సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తవుతున్న సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది: సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్


13 ఐకానిక్ ప్రదేశాలలో అత్యాధునిక ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్రదర్శనలు,
ఎన్ జి ఎం ఎ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ 'జనశక్తి', మన్ కీ బాత్ ఇతివృత్తాలపై అమర్ చిత్ర కథ కామిక్స్

Posted On: 27 APR 2023 6:47PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ఈ నెల 30 వ తేదీ ఆదివారం వందవ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. భారత ప్రభుత్వ సాంస్కృతిక కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ ఈ రోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలలో భాగంగా మన్ కీ బాత్ విలక్షణ వేదికను,  దానిలో ప్రధాన మంత్రి ప్రస్తావించిన సాధకుల గురించి వేడుకలు ఉంటాయని తెలిపారు. ప్రధాన మంత్రి విశిష్టమైన , విప్లవాత్మక చొరవ అయిన మన్ కీ బాత్ 100 వ ఎడిషన్ 2023 ఏప్రిల్ 30 న ఆకాశవాణి ద్వారా ప్రసారం కానుంది.

 

సమ్మిళిత, ప్రజా కేంద్రీకృత పాలన అనే సూత్రంపై దేశ ప్రజలతో ప్రధాన మంత్రి ప్రత్యక్ష సంభాషణ అయిన మన్ కీ బాత్ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, అసాధారణ కృషి చేస్తున్న సాధారణ భారతీయులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక వేదిక అని శ్రీ గోవింద్ మోహన్ అన్నారు. 2023 ఏప్రిల్ 29 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఎ ఎస్ ఐ స్మారక కట్టడాలు  సహా 13 ప్రత్యేకంగా పేరు పొందిన (ఐకానిక్) ప్రదేశాల్లో అత్యాధునిక ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోల ద్వారా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావించిన విభిన్న అంశాలు, ఇతివృత్తాల ఆధారంగా ఒక దేశంగా భారతదేశ వైవిధ్యాన్ని ప్రముఖంగా తెలియచేస్తూ, ప్రతి స్మారక కట్టడం పై ప్రొజెక్షన్ చారిత్రాత్మక, నిర్మాణ ప్రాముఖ్యత ఇంకా ఈ ప్రాంత విలక్షణతను ప్రదర్శిస్తుందని ఆయన చెప్పారు.

 

మరో చొరవగా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎన్ జిఎంఎ సహకారంతో ఒక ఏప్రిల్ 30 న న్యూఢిల్లీలోని ఎన్ జిఎంఎలో జన శక్తి అనే ఆర్ట్ ఎగ్జిబిషన్ ద్వారా అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని కార్యదర్శి తెలిపారు. ఇందులో 12 మంది ప్రఖ్యాత కళాకారులు వేసిన పెయింటింగ్స్ ను ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడవ ముఖ్యమైన చొరవ అమృత్ చిత్ర కామిక్స్ ప్రచురణ, ఇది ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్ లో పేర్కొన్న సామాన్య ప్రజల వీరోచిత కథలను హైలైట్ చేస్తుంది. ఈ వీరుల అనుభవాలను, అసాధారణమైన, మంచి పనిని కథారూపంలో ప్రజెంట్ చేయనున్నట్లు గోవింద్ మోహన్ వివరించారు.

 

ప్రసిద్ధ మాధ్యమం ద్వారా భారతీయ ప్రజలకు అందించడానికి , కనెక్ట్ కావడానికి ఈ కార్యక్రమాలు ఒక ప్రయత్నం అని శ్రీ గోవింద మోహన్ స్పష్టం చేశారు. ప్రజలను ప్రేరేపించడానికి, జాతి నిర్మాణం వైపు వారి ఊహలను ఆకర్షించడానికి మన్ కీ బాత్ ద్వారా ప్రధాని ఇచ్చిన సందేశం ,సూచనలను ఈ కార్యక్రమాలు పునరుద్ఘాటించనున్నాయి.

 

ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్రదర్శనలు నిర్వహించబడే 13 ఐకానిక్ స్మారక కట్టడాలు/ప్రదేశాలు -

 

ఎర్రకోట, ఢిల్లీ

గ్వాలియర్ కోట, మధ్యప్రదేశ్

కోణార్క్ సూర్య దేవాలయం, ఒడిషా

గోల్కొండ కోట, తెలంగాణ

వెల్లూరు కోట, తమిళనాడు

గేట్ వే ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర

నవరతంఘర్ కోట, జార్ఖండ్

రామ్ నగర్ ప్యాలెస్, ఉధంపూర్

రెసిడెన్సీ బిల్డింగ్, ఉత్తర ప్రదేశ్

మోధేరా సూర్య దేవాలయం, గుజరాత్

రంగ్ ఘర్, అస్సాం

చిత్తోర్ గఢ్ కోట, రాజస్థాన్

ప్రధాన మంత్రి సంగ్రహాలయ, న్యూఢిల్లీ

 

సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో మన దేశ చరిత్ర, వారసత్వాన్ని వివరించే ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సందర్శకులు రాత్రి 7 గంటల నుంచి దీన్ని ఆస్వాదించవచ్చు. మన్ కీ బాత్ థీమ్ తో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో ఈ స్మారక చిహ్నం చారిత్రక , నిర్మాణ అద్భుతాన్ని ఈ ప్రదర్శన హైలైట్ చేస్తుంది.

 

ఇది కాకుండా, మన్ కీ బాత్ గత ఎపిసోడ్ లను వినడానికి 'ఆడియో బూత్', ఈ ముఖ్యమైన సందర్భం జ్ఞాపకాలను చిత్రాల ద్వారా సేకరించడానికి 'సెల్ఫీ బూత్', ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడానికి 'మెసేజ్ బూత్' వంటి అనేక ఇతర కార్యక్రమాలు ఈ కార్యక్రమం సరదా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

 

మరో కార్యక్రమంగా, ఎన్ జి ఎం ఎ ఢిల్లీ 2023 ఏప్రిల్ 30న 'జనశక్తి'పై ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కళాకారిణి అంజోలి ఎలా మీనన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సాంస్కృతిక, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరుకానున్నారు.

 

ఈ ఎగ్జిబిషన్ లో నీటి సంరక్షణ, మహిళా సాధికారత, కరోనా మహమ్మారిపై అవగాహన, స్వచ్ఛ భారత్ అభియాన్, పర్యావరణం ,వాతావరణ మార్పులు, భారతీయ వ్యవసాయ వ్యవస్థ, యోగా-  ఆయుర్వేదం, భారతీయ సైన్స్, క్రీడలు, ఆరోగ్యం, స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో భారతదేశం సాధించిన విజయాలు, అమృత్ కాల్ , ఈశాన్య భారతదేశ సంస్కృతి, సంప్రదాయం కళల వేడుకలు వంటి 12 విభిన్న అంశాలపై ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

 

నీటి సంరక్షణపై విభా గల్హోత్రా, మహిళా సాధికారతపై మాధవి పరేఖ్, కరోనా మహమ్మారిపై అవగాహన అంశంపై అతుల్ దోడియా, స్వచ్ఛ భారత్ అభియాన్ అంశంపై రియాస్ కోము, పర్యావరణం, వాతావరణ మార్పు అంశంపై జీఆర్ ఇరాన్, భారత వ్యవసాయ వ్యవస్థపై అషిమ్ పుర్కాయస్థ వంటి ప్రముఖ కళాకారులు ప్రదర్శించనున్నారు. మను పరేఖ్ యోగా  ఆయుర్వేదం థీమ్ పై ప్రజెంట్ చేయనుండగా, తుక్రాల్ ,తగ్రా కళ ద్వారా భారతీయ సాంకేతికత ,అంతరిక్ష శాస్త్ర కోణాలను ప్రదర్శిస్తారు;  అత్యుత్తమ సామర్థ్యాన్ని సాధించడంలో భారతదేశ సంప్రదాయ , ఆధునిక పద్ధతుల ప్రాముఖ్యతను పరేష్ మైతి హైలైట్ చేయనున్నారు;  ప్రతుల్ దాస్ స్వాతంత్ర్యం తరువాత భారతదేశం సాధించిన ఆర్థిక, శాస్త్రీయ, సాంస్కృతిక, విద్యా విజయాలు ,భవిష్యత్తు సంకల్పాల పై దృష్టి పెడతారు. జగన్నాథ పాండా ఈశాన్య భారతదేశం విశిష్ట సాంస్కృతిక, సామాజిక లక్షణాల ప్రాముఖ్యత;   ఇండియా అండ్ ది వరల్డ్ గురించి మంజునాథ్ కామత్ ప్రదర్శిస్తారు. కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్ పర్సన్ కిరణ్ నాడార్ ఈ ప్రాజెక్టుకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

 

ప్రజలతో నేరుగా మమేకం కావడానికి, సాధారణ పౌరులు చేసిన స్ఫూర్తిదాయకమైన పనులను ముందుకు తీసుకురావడానికి మన్ కీ బాత్ ఒక వేదికగా ప్రధాని భావించారు. అందువల్ల, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమర్ చిత్ర కథ సహకారంతో, మన్ కీ బాత్ లో ప్రస్తావనకు వచ్చిన ఇతివృత్తాలు , కథలపై 12 కామిక్ పుస్తకాల శ్రేణిని 2023 ఏప్రిల్ 30 నుండి ఒక సంవత్సరం వ్యవధిలో ప్రారంభించబోతోంది. ఈ పుస్తకం మొత్తం 12 పుస్తక శ్రేణిలో స్థిరంగా ఉండే కాల్పనిక పాత్రల సమూహాన్ని కలిగి ఉంటుంది. ఈ పుస్తకాలను ఆంగ్లంలో ముద్రించి 12 భారతీయ భాషల్లోకి అనువదిస్తారు.

 

ఈ ప్రత్యేక ప్రయత్నం ద్వారా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మన్ కీ బాత్ వంటి కార్యక్రమాన్ని రూపొందించడం వెనుక ఉన్న ఆలోచనా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం, అదే సమయంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం ,కళలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, ప్రచారం చేయడం , ఉత్తేజం కలిగించడం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నాడు మన్ కీ బాత్ ద్వారా జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన రేడియో ప్రసంగం 22 భారతీయ భాషలు, 29 మాండలికాలు, 11 అంతర్జాతీయ భాషలలో బహుళ వేదికల ద్వారా ప్రసారం అయింది. ఆకాశవాణిలో 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ప్రధానమంత్రి మానస శిశువు మన్ కీ బాత్ అందరికీ సమ్మిళిత వేదికను సృష్టించడంలో, జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాల విషయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయడంలో కొత్త శిఖరాలకు చేరుకుంది. ఈ కార్యక్రమం సాధారణ దేశాభివృద్ధిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు మొదలైన వారి గెలుపు, విజయాలను కూడా గుర్తించింది.

 

*****



(Release ID: 1920577) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Marathi , Hindi