పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మిషన్ లైఫ్‌పై ప్రత్యేక దృష్టితో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023 వేడుకలు
Posted On:
05 MAY 2023 8:35PM by PIB Hyderabad
పర్యావరణం గురించి అవగాహన, చర్యల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ఒక దగ్గరకు చేర్చే సందర్భం ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5). ఈ ఏడాది మిషన్ లైఫ్ పై దృస్టితో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2023ను జరపాలని భారత పర్యావరణ, అడవులు, పర్యావరణ మార్పు భావించింది.
సుస్థిరమైన జీవన శైలిని, ఆచరణలను అందిపుచ్చుకోవాలన్న ప్రపంచ కృషిని పునరుజ్జీవింపచేయాలని స్పష్టమైన పిలుపిస్తూ లైఫ్ (LiFE) అంటే పర్యావరణం కోసం జీవనశైలి అన్న భావనను 2021 యుఎన్ఎఫ్‌సిసిసి సిఒపి 26 ప్రపంచ నాయకుల సదస్సుకు ప్రధాన మంత్రి ప్రవేశపెట్టారు. ఈ వేడుకలకు ముందుగా లైఫ్ పై దేశవ్యాప్తంగా భారీ జన సమీకరణను నిర్వహిస్తున్నారు.
నేషనల్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ (ఎన్ఎంఎన్‌హెచ్)
నేషనల్ జీలాజికల్ పార్క్ సమన్వయంతో నేషనల్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ ప్రజలలో ప్రవర్తనా మార్పులును తీసుకురావడానికి మిషన్ లైఫ్ పై వ్యర్ధాల తగ్గింపు (స్వచ్ఛత చర్యలు) కోసం ప్రజల సమీకరణను ప్రారంభించింది. ఇందులో ఘజియాబాద్‌లోని కెఐఇటి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మీనాక్షీ కారావాల్ వ్యర్ధాల నిర్వహణపై పిపిటి, ప్రదర్శన, ముఖాముఖి సెషన్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారంతా కూడా లైఫ్ చర్యలను అవలంబిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఎన్ఎంఎన్‌హెచ్ ప్రాంతీయ కార్యాలయాల కార్యక్రమాలుః
ఆర్ఎంఎన్‌హెచ్, మైసూర్- ఎన్ఎంఎన్‌హెచ్- ఎంఒఇఎఫ్‌సిసి 05-05-2023న మిషన్ లైఫ్ (పర్యావరణం కోసం జీవనశైలి)లో భాగంగా విద్యార్ధులు, సాధారణ ప్రజలకు మాస్క్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించి, హరిత ప్రతిజ్ఞతో పాటుగా పర్యావరణ అనుకూల జీవనశైలి అవలంబించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.
ఆర్‌జిఆర్ఎంఎన్‌హెచ్, సవాయ్ మాధోపూర్- @ ఎన్ఎంఎన్‌హెచ్ ఇండియా@ఎంఒఇఎఫ్‌సిసిలు # మిషన్ లైఫ్‌పై ఓరియంటేషన్ (నిర్దేశ) కార్యక్రమాన్ని, జల కాలుష్యంపై హరిత ఉపన్యాసం, నీటి పొదుపు, సముద్ర పర్యావరణ వ్యవస్థ, పర్యావరణ మార్పు ప్రాముఖ్యతపై ప్రసంగాలను నిర్వహించాయి. సుమారు 478మంది విద్యార్ధులు, సందర్శకులు, సాధారణ ప్రజలు నీటి పొదుపు, సముద్ర పర్యావరణంః సముద్ర జీవనం, పర్యావరణ మార్పుః వినోదంగా నేర్చుకోండి అన్న అంశాలపై ప్రదర్శనలో చురుకుగా పాల్గొనడమే కాక, ఫిల్మ్ షోలను & సెల్ఫీ కార్నర్‌ను ఆస్వాదించారు.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ)
నీటి పొదుపు, ప్లాస్టిక్‌కు నో చెప్పండి అన్నమిషన్ లైఫ్ అంశాలపై యువతలో అవగాహనను పెంచేందుకు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రజా సమీకరణను ప్రారంభించింది. జెడ్ఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ ధృతి బెనర్జీ దృశ్య మాధ్యమం ద్వారా సుమారు 100 మంది యువతకు, పాల్గొన్న ఔత్సాహిక యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సిఎస్‌సిఎం - జాతీయ సుస్థిర తీర నిర్వహణ కేంద్రం)
లైఫ్ ఆచరణలకు సంబంధించి హరిత ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సిఎస్‌సిఎం), చెన్నై మిషన్ లైఫ్ కోసం ప్రజల సమీకరణను శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమం వరల్డ్ బ్యాంక్ తీరప్రాంత, వ్యవసాయ, పట్టణ స్థితిస్థాపకత, మముందస్తు హెచ్చరిక కోసం హైడ్రోమెట్ సేవ అన్న వర్క్‌షాప్‌లో భాగంగా నిర్వహించారు. తీర ప్రాంత స్థితిస్థాపకతకు సంబంధించి ఉత్తమ ఆచరణలను అభ్యసించడం దీని లక్ష్యం. ఈ వర్క్‌షాప్‌లో బాంగ్లాదేశ్, శ్రీలంక ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొని తీర ప్రాంత నిర్వహణ, సుస్థిర వ్యవసాయ ఆచరణల గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. పర్యావరణ స్థితిస్థాపకత కలిగిన తీర సమాజాన్ని నిర్మించేందుకు తీరప్రాంత పర్యావరణ కోసం నిలకడైన జీవనశైలుల ఆవశ్యకతను ఎన్‌సిఎస్‌సిఎం డైరెక్టర్ తన ప్రారంభోపన్యాసంలో నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. గీతా లక్ష్మి, సిఎస్ఐఆర్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా ప్రొఫెసర్ సునీల్ కుమార్ సింగ్, చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త-జి, అధిపతి డాక్టర్ ఎస్ బాలచంద్రన్, కేరళలోని బిఇడిఆర్ఒసి కు చెందిన డాక్టర్ అన్నీ జార్జ్ కూడా ఉన్నారు.
హరిత ప్రతిజ్ఞలో, వ్యర్ధాలకు వ్యతిరేకంగా, ప్రకృతికి అనుగుణంగా జీవించాల్సిన అవసరంపై సంతకాల సేకరణ ప్రచారంలో భాగస్వాములందరూ పాల్గొన్నారు.
*****
(Release ID: 1922261)
Visitor Counter : 280