ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల కోసం
25 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 36 టెలి మానస్ సెల్‌లను ఏర్పాటు చేశాయి
Posted On:
28 MAR 2023 4:54PM by PIB Hyderabad
దేశంలో నాణ్యమైన మానసిక ఆరోగ్య సలహాలు సంరక్షణ సేవలకు ప్రాప్యతను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం 10 అక్టోబర్ 2022న “నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. 09.03.2023 నాటికి, 25 రాష్ట్రాలు/యుటిలు 36 టెలి మానస్ సెల్‌లను ఏర్పాటు చేశాయి మానసిక ఆరోగ్య సేవలను ప్రారంభించాయి. హెల్ప్‌లైన్ నంబర్‌లో 63806 కాల్‌లును స్వీకరించారు. 22 ఏ–2ఎంఎస్లో మానసిక ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి. ఈ సేవలు పీఎంజేఏవై కింద కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా, 3 కేంద్ర మానసిక ఆరోగ్య సంస్థలు సహా దేశంలో 47 ప్రభుత్వ నిర్వహణలో మానసిక వైద్యశాలలు ఉన్నాయి.
దేశంలో ఆరోగ్య సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, భారత ప్రభుత్వం నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్ఎంహెచ్పీ)ని అమలు చేస్తోంది. ఎన్ఎంహెచ్పీ తృతీయ సంరక్షణ భాగం కింద, మానసిక ఆరోగ్య స్పెషాలిటీలలో పీజీ విభాగాలలో విద్యార్థుల చేరికను పెంచడానికి అలాగే తృతీయ స్థాయి చికిత్స సౌకర్యాలను అందించడానికి 25 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు మంజూరు చేయబడ్డాయి.
మానసిక ఆరోగ్య స్పెషాలిటీలలో 47 పీజీ విభాగాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు/సంస్థలకు కూడా మద్దతునిచ్చింది. అదనంగా, పాఠశాలలు కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రధాన భాగాలతో మానసిక రుగ్మతలు/అనారోగ్యాన్ని గుర్తించడం, నిర్వహించడం చికిత్స చేయడం కోసం దేశంలోని 716 జిల్లాల్లో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డీఎంహెచ్పీ) అమలుకు ప్రభుత్వం మద్దతునిస్తోంది. పని ప్రదేశంలో ఒత్తిడి నిర్వహణ, జీవన నైపుణ్యాల శిక్షణ, ఆత్మహత్య నిరోధక సేవలు సమాచారం, విద్య కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు అవగాహన కల్పన మానసిక అనారోగ్యంతో సంబంధం ఉన్న కళంకాన్ని తొలగించడం లక్ష్యం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా క్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఇవాళ రాజ్యసభలో ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపారు .
***
(Release ID: 1913327)
Visitor Counter : 88