాంకేతిక సహకారం అందింది. దీనివలన నవకల్పనలను,  సమీకృత సుస్థిర పట్టణాభివృద్ధి ఆచరణాలను తగిన పోటీ తత్వంతో సహకార సమాఖ్య విధానం ద్వారా  ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం సాధ్యమైంది.

సిటీస్ 1.0 నమూనా తరువాత వచ్చిన సిటీస్ 2.0 కు మూడు ప్రధాన అంశాలున్నాయి:

1వ అంశం :  కోలుకునే వాతావరణ నిర్మాణం మీద దృష్టి సారించే   అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించటం, పోటీ ద్వారా ఎంపిక చేసిన 18 స్మార్ట్ సిటీస్ లో సమీకృత వ్యర్థాల  యాజమాన్యాన్ని అనుసరించటం, పూర్తి చేయటం

2వ అంశం :   డిమాండ్ ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అర్హమైనవి. రాష్ట్రాలకు ఇచ్చే సహాయంలో (a) ఇప్పటికే ఉన్న రాష్టఱ వాతావరణ కేంద్రాలు/విభాగాలు లేదా వాటితో సమానమైనవి  (b) రాష్ట్ర స్థాయి/నగర స్థాయి వాతావరణ దత్తాంశ అబ్జర్వేటరీల  ఏర్పాటు (c) వాతావరణ దత్తాంశ ఆధారిత ప్రణాళిక, వాతావరణ  కార్యాచరణ   ప్రణాళికలు రూపొందించటం  (d)  మున్సిపల్ బాధ్యుల సామర్థ్య నిర్మాణం. ఈ లక్ష్యాల సాధనకు ఎన్ ఐ యు ఎ లో పీఎంయు సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సహాయాన్ని, వ్యూహాత్మక సహాయాన్ని అందించటం

3వ అంశం :  కేంద్ర, రాష్ట్ర, నగర -  మూడు స్థాయిలలోనూ జోక్యం చేసుకోవటం ద్వారా పట్టణ ప్రాంతాల్లో  వాతావరణ యాజమాన్యానికి సంస్థాగతంగా పటిష్టం చేయటం, సమాచార పంపిణీ, భాగస్వామ్యాలు, సామర్థ్య నిర్మాణం, పరిశోధన, అభివృద్ధికోసం  అన్ని రాష్ట్రాలు, నగరాలలో అండ లభిస్తోంది.

భారత ప్రభుత్వపు వాతావరణ చర్యలకు  ప్రస్తుత జాతీయ కార్యక్రమానికి  (సుస్థిర ఆవాస జాతీయ మిషన్, అమృత్ 2.0, స్వచ్చ భారత్ మిషన్ 2.0, స్మార్ట్ సిటీస్ మిషన్) CITIIS 2.0 అనుబంధంగా పనిచేస్తుంది. అదే విధంగా కాప్-26 కు అది సానుకూలంగా సహకరిస్తుంది.

 

***


(Release ID: 1928747) Visitor Counter : 126