విద్యుత్తు మంత్రిత్వ శాఖ
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి 24X7 నాణ్యమైన, నమ్మదగిన మరియు సరసమైన విద్యుత్ సరఫరా అవసరం: శ్రీ ఆర్.కె. సింగ్, కేంద్ర విద్యుత్ & ఎన్‌ఆర్‌ఈ మంత్రి
ఆర్‌డిఎస్ఎస్ అమలును వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరిన శ్రీ ఆర్.కె.సింగ్
ఇంటిగ్రేటెడ్ రేటింగ్‌లు మరియు వినియోగదారుల సేవా రేటింగ్‌ల క్రింద ప్రధాన డిస్‌కామ్‌ల ప్రదర్శన
Posted On:
10 APR 2023 7:57PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ మరియు ఎన్‌ఆర్‌ఈ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఈరోజు రాష్ట్రాలు మరియు రాష్ట్ర విద్యుత్ వినియోగాలతో జరిగిన సమీక్ష ప్రణాళిక మరియు పర్యవేక్షణ (ఆర్‌పిఎం) సమావేశానికి అధ్యక్షత వహించారు. 2023 ఏప్రిల్ 10 & 11 తేదీలలో న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్, సెక్రటరీ (పవర్) శ్రీ బి. ఎస్. భల్లా, సెక్రటరీ (ఎంఎన్‌ఆర్‌ఇ), అడిషనల్ చీఫ్ శ్రీ అలోక్ కుమార్‌తో పాటు రాష్ట్రాల సెక్రటరీలు/ సెక్రటరీలు/ ప్రిన్సిపల్ సెక్రటరీలు/ సెక్రటరీలు (పవర్/ ఎనర్జీ) మరియు స్టేట్ పవర్ యుటిలిటీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
దేశ ఆర్థిక వృద్ధిలో ఆచరణీయమైన మరియు ఆధునిక విద్యుత్ రంగ ప్రాముఖ్యతను శ్రీ ఆర్.కె.సింగ్ వివరించారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే దేశంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24x7 నాణ్యమైన, విశ్వసనీయమైన మరియు సరసమైన విద్యుత్ సరఫరా అవసరమని ఆయన స్పష్టం చేశారు. రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్ఎస్),అడిషనల్ ప్రుడెన్షియల్ నార్మ్స్ మరియు లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎస్‌పిఎస్) రూల్స్ 2022 వంటి పలు కార్యక్రమాల క్రింద విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచించిన సంస్కరణ చర్యలను చాలా డిస్కామ్‌లు అమలు చేయడం ప్రారంభించాయని సమావేశంలో హైలైట్ చేయబడింది. ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్లు సుంకాల ఉత్తర్వులను సకాలంలో జారీ చేశాయి మరియు ఇంధనం మరియు విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు (ఎఫ్‌పిపిసిఎ)ని కూడా అమలు చేశాయి. టారిఫ్ ఖర్చులను ప్రతిబింబించేలా ఉండాలని మరియు డిస్కమ్‌లు ఆచరణీయంగా ఉండటానికి రెగ్యులేటరీ కమీషన్‌లు ఆచరణాత్మక నష్ట తగ్గింపు పథాలను అనుసరించాలని నొక్కి చెప్పబడింది. జూన్ 2022లో మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన లేట్ పేమెంట్ సర్‌ఛార్జ్ రూల్స్ 2022 నుండి డిస్కమ్‌లు అలాగే జెన్‌కోలు ప్రయోజనం పొందాయని ఆయన పేర్కొన్నారు. సరైన సబ్సిడీ అకౌంటింగ్ ప్రాముఖ్యతను కూడా మంత్రి వివరించారు. ఆలస్యమైన బిల్లింగ్ మరియు సరిపోని చెల్లింపుల సమస్యలను అధిగమించడానికి స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరింగ్ ఒక్కటే పరిష్కారమని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో విద్యుత్ పంపిణీ రంగ పథకాల కోసం ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్‌కు చెందిన ఆర్‌డిఎస్‌ఎస్ మాడ్యూల్‌ను కూడా గౌరవనీయులైన మంత్రి ప్రారంభించారు.ఈ పోర్టల్ అన్ని పంపిణీ రంగ పథకాల పర్యవేక్షణలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది. ఈ వినూత్న ప్లాట్‌ఫారమ్ ఆర్‌డిఎస్ఎస్‌తో సహా విద్యుత్ పంపిణీ పథకాల అమలుపై రియల్‌టైమ్ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. పారదర్శకత మరియు సామర్థ్యాన్ని అనుమతిస్తుంది. ఈ సందర్భంగా గౌరవ మంత్రి 11వ ఇంటిగ్రేటెడ్ రేటింగ్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్ - 2022, డిస్కమ్‌ల 2వ కన్స్యూమర్ సర్వీస్ రేటింగ్ - 2022 మరియు స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ - 2022ని కూడా ప్రారంభించారు. 24 డిస్కమ్‌ల ఇంటిగ్రేటెడ్ రేటింగ్‌లు గత సంవత్సరాల కంటే మెరుగుపడ్డాయి. నాలుగు డిస్కామ్‌లు ఎంఈఎస్‌కామ్,సిహెచ్‌ఈకామ్&జీఈఎస్‌కామ్ మరియు ఏపీ ఈస్టర్న్ డిస్కమ్‌లు 3 నోచ్‌ల ద్వారా చెప్పుకోదగ్గ అభివృద్ధిని కనబరిచాయి. అలాగే మరో 8 డిస్కమ్‌లు ఎంఎస్‌ఈడీసీఎల్,ఏపిడిసిఎల్, అజ్మీర్, కెఎస్‌ఈబి, హెస్కామ్, బెస్కామ్, ఒడిశా సౌత్ మరియు ఒడిశా నార్త్ డిస్కమ్‌లు తమ రేటింగ్‌ల్లో 2 నాచ్‌లు మెరుగుపర్చుకున్నాయి. అదేవిధంగా 24 డిస్కామ్‌ల వినియోగదారుల సేవా రేటింగ్‌లు కూడా మునుపటి సంవత్సరం రేటింగ్‌ల కంటే మెరుగుపడ్డాయి.
ఆర్‌డీఎస్‌ఎస్ పరిధిలోని రాష్ట్రాల్లో పురోగతి స్థితిని సదస్సులో సమీక్షించారు. ఈ పథకం కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు పంపిణీ రంగ ఆర్థిక సాధ్యతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్‌డిఎస్‌ఎస్ కింద ప్రీ-క్వాలిఫికేషన్ క్రైటీరియా మరియు సబ్సిడీ, ఎనర్జీ అకౌంటింగ్ వంటి ఇతర కీలక అంశాలకు సంబంధించి డిస్కమ్‌ల పనితీరును కూడా మంత్రి సమీక్షించారు. పథకం అమలును వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కనుగొనబడిన అధిక లోడ్‌కు ఏ వినియోగదారుపైనా జరిమానా విధించబడదని మరియు దశలవారీగా గత బకాయిలు (ఏవైనా ఉంటే) రికవరీ చేయడంతో పాటు వాస్తవ లోడ్ ప్రాతిపదికన బిల్లింగ్ చేయవచ్చని రాష్ట్రాలకు సూచించబడింది.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం లభ్యత పరంగా వనరులు సమృద్ధిగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ప్రణాళికాబద్ధమైన నిర్వహణ చేపట్టాలని కూడా ఆయన సూచించారు. దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు విద్యుత్ రంగంలో సాధ్యత ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటించారు.
రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం, యుటిలిటీలు మరియు పరిశ్రమలతో సహా అందరు వాటాదారుల సమిష్టి కృషి దేశంలో ఆర్థికంగా లాభదాయకమైన మరియు పర్యావరణపరంగా స్థిరమైన విద్యుత్ రంగం వైపు అవాంతరాలు లేని పరివర్తనను నిర్ధారిస్తుంది.
****
(Release ID: 1915479)
Visitor Counter : 211