విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్ లో ప్రారంభమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం

మొబైల్ బ్రాడ్ బ్యాండ్, సంపూర్ణ, సుస్థిర డిజిటల్ అంశాలపై మూడు సమాంతర సమావేశాలు నిర్వహించనున్న డీవోటీ
అత్యంత వేగంగా 200 రోజుల వ్యవధిలో 600 జిల్లాలకు 5జీ సౌకర్యం విస్తరించిన భారతదేశం

ఐఐటీ హైదరాబాద్ ను సందర్శించి 5జీ, ఐఓటీ, 6జీ ప్రోటోటైప్, అటానమస్ నావిగేషన్, ఏఐ ఆధారిత ఆర్ఎన్ఏ -ఎలక్ట్రానిక్ కిట్ రంగాల్లో సాగుతున్న అత్యాధునిక పరిశోధన, ప్రాజెక్టులను పరిశీలించిన జీ-20 ప్రతినిధులు

Posted On: 17 APR 2023 5:37PM by PIB Hyderabad

డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటైన జీ-20 వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆల్కేష్ కుమార్ శర్మ జీ-20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులకు స్వాగతం పలికి మూడు రోజుల సమావేశంలో చేపట్టే అంశాలను వివరించారు. టెలికాం శాఖ కార్యదర్శి శ్రీ. కే.రాజారామన్ జీడీపీ. డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమాచార అనుసంధానం చూపే ప్రభావాన్ని ప్రస్తావించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ.ఏ.నారాయణస్వామి నారాయణస్వామి తన ప్రసంగంలో దేశంలో వికలాంగులందరికి సమాచార వ్యవస్థ అందుబాటులోకి తెచ్చే అంశంలో డిజిటల్ అంత్యోదయ విధానం, యాక్సెస్‌బుల్ ఇండియా కార్యక్రమాల ప్రాధాన్యత వివరించారు. అంత్యోదయ విధానం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలు అమలు జరుగుతున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసింహ్ చౌహన్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు ,పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. 200 రోజుల స్వల్ప వ్యవధిలో భారతదేశంలో 600 జిల్లాలకు 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమం అమలు జరిగిందన్నారు. ప్రపంచంలో 2వ అతి పెద్ద టెలికాం వ్యవస్థ కలిగి ఉన్న భారతదేశంలో అతి తక్కువ డేటా ధరలు అమలులో ఉన్నాయన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో 4జీ,5జీ రంగాల్లో అతి తక్కువ కాలంలో భారతదేశం సాధించిన ప్రగతి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 

సమావేశానికి సమాంతరంగా డీవోటీ మూడు అంశాలపై సమావేశాలు నిర్వహించింది. 'హై స్పీడ్ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ -ప్రభావం' అనే అంశంపై జరిగిన సమావేశంలో కేంద్ర డీడీజి-డీవోటీ శ్రీ. వై.జి.ఎస్.సి. కిషోర్ బాబు, సింగపూర్ ప్రభుత్వం డైరెక్టర్ ( అంతర్జాతీయ వ్యవహారాలు ప్రపంచ బ్యాంకు సీనియర్ డిజిటల్ స్పెషలిస్ట్ శ్రీ అరుణ్ శర్మ, ఏపీఏసీ,,జిఎస్ఎంఏ డైరెక్టర్ శ్రీ రాహుల్ షా, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ జాతీయ సుపరిపాలన విభాగం సీఈఓ శ్రీ అభిషేక్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. హై స్పీడ్ సౌకర్యం, సామాజిక రంగాల్లో (విద్య,ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాలు) డిజిటల్ సేవలు, ఏఐ,ఐఓటి, పరిశ్రమ 4.0. సమాజం 5.0 తదితర అంశాలపై చర్చలు జరిగాయి. మొబైల్ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల అందుబాటు, సీనియర్ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సహకారం అందించే అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి.

 2వ సదస్సులో ‘డిజిటల్ ఇన్‌క్లూజన్ - కనెక్టింగ్ ది అన్‌కనెక్ట్డ్’ అనే అంశంపై చర్చలు జరిగాయి. ఐటియూ ప్రత్యేక సలహాదారు శ్రీమతి నూర్ సులీనా అబ్దుల్లా అనుసంధానం చేసిన సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఎల్‌ఐఆర్‌నేసియా సీఈఓ శ్రీమతి హెలాని గల్పయ, దక్షిణాఫ్రికా ఐసీటీ చీఫ్ డైరెక్టర్ ములుంగిసీ మతిమంయే, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ, ఎయిర్ జల్దీ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్, స్ట్రాటజీ అండ్ ఆపరేషన్ మైఖేల్ గింగుల్డ్ సమావేశంలో పాల్గొన్నారు. డిజిటల్ పరివర్తన ద్వారా ప్రపంచంలో నివసిస్తున్న వారందరినీ అనుసంధానం చేయాల్సిన అవసరంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అందుబాటు,, స్వీకరణ, విలువ సృష్టి, వినియోగం, అర్థవంతమైన ఉపయోగాలు, అవగాహన, వేగం, స్థోమత, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నైపుణ్యం వంటి ముఖ్యమైన అంశాలను ప్యానెల్ చర్చించింది.

'సుస్థిర హరిత డిజిటల్ మౌలిక సదుపాయాలు;సవాళ్లు,అవకాశాలు' అనే అంశంపై 3వ సదస్సు జరిగింది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, వాటర్ అధిపతి షువ రహా, ఏపీఏసీ ఎనర్జీ అండ్ వాటర్ స్ట్రాటజీ అధిపతి శ్రీ అవినాష్ శేఖర్, బ్రెజిల్ ప్రభుత్వ డిజిటల్, టెలికాం పాలసీ కోఆర్డినేటర్ ఎయిర్టెల్ సీటీవో శ్రీ రణదీప్ సెఖోన్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. హరిత మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర రంగాలలో హరిత అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు, కర్బన ఉద్గారాల తగ్గింపు, పునరుత్పాదక ఇంధన వనరులు, డిజిటల్ పరివర్తన తదితర అంశాలు సదస్సులో చర్చకు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా అమలు జరుగుతున్న ఉత్తమ పారిశ్రామిక విధానాలు కూడా చర్చకు వచ్చాయి. 

ఐఐటీ హైదరాబాద్ ను సందర్శించి 5జీ, ఐఓటీ, 6జీ ప్రొటోటైప్, అటానమస్ నావిగేషన్, ఏఐ ఆధారిత ఆర్ఎన్ఏ -ఎలక్ట్రానిక్ కిట్ రంగాల్లో సాగుతున్న అత్యాధునిక పరిశోధన, ప్రాజెక్టులను జీ-20 ప్రతినిధులు పరిశీలించారు. 

కార్యక్రమాలు https://www.youtube.com/watch?v=Dy7UCdf8INw లో ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. 

 

***


(Release ID: 1917427)
Read this release in: English