ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'జీ 20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (DEWG)' రెండవ సమావేశం ఏప్రిల్ 19, 2023న ముగిసింది.


జీ 20 సభ్యులు, 8 అతిథి దేశాలు, 5 అంతర్జాతీయ సంస్థలు మరియు ఒక ప్రాంతీయ సంస్థ నుండి 81 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రాధాన్య రంగాలైన ‘డిజిటల్ నైపుణ్యాలు’, ‘డిజిటల్ పౌర మౌలిక సదపాయాలు ’ మరియు ‘డిజిటల్ ఆర్థిక రంగంలో సైబర్ సెక్యూరిటీ’ గురించి సుదీర్ఘంగా చర్చించారు.

“డిజిటల్ నైపుణ్యాలపై పరస్పర గుర్తింపు ఫ్రేమ్‌వర్క్”పై బహుళలబ్దిదారుల వర్క్‌షాప్ జరిగింది. ప్రతినిధులు ఐఐటీ-హైదరాబాద్, టీ-హబ్‌ని సందర్శించారు.

భారతదేశం యొక్క నూతన అన్వేషణ ప్రాజెక్ట్‌లు మరియు సాంకేతికతలలో అత్యాధునిక పరిశోధనలను ప్రతినిధులు చూసారు.

సమాంతర ఈవెంట్‌లో భాగంగా నిర్వహించిన డిజిటల్ అనుసంధానం కు సంబంధించిన మూడు అంశాల ప్రత్యేక సదస్సులలో 350+ మంది ప్రముఖులు పాల్గొన్నారు.

Posted On: 19 APR 2023 4:44PM by PIB Hyderabad

మూడు రోజుల ‘జి20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (డీఈడబ్ల్యూజీ) రెండో సమావేశం ఈరోజు 19 ఏప్రిల్ 2023 హైదరాబాద్‌లో ముగిసింది. ఈ సమావేశానికి జీ 20 సభ్యులు, 8 అతిథి దేశాలు, 5 అంతర్జాతీయ సంస్థలు మరియు ఒక ప్రాంతీయ సంస్థ నుండి 81 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి రోజు, అంటే 17 ఏప్రిల్ 2023న, సైడ్ ఈవెంట్‌లలో భాగంగా మూడు నేపథ్య సెషన్‌లు నిర్వహించబడ్డాయి. సెషన్‌లలో ‘హై స్పీడ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ మరియు దాని ప్రభావాలు’, ‘డిజిటల్ సమ్మిళితం- సుదూర ప్రజల అనుసంధానం మరియు ‘సుస్థిర హరిత డిజిటల్ మౌలిక సదుపాయాలు: సవాళ్లు మరియు అవకాశాలు’ వంటి అంశాలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణుల నుండి ప్యానెల్ మధ్య చర్చను మరియు పాల్గొనేవారితో తీవ్రమైన ప్రశ్న సమాధానాలను చూసింది. ప్రతినిధులు ఐఐటీ-హైదరాబాద్‌ను కూడా సందర్శించారు. 5జీ ఉత్పత్తులు, 5జీ ​​బేస్ స్టేషన్‌లు, 6జీ సిస్టమ్ ప్రోటోటైప్‌లు, అటానమస్ నావిగేషన్ టెస్ట్‌బెడ్ మరియు ఏఐ-ఆధారిత ఆర్ ఎన్ఏ- ఎలక్ట్రానిక్ పరీక్ష కిట్ వంటి డిజిటల్ టెలికాం టెక్నాలజీల రంగంలో భారతదేశం యొక్క నవ్య పంథా ప్రాజెక్ట్‌లు మరియు అత్యాధునిక పరిశోధనలను వీక్షించారు. రెండవ రోజు, అంటే ఏప్రిల్ 18, 2023న, కార్యకలాపాలను ఎం ఈ ఐ టీ వై కార్యదర్శి శ్రీ అల్కేష్ కుమార్ శర్మ ప్రారంభించారు మరియు ఆ తర్వాత, ఎం ఈ ఐ టీ వై జాయింట్ సెక్రటరీ శ్రీ సుశీల్ పాల్ అధ్యక్షత వహించారు. జీ 20 అతిథి దేశాలు,అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రతినిధులతో చర్చలను ప్రోత్సహించారు.  “ డిజిటల్ నైపుణ్యాలపై పరస్పర గుర్తింపు ఫ్రేమ్‌వర్క్ ”పై బహుళ-లబ్దిదారుల వర్క్‌షాప్ కూడా నిర్వహించబడింది. ప్రభుత్వం, పరిశ్రమ మరియు విద్యాసంస్థలకు చెందిన సంబంధిత నిపుణులు సంబంధిత రంగంపై ఉత్తమ అభ్యాసాలు మరియు తాజా చొరవను సమర్పించారు. వర్క్‌షాప్‌లో జరిగిన అంతర్దృష్టితో కూడిన చర్చలు పాల్గొన్న ప్రతినిధులచే ప్రశంసించబడ్డాయి. అనంతరం ‘డిజిటల్ నైపుణ్యాలు’ పేరుతో ప్రాధాన్యతా అంశంపై లోతైన చర్చ జరిగింది. పాల్గొన్న ప్రతినిధులు డిజిటల్ పరివర్తన, డిజిటల్ ఆప్టిమైజేషన్ మరియు భవిష్యత్ సంసిద్ద సిబ్బంది ను రూపొందించడంలో డిజిటల్ నైపుణ్య విద్య యొక్క కీలక పాత్ర గురించి చర్చించారు. సమ్మిళిత అభివృద్ధి చర్చలో పునరుద్ఘాటించబడింది.

 

సమావేశం యొక్క మూడవ మరియు చివరి రోజున, జీ 20 సభ్యులు, అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల మధ్య 'డిజిటల్ పౌర మౌలిక సదపాయాలు ’ మరియు ‘డిజిటల్ ఆర్థిక రంగంలో సైబర్ సెక్యూరిటీ వంటి ప్రాధాన్యతా రంగాలపై వివరణాత్మక చర్చలు జరిగాయి. జీ 20 యొక్క వివిధ వర్కింగ్ గ్రూప్‌లు మరియు సమాంతర ట్రాక్‌ల మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి, జీ పీ ఎఫ్ ఐ మరియు హెల్త్ డబ్ల్యూ జీ నుండి సంబంధిత లీడ్‌లు కూడా తమ పురోగతి మరియు డీ ఈ డబ్ల్యూ జీ తో అనుసంధానాన్ని అందించారు. ముఖ్యంగా ఆర్థిక సమ్మిళితం & సార్వత్రిక డిజిటల్ ఆరోగ్యం కు సంబంధించిన డీ పీ ఐ ఇనిషియేటివ్‌లు మరియు భారతదేశంలో వాటి ప్రభావాలు హైలైట్ చేసారు. మూడు రోజుల పాటు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, భారతీయ వంటకాలు, భారతీయ కళలు మరియు భారతదేశంలోని జానపద రూపాల గొప్పతనాన్ని ప్రతినిధులకు ప్రదర్శించారు. తదుపరి దశగా, జీ 20 సభ్యుల మధ్య ద్వైపాక్షిక మరియూ బహుళ-పార్శ్వ సమావేశాల శ్రేణి జరుగుతుంది. డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ యొక్క మూడవ సమావేశాన్ని 2023 జూన్ నెలలో మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించాలని నిర్ణయించారు.

 

***


(Release ID: 1918103)
Read this release in: English